షియోమికి దేశీయ దిగ్గజం సవాల్, Mi TV 4కి పోటీగా స్మార్ట్ టీవీ

|

టీవీ మార్కెట్లో ఇండియాలో పాగా వేయాలనుకున్న షియోమికి దేశీయ దిగ్గజం షాకిచ్చింది. షియోమి టీవీని సవాల్ చేస్తూ అద్భుత ఫీచర్లతో మార్కెట్లోకి వూ టీవీని వదిలింది. Vu Official Android TV పేరుతో ఈ టీవీలను ఆవిష్కరించింది. మూడు రకాల వేరియంట్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. 43, 49, 55 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లలో ఈ ఆండ్రాయిడ్ టీవీలు విడుదల కాగా వీటిల్లో 4కె అల్ట్రాహెచ్‌డీ (3480 x 2160 పిక్సల్స్) స్క్రీన్ రిజల్యూషన్‌ను పొందుపరిచారు. షియోమీ ఈ మధ్యే ఈ తరహా టీవీలను విడుదల చేయగా అందుకు పోటీగా వూ ఈ కొత్త టీవీలను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. 55 ఇంచుల టీవీ రూ.55,999 ధరకు లభిస్తుండగా, 49 ఇంచుల టీవీ రూ.46,999 ధరకు, 43 ఇంచుల టీవీ రూ.36,999 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఈ నెల 16వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయించనున్నారు.

 

ముగస్తున్న జియో ప్రైమ్ గడువు, మరో మ్యాజిక్ దిశగా జియో !

 వూ ఆండ్రాయిడ్ 4కె టీవీ ఫీచర్లు

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీ ఫీచర్లు

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీల్లో డాల్బీ డిజిటల్, డీటీఎస్ సపోర్ట్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ (ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆధారితం), డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు, వాయిస్ కంట్రోల్ రిమోట్ తదితర ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

రిమోట్లలో వూ యాక్టివాయిస్

రిమోట్లలో వూ యాక్టివాయిస్

వూ విడుదల చేసిన టీవీలలో పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ టీవీలకు ఇచ్చే రిమోట్లలో వూ యాక్టివాయిస్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని సహాయంతో యూజర్లు తమ వాయిస్ ద్వారా టీవీలో సెర్చ్ చేయవచ్చు. 88 భాషలకు వీటిల్లో సపోర్ట్‌ను అందిస్తున్నారు.

వైఫై లేదా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తే..
 

వైఫై లేదా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తే..

నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఆల్ట్‌బాలాజీ తదితర సంస్థలతో వూ భాగస్వామ్యమైనందున ఆయా కంపెనీలకు చెందిన యాప్స్‌ను ఈ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఇవే కాకుండా టీవీలను వైఫై లేదా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లు తమకు నచ్చిన యాప్స్‌ను టీవీల్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

షియోమి వర్సెస్ వూ టీవీ

షియోమి వర్సెస్ వూ టీవీ

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీ ఫీచర్లు

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీల్లో డాల్బీ డిజిటల్, డీటీఎస్ సపోర్ట్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ (ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆధారితం), డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు, వాయిస్ కంట్రోల్ రిమోట్ తదితర ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

Xiaomi 43-Inch Mi TV 4A specifications

43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది.Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ధరలు మధ్య తేడా

ధరలు మధ్య తేడా

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీ 55 ఇంచుల టీవీ ధర రూ.55,999

షియోమి 55 ఇంచుల Mi TV 4 ధర రూ. 39,999

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీ 49 ఇంచుల టీవీ ధర రూ.46,999

వూ ఆండ్రాయిడ్ 4కె టీవీ 43 ఇంచుల టీవీ రూ.36,999

షియోమి Mi TV 4A 43-inch ధర రూ. 22,999

షియోమి Mi TV 4A 32-inch ధర రూ. 13,999

Most Read Articles
Best Mobiles in India

English summary
Vu 'Official Android TV' Series Launched in India, Prices Start at Rs. 36,999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X