LED,OLED,HD,Full HD,Quad HD,4K,8K,Internet Tv, Smart Tv, మధ్య తేడాలేంటి, ఏది కొంటే బెటర్..?

Written By:

ఈ రోజుల్లో టీవీ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉంటే చాలామంది గర్వంగా భావించే వారు. రోజులు మారిపోయాయి. టెక్నాలజీ అమితవేగంతో దూసుకుపోతోంది. దీంతో టీవీల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. Blck and white నుంచి LED,OLED,HD,Full HD,Quad HD,4K,8K,Internet Tv, Smart Tvలు మార్కెట్లోకి వచ్చేశాయి. రూ. 5 వేలకు లభించే టీవీలు ఇప్పుడు ఏకంగా రూ. 3 లక్షల దాకా చేరాయి. 21 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు.. హెచ్ డీ రెడీ నుంచి 8 కె వరకు వివిధ రిజల్యూషన్లలో ఎల్ఈడీ టీవీలు మార్కెట్లో లభిస్తున్నాయి. మరి వీటిమధ్య తేడాలేంటి, ఏ టీవీ కొంటే బెటర్ అనే విషయంపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. అటువంటి వారి కోసం GIZBOT TELUGU సమస్త సమాచారాన్ని అందిస్తోంది. ఓ లుక్కేయండి.

రూ.93తో నెలంతా అపరిమిత కాల్స్, 1జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LED ( Light-emitting diode)

LCD ( లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే) ని మరికొంత అభివృద్ధి పరిచి మార్కెట్లోకి ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇందులో కాంతి కోసం వాడే బల్బులు ఢిపరెంట్ గా ఉంటాయి. ఎల్ సీడీ డిస్ప్లేలలో కాంతిని ఉత్పత్తి చేయడానికి ఫ్లోరోసెంట్ లైట్లను ఉపయోగిస్తే ఇందులో ల్ఈడీ బల్బులు ఉంటాయి. మిగతా అంత అదే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఎల్ఈడీలు ప్రకాశవంతంగా వెలుగును వెదజల్లడంతోపాటు రంగులను కూడా బాగా చూపిస్తాయి. తక్కువ ధర, ఎక్కువ మన్నిక, విద్యుత్ వినియోగం తక్కువ.

OLED ( organic light-emitting diode)

డిస్ప్లేల ప్యానల్ ఆర్గానిక్ (కార్బన్ ఆధారిత) ఎల్ఈడీలతో ఇవి వచ్చాయి. దీని ద్వారా మీరు ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను బయటకు కనిపిస్తాయి. ఈ డిస్ప్లేలు ఎల్ఈడీల కంటే చాలా మెరుగైన చిత్ర నాణ్యతను, ప్రకాశవంతమైన వెలుగును ఇవ్వగలవు. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయితే వీటి జీవితకాలం సాధారణ ఎల్ఈడీలతో పోలిస్తే కొంత తక్కువగా ఉండడంతోపాటు ధర చాలా ఎక్కువ కావడం వీటికి ఉన్న ప్రతికూలతలు. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ స్పెషల్ అట్రాక్షన్, చాలా సన్నగా, వంచడానికి వీలుగా ఉంటాయి.

క్వాంటమ్ డాట్ ఎల్ఈడీలు (QLED)

ఇవి కూడా ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్ఈడీ డిస్ప్లేల రకానికి చెందినవే. ప్లాస్మా టీవీలు, ఓఎల్ఈడీ టీవీలతో సమానంగా దృశ్య నాణ్యత, ప్రకాశంతమైన డిస్ప్లేలు వీటిలో ఉంటాయి. సాధారణ ఎల్ఈడీ టీవీలు, ప్లాస్మా టీవీల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటాయి. డిస్ప్లే కూడా పలుచగా ఉంటుంది. వీటి ధర సాధారణ ఎల్ఈడీల కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.

High Defination

720 x 1280 పిక్సెళ్లు ఉంటే హెచ్ డీ రిజల్యూషన్ అంటారు. 32 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువ పరిమాణమున్న టీవీల్లో ఈ తరహా రిజల్యూషన్ ఉంటుంది.వీటి దృశ్య నాణ్యత సాధారణంగా ఉంటుంది. అయితే 21 అంగుళాల టీవీల్లో అయితే ఈ స్థాయి రిజల్యూషన్ సరిపోతుంది.

Full HD

1,080 x 1,920 పిక్సెళ్లు ఉంటే ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ అంటారు.హెచ్ డీ ఫార్మాట్ కు రెండింతలు. 32 అంగుళాలు లేదా ఆపై టీవీల్లో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అందజేస్తారు. సాధారణ హెచ్ డీతో పోలిస్తే.. ఫుల్ హెచ్ డీలో దృశ్య నాణ్యత బాగుంటుంది.

Quad HD - QHD

1,440 x 2,560 పిక్సెళ్ల రిజల్యూషన్ ను క్వాడ్ హెచ్ డీగా పేర్కొంటారు. ఫుల్ హెచ్ డీకి ఇది రెండింతలు రిజల్యూషన్. వీటినే 2కె రిజల్యూషన్ గా కూడా పేర్కొంటారు. అయితే ఈ రిజల్యూషన్ లో కొన్ని కంపెనీలు మాత్రమే టీవీలు తయారు చేస్తున్నాయి.

UHD లేదా 4K

2,160 x 4,096 పిక్సెళ్లు ఉంటే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ గా చెప్పవచ్చు. దీనినే 4కె గా పేర్కొంటారు. ఫుల్ హెచ్ డీకి నాలుగు రెట్లు ఎక్కువ రిజల్యూషన్. 40 అంగుళాలు లేదా ఆపై పరిమాణాల్లోని టీవీల్లో 4కె రిజల్యూషన్ అందుబాటులో ఉంటుంది.

8కె (8K) టీవీలు..

4,320 x7,680 పిక్సెళ్లు ఉంటే 8కె రిజల్యూషన్ గా చెప్పవచ్చు. ఇది ఫుల్ హెచ్ డీకి ఏకంగా ఎనిమిది రెట్లు అత్యధిక రిజల్యూషన్. ప్రస్తుతం కొన్ని ప్రముఖ కంపెనీలు కేవలం ఒకటి పలు మోడళ్ల టీవీలను మాత్రమే ఈ రిజల్యూషన్ తో తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిల్లో ఇదే అత్యధిక రిజల్యూషన్.

మీరు మీ స్థలాన్ని బట్టి..

మీరు మీ స్థలాన్ని బట్టి టీవీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింట్లో ఒకే రిజల్యూషన్ ఉంటుంది. అయతే అది స్థలం పరిధిని బట్టి తన దృశ్య నాణ్యతను అందిస్తుంది. చిన్న గది అయిన సందర్భాల్లో వీలైనంత ఎక్కువ రిజల్యూషన్ ఉన్న టీవీని, పెద్ద హాలు వంటివి అయితే తక్కువ రిజల్యూషన్ ఉన్నాసరే.. పెద్ద టీవీని తీసుకోవడం బెటర్.

సాధారణ ఎల్ఈడీ టీవీలు

ఇవి బేసిక్ సదుపాయాలు ఉండే ఎల్ఈడీ టీవీలు. కేవలం కేబుల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ ద్వారా వివిధ చానళ్లను చూసుకోవచ్చు. అయితే పెన్ డ్రైవ్, హార్డ్ డ్రైవ్, మెమరీ కార్డులను అనుసంధానించుకునేందుకు యూఎస్ బీ పోర్టులు ఉంటాయి. తద్వారా వాటిల్లోని ఆడియో, వీడియోలను టీవీలో నేరుగా ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంటర్నెట్, వైఫై వంటి సదుపాయాలేమీ వీటిలో ఉండవు.

స్మార్ట్ టీవీలు

ఈ రకమైన ఇంటర్నెట్ టీవీల్లో పేరుకు తగినట్లు ఇంటర్నెట్ వినియోగానికి వీలుగా ఉంటాయి. వీటిల్లో వైఫై, బ్లూటూత్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇన్ బిల్ట్ గా ఇంటర్నెట్ బ్రౌజర్, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటి కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ అయి వస్తాయి.

ఫుల్ స్మార్ట్ టీవీలు

వీటిని పూర్తిస్థాయి స్మార్ట్ టీవీలుగా చెప్పవచ్చు. చాలా వరకు ఈ టీవీలు గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో బ్లూటూత్, వైఫై వంటి సదుపాయాలతో పాటు, అన్ని రకాల యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దేనికైనా ఇంటర్నెట్ కనెక్షన్, డేటా అందుబాటులో ఉండాలి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Whats the Difference Between Different Television Screen Types and Why Should I Care more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot