చాక్లెట్లు వద్దు, గ్యాడ్జెట్లు ముద్దు.. ఈ 5 గ్యాడ్జెట్లతో మీ అమ్మ, భార్య, సోదరిని సర్‌ప్రైజ్ చేయొచ్చు!!
మహిళా దినోత్సవం అనేది మీ జీవితంలోని మహిళలను ప్రత్యేకంగా గౌరవించుకునే సమయం. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న జరుపుకుంటారు. ఈరోజు మీ అమ్మ, సోదరి, భార్య లేదా స్నేహితురాలు ఎవరైనా కావచ్చు, వారు మీ కోసం చేసే ప్రతిదానికీ కృతజ్ఞత చూపడానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ 2025 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం రొటీన్ చాక్లెట్లు, పువ్వులు కాకుండా, వారికి నిజంగా ఉపయోగపడే బహుమతిని ఇవ్వవచ్చు.
ఒక మంచి గ్యాడ్జెట్ వారి జీవితాన్ని మరింత సులభతరం, ఆనందదాయకం చేస్తుంది. వారి పని సామర్థ్యం పెంచడం నుంచి రోజువారీ పనులను సులభతరం చేయడం వరకు, ఈ స్మార్ట్ డివైజ్‌లు మీ ప్రేమను, కృతజ్ఞతను తెలియజేయడానికి సరైన మార్గం. మహిళలు నిజంగా ఇష్టపడే ఐదు ముఖ్యమైన గ్యాడ్జెట్‌లు ఇప్పుడు చూద్దాం.

* మివి సూపర్‌పాడ్స్ Concerto TWS ఇయర్‌ఫోన్స్
మీ ఆడవారికి సంగీతం, పోడ్‌కాస్ట్‌లు లేదా ఆడియోబుక్‌లు అంటే ఇష్టమైతే, మివి సూపర్‌పాడ్స్ Concerto TWS ఇయర్‌ఫోన్స్ చక్కని ఎంపిక. ఈ స్టైలిష్ ఇయర్‌బడ్స్‌లో మెటల్ యునిబాడీ డిజైన్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్నాయి. ఇవి స్పష్టమైన సౌండ్‌ను అందిస్తాయి.
అవి బ్లూటూత్ 5.4, LDAC కోడెక్‌తో వస్తాయి, బలమైన కనెక్టివిటీ, అధిక-నాణ్యత ఆడియోను అందిస్తాయి. అంతేకాదు, ఇవి అనేక రంగుల్లో లభిస్తాయి, ఇది స్టైలిష్, యూజ్‌ఫుల్ టెక్ గిఫ్ట్ గా నిలుస్తుంది. వీటిని ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లో కూడా కొనేసి రేపే బహూకరించవచ్చు.
* యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ విత్ M3
కొత్త యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ మోడల్ M3 ప్రాసెసర్‌తో మునుపెన్నడూ లేనంత వేగంగా, శక్తివంతంగా మారింది. ఇది మునుపటి వెర్షన్ కంటే 35% వేగవంతమైన CPU పనితీరును, 40% మెరుగైన గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. ఇందులో AI- ఫీచర్లు కూడా ఉన్నాయి. డైనమిక్ కాషింగ్, రే ట్రేసింగ్ వంటి అత్యధిక ఫీచర్లు కూడా దీని సొంతం.
ఈ టాబ్లెట్ పని, క్రియేటివిటీ, వినోదం ఇలా అన్ని రకాల అవసరాలకు బాగా సరిపోతుంది. మీ సిస్టర్ లేదా మదర్ లేదా లవర్ డ్రాయింగ్, రైటింగ్, గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ ఇష్టపడినా, ఈ ఐప్యాడ్ అన్నింటినీ చేయగలదు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఉపయోగం కోసం అత్యంత సమర్థవంతమైన పరికరం కావాలనుకునే మహిళలకు ఇది అద్భుతమైన బహుమతి.
* Dreame AirStyle - మల్టీ-యూజ్ హెయిర్ స్టైలింగ్ టూల్
జుట్టును స్టైలిష్‌గా చేసుకోవడానికి ఇష్టపడే మహిళలకు డ్రీమ్ కమ్ ట్రూ ఈ డ్రీమీ ఎయిర్‌స్టైల్. ఈ ఆల్ ఇన్ వన్ టూల్ జుట్టును ఆరబెట్టడానికి, రింగులు రింగులుగా చేయడానికి, జుట్టును ఒత్తుగా చేయడానికి, స్మూత్ చేయడానికి ఐదు అటాచ్‌మెంట్‌లతో వస్తుంది. ఇది జుట్టు డ్యామేజ్ కాకుండా తక్కువ వేడిని ఉపయోగిస్తుంది.
హెయిర్ స్టైలింగ్ పనిని చాలా త్వరగా, సులభంగా చేస్తుంది. మీ ఆడవారు గంటలు గంటలు జుట్టు కోసం కేటాయించకుండా సెలూన్ లాంటి ఫలితాలను కోరుకుంటే, ఇది సరైన బహుమతి. దీన్ని ఆన్‌లైన్ లో కొనవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్ లో కూడా లభిస్తాయి.
* గార్మిన్ వెను 3s 3s స్మార్ట్‌వాచ్
ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ను ఇష్టపడే మహిళలకు Garmin Venu 3s స్మార్ట్‌వాచ్ అద్భుతమైన ఎంపిక. ఇది 1.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 14-రోజుల బ్యాటరీ లైఫ్, 30కి పైగా స్పోర్ట్స్ యాప్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్‌ను ట్రాక్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌తో కాల్స్, టెక్స్ట్‌లు, మ్యూజిక్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. అందుకు ఇందులో ప్రత్యేకంగా ఫీచర్లు ఇచ్చారు. ఇది రోజువారీ జీవితానికి స్టైలిష్ యాక్సెసరీగా నిలుస్తుంది. అంతేకాదు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మహిళల ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇది గిఫ్ట్‌గా ఇస్తే వారు ఫిదా అవ్వడం ఖాయం.
* boAt ట్యాగ్ బ్లూటూత్ ట్రాకర్
ఎప్పుడూ బయట తిరిగే మహిళలకు బోట్ ట్యాగ్ బ్లూటూత్ ట్రాకర్ బాగా సరిపోతుంది. ఇది గూగుల్ ఫైండ్ మై డివైస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది, పోగొట్టుకున్న వస్తువులను నిజ సమయంలో ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. 80dB అలారం, తెలియని ట్రాకర్ హెచ్చరికలతో, కీలు, వాలెట్‌లు లేదా బ్యాగులు వంటి ముఖ్యమైన వస్తువులకు అదనపు భద్రతను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








