Home
Gadgets

భారత మార్కెట్లోకి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ, ధర తెలుసుకుంటారా ?

లగ్జరీ టెలివిజన్ బ్రాండ్ వియు సరికొత్త ఆవిష్కరణను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

By Hazarath Aiah

లగ్జరీ టెలివిజన్ బ్రాండ్ వియు సరికొత్త ఆవిష్కరణను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఎవ్వరూ తీసుకురాలేని విధంగా తొలి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీయూ 100 పేరుతో ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టీవీని కంపెనీ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ టీవీగా కంపెనీ తెలిపింది. ఇక దీని ధర గురించి తెలుసుకుంటే అందరూ బేజారు కావాల్సిందే. కంపెనీ దీని ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించింది.

224 ఐఫోన్ల సైజు..

224 ఐఫోన్ల సైజు..

ఈ కొత్త టీవీ 100 అంగుళాల ప్యానల్‌, 224 ఐఫోన్ల సైజుతో సమానమని కంపెనీ అభివర్ణించింది. వీయూ సుపీరియర్‌ ప్యానల్‌ టెక్నాలజీతో ఇది రూపొందింది.

4కే ఆల్ట్రా హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే..

4కే ఆల్ట్రా హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే..

4కే ఆల్ట్రా హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లేను ఇది కలిగి ఉండటంతో ప్రీమియం వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను టెలివిజన్‌ వీక్షకులు పొందవచ్చు. 2.5 బిలియన్‌ కలర్స్‌ను ఇది రీప్రొడ్యూస్‌ చేస్తుంది. ఈ టీవీ ద్వారా ఏ+ గ్రేడ్‌ ప్యానల్‌ను కంపెనీ అందిస్తోంది.

5 డాల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌..

5 డాల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌..

5 డాల్బే-సర్టిఫైడ్‌ స్పీకర్స్‌తో ఈ పెద్ద టీవీని వీయూ తీసుకొచ్చింది. ఇది ప్రతి స్వరం కూడా స్పష్టంగా వినిపించేలా.. 2000 వాట్‌ స్పీకర్స్‌ను అందిస్తుంది.

2.5జీబీ ర్యామ్‌

2.5జీబీ ర్యామ్‌

ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో స్మార్ట్‌ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఈ టీవీ, 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను, 2.5జీబీ ర్యామ్‌తో రూపొందింది.

మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌ ..

మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌ ..

గూగుల్‌ ప్లే స్టోర్‌ ఇంటిగ్రేషన్‌, క్రోమోకాస్ట్‌ సపోర్ట్‌ ఈ డివైజ్‌లో ఉన్నాయి. వీయూ 100ను మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. వాయిస్‌ కమాండ్‌లతో లైటింగ్‌ను, ఎయిర్‌ కండీషనింగ్‌ను కూడా ఇది కంట్రోల్‌ చేస్తుంది.

2 యూఎస్‌బీ పోర్ట్‌లు

2 యూఎస్‌బీ పోర్ట్‌లు

మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ/సీఈబీ, బ్లూటూత్‌, వైఫై, ఏవీ ఇన్‌పుట్‌, ఆర్‌ఎఫ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్‌పుట్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఇది కలిగి ఉంది.

ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌

ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌

యూట్యూబ్‌, హాట్‌స్టార్‌, హంగామా వంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌తో ఇది వచ్చింది.

 బరువు 104కేజీలు

బరువు 104కేజీలు

దీని బరువు 104కేజీలు. వీయూ స్టోర్‌కి వెళ్లి, దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో ఇది లభ్యమవుతుంది. వీయూ అధికారిక స్టోర్లలో దీన్ని ప్రస్తుతం కంపెనీ అందిస్తుంది.

పార్టనర్ల స్టోర్ల వద్ద ..

పార్టనర్ల స్టోర్ల వద్ద ..

పార్టనర్ల స్టోర్ల వద్ద కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vu 100 Smart TV with a whopping 100-inch screen, Rs 20 lakhs price tag launched in India more news at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X