ఈ గాడ్జెట్లు ఎందుకు ప్రదర్శనకు ఉంచారో ఎవరకీ అర్థం కాదు
ప్రతి ఏడాది జరిగే Consumer Electronics Show కోసం గాడ్జెట్ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ప్రదర్శనలో దాదాపు వందల గాడ్జెట్లు లాంచ్ కోసం ఎదురుచూస్తుంటాయి.
ప్రతి ఏడాది జరిగే Consumer Electronics Show కోసం గాడ్జెట్ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ప్రదర్శనలో దాదాపు వందల గాడ్జెట్లు లాంచ్ కోసం ఎదురుచూస్తుంటాయి. దాదాపు దిగ్గజ కంపెనీలు అన్నీ తమ నుంచి రాబోయో ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. అలాంటి ఉత్పత్తులు ఈ ఏడాది చాలానే కనువిందు చేశాయి. దురదృష్టం ఏంటంటే వాటితో పాటు కొన్ని స్టుపిడ్ ఉత్పత్తులు కూడా గాడ్జెట్ ప్రియులకు నిరాశను కలిగించాయి.CES 2019 ఈవెంట్లో ఈ సారి ఇలాంటి గాడ్జెట్లు చాలానే కనిపించాయని చెప్పవచ్చు. వాటిలో మచ్చుకు కొన్ని ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

Volo Infrared hair dryer
ఈ ఉత్పత్తి చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఈ మెయిర్ డ్రయర్ మీ వెంట్రుకలలో ఉన్న తడిని తీసివేసే వేడి చేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదని చాలామంది చెబుతున్నారు. ఓవెన్ లో అన్నం ఉడికించినట్లుగా మీ జుట్టు కూడా బాగా వేడెక్కి తల పోటు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎలా ఉందంటే 1940 దశకంలో అస్తమాకు డాక్టర్లు సిగిరెట్లు సూచించినట్లుగా ఉందట

Kohler smart toilet
ఈ టాయెలెట్ గురించి చెప్పాలంటే అనిల్ అంబాని లాంటి ధనవంతులు మాత్రమే వాడతారని చెప్పవచ్చు. సామాన్యులు తమ జీవిత కాల సంపాదన కూడా దీని కొనుగోలుకు సరిపోదు. దీని ఖరీదు దాదాపు 4,88 వేల వరకు ఉంటుందని అంచనా.

Kolibree smart toothbrush
ఇది చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. మొబైల్ అనుసంధానంగా ఈ బ్రష్ పనిచేస్తుంది. మరి పిల్లలు ఓ చేత్తో బ్రష్ మరో చేత్తో మొబైల్ వాడుతూ దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. మరి నిజజీవితంలో ఇది ఎంతరకు సాధ్యమనే అనుమానాలు కలగడం సహజమే.

UrgoNight for sleeping
ఇదొక హెడ్ బాండ్ గాడ్జెట్. దీని ద్వారా మీరు చాలా సంతోషంగా నిదరోకి జారుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఇది తలకు తగిలించుకుని మొబైలల్ యాప్ ద్వారా అనేక రకాల పనులు చేయాల్సి ఉంటుంది. మరి నిదరకు ఉపక్రమించే వారు ఈ పనులను చేస్తారా అనేది ప్రశ్నార్థకమే..


Click it and Unblock the Notifications








