ప్రపంచంలోనే అతి చిన్న ల్యాప్‌టాప్ మ్యాజిక్ బెన్ మాగ్ 1

|

చైనా కంపెనీ మ్యాజిక్ బెన్ మాగ్ 1 అనే కొత్త ల్యాప్‌టాప్ ను తయారుచేసింది. ల్యాప్‌టాప్ ను తయారుచేయడంలో పెద్ద వింత ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇందులో ఒక కొత్త విషయం ఉంది. అది ఏమిటంటే ఈ కొత్త ల్యాప్‌టాప్ టచ్‌ప్యాడ్‌తో వస్తున్న ప్రపంచంలోనే అతి చిన్న ల్యాప్‌టాప్ కావడం విశేషం అని టెక్ క్రంచ్‌లో ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది.

ల్యాప్‌టాప్
 

ఈ కొత్త ల్యాప్‌టాప్ యొక్క వివరాలలోకి వెళితే ఇది A5 షీట్ వలె దాదాపు చిన్నగా ఉండి కేవలం 20.7 x 14.6 x 1.8 సెం.మీ.ని పరిమాణంలో ఉంటుంది . ఈ ల్యాప్‌టాప్ యొక్క బరువు కూడా కేవలం 700 గ్రాముల మాత్రమే. ఇది ఆపిల్ యొక్క ల్యాప్‌టాప్, మాక్‌బుక్ కంటే ఎక్కువ పోర్ట్‌లను కలిగి ఉండడం కూడా మరొక పెద్ద విషయం. ఈ ల్యాప్‌టాప్‌లో ఫుల్ సైజు యుఎస్‌బి 3.0 పోర్ట్, టైప్-సి కనెక్టర్, మైక్రో ఎస్‌డి కార్డ్ రీడర్, ఆడియో సాకెట్ మరియు మైక్రో హెచ్‌డిఎంఐ పోర్ట్ లు కూడా ఉన్నాయి.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల జాబితాలో పాత ధరలను చేర్చిన వోడాఫోన్

ధరల వివరాలు

ధరల వివరాలు

ప్రపంచంలోనే అతి చిన్న ల్యాప్‌టాప్ గా వస్తున్న మ్యాజిక్ బెన్ మాగ్ 1 అల్ట్రా-పోర్టబుల్ ల్యాప్‌టాప్ యొక్క ధర విషయానికి వస్తే దీని ధర గేర్‌బెస్ట్ వద్ద $790 లకు లభిస్తున్నది. ఇది తేలికైనది, స్లిమ్ ఇంకా శక్తివంతమైనది అని నివేదిక తెలిపింది. అలాగే కొనుగోలుదారుడు గేర్‌బెస్ట్ నుండి స్టైలస్ పెన్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ రీడర్ మరియు స్పేర్ M.2 పోర్ట్‌ను $789.99 ధర వద్ద పొందవచ్చు.

కాపీరైట్ క్లెయిమ్ కోసం యూట్యూబ్ లో కొత్త టూల్స్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ M3-8100Y CPU, 16 GB మెమరీ మరియు 512GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ వంటి కొన్ని హై-ఎండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ యొక్క అతిపెద్ద యుఎస్‌పి దాని టచ్‌స్క్రీన్ డిస్ప్లే. ఇది 2560 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 16:10 కారక నిష్పత్తితో వస్తుంది.

రైల్వే టికెట్ కోసం "బుక్ నౌ పే లేటర్" ఫీచర్ ను మొదలెట్టిన IRCTC

బ్యాటరీ
 

బ్యాటరీ

ఇది చాలా చిన్నది అయినప్పటికీ 30AHr బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీనిని తయారీచేసిన కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇది ఏడు గంటల వరకు బ్యాటరీ బ్యాక్ అప్ వస్తుంది. ఇందులో మరోక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది టైప్ సి కనెక్టర్ ద్వారా పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేయవచ్చు.

గూగుల్ పేలో 2 లక్షల రివార్డులను పొందడం ఎలా?

ఫీచర్స్

ఫీచర్స్

ఇందులో లేని ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న ల్యాప్‌టాప్‌కు వెబ్‌క్యామ్ లేదు. అలాగే దీనికి 360-డిగ్రీల కీలు లేదా యాక్టివ్ పెన్ సపోర్ట్ లేదు. ఈ ల్యాప్‌టాప్‌ చాలా చిన్నది కాబట్టి కీబోర్డ్ కూడా చిన్నదిగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. దీని యొక్క లేఅవుట్ కొంచెం విచిత్రంగా లేదా అసాధారణంగా అనిపించవచ్చు. కానీ ఇతర మినీ ల్యాప్‌టాప్‌లతో పోల్చినప్పుడు దీని కీబోర్డు సరైనదిగా అనిపిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
World’s Smallest Laptop Ben Mag1 Launched: Check Price,Specifications,Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X