Vu 85-inch కొత్త స్మార్ట్‌టీవీ లాంచ్!! ధర 3లక్షలకు పైనే...
స్మార్ట్‌టీవీలను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన భారతీయ కంపెనీ VU ఇప్పుడు తన తాజా ఫ్లాగ్‌షిప్ టెలివిజన్ లో కొత్తగా మరొక టీవీను చేర్చింది. 85-అంగుళాల డిస్ప్లే గల VU మాస్టర్‌పీస్ కొత్త టీవీని రూ.3,50,000 భారీ ధర వద్ద విడుదల చేసారు. 85-అంగుళాల డిస్ప్లే ఎంపికలో లభించే ఈ టీవీ 4K హెచ్‌డిఆర్ క్యూఎల్‌ఇడి స్క్రీన్, డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ మద్దతుతో పాటుగా 50W అంతర్నిర్మిత సౌండ్‌బార్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది అంతర్నిర్మిత విండోస్ 10PCని కూడా కలిగి ఉంది. ఇందులో గల కెమెరా ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మద్దతును ఇస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 9పై ద్వారా రన్ అయ్యే ఈ స్మార్ట్ టెలివిజన్ ప్రస్తుతం రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

VU మాస్టర్ పీస్ టివి 85-inch QLED స్క్రీన్
VU సంస్థ యొక్క స్మార్ట్‌టీవీ సిరీస్ లో కొత్త VU మాస్టర్ పీస్ టివి అత్యంత ఖరీదైనదిగా ఉంది. 3,50,000 ధర వద్ద లభించే కొత్త టీవీ వినియోగదారులకు అద్భుతమైన వ్యూ అనుభవాన్ని ఇస్తుంది. 85-అంగుళాల అల్ట్రా-హెచ్‌డి క్యూఎల్‌ఇడి స్క్రీన్‌తో లభించే ఈ టీవీ డాల్బీ విజన్ ఫార్మాట్ తో పాటుగా హెచ్‌డిఆర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉండడమే కాకుండా 1,000 నిట్ల రేటింగ్ గరిష్ట ప్రకాశంను కలిగి ఉంది. ఈ మాస్టర్‌పీస్ టీవీలో లోకల్ డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంది.

VU మాస్టర్ పీస్ టివి 50W రేటింగ్ స్పీకర్ సిస్టమ్
VU యొక్క తాజా మాస్టర్‌పీస్ టెలివిజన్ బ్లాక్ మరియు ‘అర్మానీ గోల్డ్' కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. టీవీ యొక్క ముందు భాగంలో 50W సౌండ్‌బార్ స్పీకర్ నిర్మించబడి ఉంటుంది. ఈ సిక్స్-స్పీకర్ సిస్టమ్ 50W రేటింగ్ సౌండ్ అవుట్పుట్ను కలిగి ఉంది. ఇది డాల్బీ MS12 మరియు DTS: X రెండు ఫార్మాట్లకు మద్దతును ఇస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు హాట్‌స్టార్ వంటి అన్ని ముఖ్యమైన యాప్ ల స్ట్రీమింగ్ సేవలకు ఇది మద్దతును కలిగి ఉంది. VU మాస్టర్‌పీస్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 9పై ద్వారా రన్ అవుతుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇది బ్లూటూత్-ఎనేబుల్డ్ రిమోట్‌లోని మైక్రోఫోన్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది.

VU మాస్టర్ పీస్ టివి విండోస్ 10PC ఫీచర్స్
VU మాస్టర్ పీస్ టివిలో ఒక ప్రత్యేక ఫీచర్ కలిగి ఉంది. ఇది అంతర్నిర్మిత విండోస్ 10PC తో వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో అంతర్నిర్మిత కెమెరా, ట్రాక్‌ప్యాడ్‌తో వైర్‌లెస్ కీబోర్డ్ మరియు వైర్‌లెస్ మైక్రోఫోన్ కూడా ఉన్నాయి. ఇవి టీవీని ఉత్పాదకత మరియు పని సంబంధిత పనులకు అనుకూలంగా చేస్తాయి. Android TV కార్యాచరణ ప్రత్యేక క్వాడ్-కోర్ ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. ఇది 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








