ఇలా చేస్తే.. కేవ‌లం రూ.300తో మీ మొబైల్ waterproof గా మారిపోతుంది!

|

ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్ స‌ర్వ‌సాధార‌ణం అయింది. అయితే, మీది ప్రీమియం ఫోనా, బ‌డ్జెట్ ఫోనా అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌తి ఒక్క‌రికి త‌మ మొబైల్ భ‌ద్ర‌త అనేది చాలా ముఖ్యం. వ‌ర్షాకాలం వచ్చిందంటే ఓ టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. వ‌ర్షాకాలంలో బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు మొబైల్ ఎక్క‌డ నీటితో త‌డిచి పోతుందో అని. నీటి నుంచి మొబైల్ ర‌క్షించుకోవాల‌నే భ‌యం ఎప్పుడూ ఉంటుంది. Apple మరియు Samsung నుండి విడుద‌లైన ప్రీమియం డివైజ్‌లు waterproof క‌లిగి ఉన్నాయి.. అయినప్పటికీ, వాటికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.

 
ఇలా చేస్తే.. కేవ‌లం రూ.300తో మీ మొబైల్ waterproof గా మారిపోతుంది!

ప్ర‌స్తుతం ప‌లు న‌గ‌రాల్లో అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వర్షం నుండి ఫోన్‌ను రక్షించే మార్గం కోసం జ‌నాలు వెతుకుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌కు మార్కెట్లో ఓ ప‌రిష్కారం ఉంది. అదేంటంటే.. వాట‌ర్ ప్రూఫ్ క‌వ‌ర్లు మార్కెట్లో అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే, వీటి కోసం మీరు పెద్ద‌గా ఖ‌ర్చు చేయాల్సి అవ‌స‌రం లేదు. స‌ర‌స‌మైన ధ‌ర‌లో కేవ‌లం రూ.300 లోపు మీరు దీన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

waterproof పౌచ్‌:

waterproof పౌచ్‌:

ఇక్కడ మనం మ‌నం చ‌ర్చించుకుంటున్న‌ వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్ చాలా స‌ర‌స‌మైన ధ‌ర‌కే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సాధారణ పర్సులా కనిపించే ఈ పౌచ్ మీ ఫోన్‌ను నీటి నుండి రక్షించగలదు. దీని కోసం మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన ప‌ని లేఉ. మీరు ఏదైనా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో BOBO వాట‌ర్ ప్రూఫ్ పౌచ్ అని టైప్ చేయ‌డం ద్వారా మీరు ఈ పౌచ్‌ను క‌నుగొన‌వ‌చ్చు. ప్ర‌స్తుతం అమెజాన్‌లో ఇది రూ.300లోపు ధ‌ర‌లోనే అందుబాటులో ఉంది. అది న‌చ్చ‌క‌పోయినా.. మీకు బ్రాండ్ మరియు నాణ్యత ప్రకారం వివిధ ధరలలో వివిధ కంపెనీల పౌచ్‌లను కొనుగోలు చేయ‌డానికి అవ‌కాశం ఉంది.

ముఖ్య‌మైన ప‌త్రాలు కూడా భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు:
ఈ పౌచ్‌లో మీరు ఉంచడం ద్వారా మీ ఫోన్ మరియు ఇతర అవసరమైన పత్రాలను సుర‌క్షితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పౌచ్‌లు గాలి లోప‌లికి వెళ్ల‌కుండా జిప్ లాక్‌లతో వస్తాయి కాబట్టి, నీరు లోపలికి వెళ్లే అవ‌కాశం ఉండ‌దు.

వాట‌ర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు ఎంతో ఖ‌రీదు.. కాబ‌ట్టి ఈ ఉపాయం మేలు:
 

వాట‌ర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు ఎంతో ఖ‌రీదు.. కాబ‌ట్టి ఈ ఉపాయం మేలు:

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మేము దాని కెమెరా, డిస్‌ప్లే మరియు ప్రాసెసర్‌ని తరచుగా తనిఖీ చేస్తాము. ఇలా అనేక ర‌కాలైన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను చూసి కొనుగోలు చేస్తాం. ఒక మొబైల్ కొనే ట‌ప్పుడు ఇన్ని జాగ్ర‌త్త‌లు పాటించే వినియోగదారులు దాని భ‌ద్ర‌త‌కు కూడా అన్నే జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటారు. అటువంటి ఆందోళ‌న ఉన్న వినియోగ‌దారులు, కొంతమంది వినియోగదారులు వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. తద్వారా వారి మొబైల్ అనుకోకుండా నీటిలో ప‌డినా బాధపడాల్సిన అవసరం ఉండ‌దు.

మార్కెట్లో చాలా వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని కొనడం చాలా ఖరీదైనది. అటువంటి పరిస్థితిలో, వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్ మన ఫోన్‌కు మంచిది. ప్ర‌స్తుతం, మార్కెట్లో వివిధ కంపెనీల నుంచి వేర్వేరు ధ‌ర‌ల్లో ప‌లు వాట‌ర్ ప్రూఫ్ క‌వ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

అదేవిధంగా, మార్కెట్లో రూ.100 లోపు అందుబాటులో ఉన్న రోజువారి వినియోగించే ప‌లు గ్యాడ్జెట్ల గురించి కూడా తెలుసుకుందాం:

అదేవిధంగా, మార్కెట్లో రూ.100 లోపు అందుబాటులో ఉన్న రోజువారి వినియోగించే ప‌లు గ్యాడ్జెట్ల గురించి కూడా తెలుసుకుందాం:


Cable Protector
సాధార‌ణంగా ఛార్జింగ్ కేబుల్స్ కావ‌చ్చు, మ‌రేదైనా డేటా కేబుల్ కావ‌చ్చు. వాటిని కొద్ది రోజులు వినియోగించిన త‌ర్వాత‌ పిన్ వ‌ద్ద వైర్‌ లీడ్స్ బ‌య‌టికి తేలి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాంటప్పుడు షాక్ వ‌చ్చే ప్ర‌మాదాలు ఉంటాయి. ఇలాంటి వాటిని నివారించ‌డానికి మీరు కేబుల్ ప్రొటెక్ట‌ర్ అనే గాడ్జెట్‌ను మీరు వినియోగించ‌వ‌చ్చు. మార్కెట్లో ఇవి రూ.100 లోపే స‌ర‌స‌మైన ధ‌ర‌లో కొనుగోలు చేయ‌డానికి అందుబాటులో ఉన్నాయి. ఇది మీ కేబుల్‌ను పూర్తిగా సురక్షితంగా ఉంచుతుంది.

4-Port USB Hub

4-Port USB Hub

మీరు ఎప్పుడైనా మీ ల్యాప్‌టాప్‌కు కొన్ని పెన్ డ్రైవ్‌లు, లేదా డేటా కేబుల్స్ కనెక్ట్ చేయ‌ల‌నుకున్న‌ప్పుడు డివైజ్‌కు ఉండే పోర్టులు స‌రిపోవు. ఎందుకంటే.. ల్యాప్‌టాప్‌ల‌కు మ‌హా అయితే ఒకటి లేదా రెండు యూఎస్‌బీ పోర్టులు మాత్ర‌మే కంపెనీలు ఆఫ‌ర్ చేస్తాయి. కాబ‌ట్టి ఎక్కువ పోర్టులు యూజ్ చేయాల‌నుకున్న‌ప్పుడు అవి స‌రిపోవు. కాబ‌ట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు మార్కెట్లో 4 పోర్ట్ యూఎస్‌బీ పోర్ట్ గాడ్జెట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. అది కూడా రూ.100 లోపే అందుబాటులో ఉన్నాయి. అధికంగా యూఎస్‌బీ పోర్టులు అవ‌స‌రం ఉంటుంది అనుకునే వ్య‌క్తులు వాటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ నాలుగు పోర్ట్ USB హబ్‌ని మనం కేవలం రూ.99కే కొనుగోలు చేయవచ్చు.

USB Optical Mouse

USB Optical Mouse

రూ.100 కంటే తక్కువ ధరతో మీరు పొందగలిగే మరో అద్భుతమైన గాడ్జెట్ ఆప్టికల్ మౌస్. జిబ్రానిక్ కంపెనీకి చెందిన ఈ ఆప్టిక‌ల్ మౌజ్ 1200 dpi మూడు బటన్లు మరియు 1.2m కేబుల్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడు ధర విషయానికొస్తే.. ఇది కేవలం రూ.84 ధరకే వ‌స్తోంది. గేమింగ్ మౌస్ లేదా మరేదైనా సాధారణ మౌస్‌తో పోలిస్తే ఇది చిన్నదని చెప్పొచ్చు. కానీ, ఇది బాగా పనిచేస్తుంది.

 

Best Mobiles in India

English summary
with only Rs.300 you can make your smartphone as waterproof.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X