Home
Gadgets

ఇయర్‌బడ్స్‌ కొనుగోలు చేస్తున్నారా.. ANC, ENC, లేటెన్సీ, బ్యాటరీ లైఫ్ అంటే ఏంటో తెలుసా?

ఫెస్టివల్‌ సీజన్ వచ్చిందంటే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థలు సహా ఇ-కామర్స్ సంస్థలు సేల్‌లు నిర్వహిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో అనేక మంది ఇయర్‌బడ్స్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అనేక మంది బ్యాటరీ లైఫ్‌, డిజైన్, బ్రాండ్‌, ధర ఆధారంగా కొనుగోలు చేస్తుంటారు. మరికొంత మంది ఇతరుల సలహాలతో ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల ఇయర్‌ఫోన్స్‌ (TWS Earbuds) అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో వైర్‌ ఇయర్‌ఫోన్స్‌, TWS బడ్స్‌, నెక్‌ బ్యాండ్‌ లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్‌ ధర వరకు అందుబాటులో ఉన్నాయి. దేశీయ సహా అనేక విదేశీ బ్రాండ్‌ల ఇయర్‌బడ్స్‌ను విక్రయిస్తున్నాయి. అయితే వైర్‌ ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే నెక్‌బ్యాండ్‌, TWS (ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో) ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

TWS Earbuds Purchase Guide

ప్రస్తుతం ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నవారు ముఖ్యంగా బ్యాటరీ, సౌండ్ క్వాలిటీ, ANC, ధర, బ్రాండ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్‌లను తనిఖీ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు TWS బడ్స్‌ను కొనుగోలు చేసే సమయంలో టచ్‌ కంట్రోల్‌ ఫీచ‌ర్స్‌ చూసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

TWS ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు ముఖ్యంగా బ్లూటూత్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న డివైజ్‌లు 5.0+ కనెక్టివిటీతో ఉంటున్నాయి. అయితే ఇందులోనూ బ్లూటూత్‌ 5.3, 5.4 వెర్షన్‌లు కలిగిన ఇయర్‌బడ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

దీంతోపాటు ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేస్తున్న సమయంలో ANC, ENC ఫీచర్‌లు కలిగిన TWS బడ్స్‌ను కొనుగోలు చేసుకోవాలి. ANC అంటే యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌. ఈ ఫీచర్‌ ద్వారా బయట నుంచి వచ్చే శబ్దాలను నియంత్రించి, సౌకర్యవంతంగా బడ్స్‌ను వినియోగించుకోవచ్చు. అదే ENC అంటే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌. ఈ ఫీచర్‌ ద్వారా కాలింగ్ సమయంలో బయట నుంచి వచ్చే శబ్ధాలను కట్టడి చేస్తుంది.

దీంతోపాటు TWS ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేసే సమయంలో లేటెన్సీ ను కూడా చూడాల్సి ఉంటుంది. వీడియో, ఆడియోను సరిగ్గా సింక్ చేయడమే లేటెన్సీ. అయితే తక్కువ లేటెన్సీ ఉన్న TWS బడ్స్‌ను మంచి బడ్స్ గా భావిస్తారు. ఎక్కువగా గేమింగ్‌ కోసం వినియోగించేవారు తక్కువ లేటెన్సీ ఉన్న ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేసుకోవాలి.

ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ లైఫ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. TWS బడ్స్‌ను ప్రస్తుతం ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు బడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ కనీసం 35 గంటలపాటు ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న బడ్స్‌ 35 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తున్నాయి.

ప్రస్తుతం TWS ఇయర్‌బడ్స్‌ ధరలు రూ.999 నుంచే ప్రారంభం అవుతున్నాయి. అనేక దేశీయ, విదేశీ బ్రాండ్‌లు బడ్స్‌ను భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆపిల్‌, శాంసంగ్‌ వంటి సంస్థలు ప్రీమియం డిజైన్‌, పనితీరుతో TWS (True Wireless Stereo) ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Why It is Important to Consider ANC, ENC and Latency Features Before Buying TWS Earbuds
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X