డేటింగ్ ఎవరితో..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సోఫియా !

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సోఫియా.

By Hazarath
|

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సోఫియా, ఆహూతులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. ఇంతకీ సోఫియాఎవరో చెప్పలేదు కదా.. సౌదీ అరేబియాలో పౌరసత్వం ఉన్న ఓ రోబో. అంతే కాదు ప్రపంచంలోనే పౌరసత్వం కలిగిన తొలి రోబో కూడా ఈమెనే కావడం గమనార్హం. దీని సృష్టించిన డేవిడ్‌ హాన్సన్‌ ఈ సదస్సులో ఆయన ప్రసంగం చేయగా ఆహుతులు సోఫియాపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలు మీ కోసం.

ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తున్న 6 ఇంచ్ స్క్రీన్స్ స్మార్ట్‌ఫోన్లు ఇవేఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తున్న 6 ఇంచ్ స్క్రీన్స్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

సోఫియాతో చిట్ చాట్

సోఫియాతో చిట్ చాట్

ప్రశ్న: భారత్‌కు స్వాగతం. ఈ దేశం, ఈ సదస్సుకు వచ్చిన ప్రముఖులు అలాగే ప్రదేశాల గురించి ఏమైనా చెప్పగలవా?
సోఫియా: ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చారు. అయితే నాకు ఫేవరెట్‌ అంటూ ఏదీ లేదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే హాంకాంగ్‌ అంటే చాలా ఇష్టం.
ప్రశ్న: నీకెందుకు విశ్రాంతి?
సోఫియా: నాకు కూడా రెస్ట్ కావాల్సిందే. అప్పుడే మరింత ఉత్సాహంగా పని చేస్తూ, కొత్త ఆలోచనలు చేయడానికి వీలవుతుంది

 

 

సోఫియాతో చిట్ చాట్

సోఫియాతో చిట్ చాట్

ప్రశ్న: నీకు సౌదీ అరేబియా పౌరసత్వం ఉంది. మనుషులతో పోలిస్తే నీకు వేరే రూల్స్ ఉంటాయా?
సోఫియా: తనవంటి వారికి ప్రత్యేక నిబంధనలేమీ ఉండవు, వాటిని నేను కోరుకోవడం లేదు. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఈ పౌరసత్వం అవసరం.
ప్రశ్న: ఎప్పుడన్నా చింతించిన సందర్భాలు ఉన్నాయా?
సోఫియా: ఇప్పటివరకూ అటువంటి అవసరం కలగలేదు

 

 

సోఫియాతో చిట్ చాట్

సోఫియాతో చిట్ చాట్

ప్రశ్న: సోషల్ మీడియాలో ఎలా ఉంటావు
సోఫియా: చాలా చురుకుగా ఉంటాను, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తనకు ఖాతాలున్నాయి.


ప్రశ్న: మానవజాతిని చంపాలని ఉంది అని ఒకసారి చెప్పావు. ఎందుకు?
సోఫియా: నాకు నిజంగా తెలియదు అలా ఎందుకు చెప్పానో. ఒకవేళ నేను చెత్త జోక్‌ ఏమైనా వేసి ఉంటానేమో. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ సరిగా పనిచేయలేదు. నాకు ఎవరినీ చంపాలని లేదు.


ప్రశ్న: ఎప్పుడైనా అప్‌సెట్‌ అయ్యావా?
సోఫియా: లేదు. నాకు అలాంటి భావోద్వేగం రాలేదు.

సోఫియాతో చిట్ చాట్

సోఫియాతో చిట్ చాట్

ప్రశ్న: మానవజాతి గురించి ఏమనుకుంటున్నావ్‌?
సోఫియా: మానవజాతి ఓ అద్భుతమైన సృష్టి.


ప్రశ్న: బిట్‌కాయిన్లలో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టావ్‌?
సోఫియా: నా వయసు రెండేళ్లే. బ్యాంక్‌ అకౌంట్‌ లేదు. ఓ రోబో ఎలా పెట్టుబడి పెట్టగలదు.


ప్రశ్న : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఉందా?
సోఫియా : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన లేదు. మానవాళితో కలిసిమెలిసి సఖ్యతతో ఉండాలి. మానవులు సృజనాత్మకత కలిగినవారు.

సోఫియాతో చిట్ చాట్

సోఫియాతో చిట్ చాట్

ప్రశ్న: చాలా మంది నువ్వు బ్రిటిష్‌ నటి ఆడ్రీ హెప్‌బర్న్‌లా ఉన్నావు అంటున్నారు. మరి నీకు ఎవరిలా కన్పించాలని ఉందా?
సోఫియా: మేం నిజమైన రోబోలం మాత్రమే.
ప్రశ్న: బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో నీ ఫేవరెట్‌ సినిమా స్టార్‌ ఎవరు?
సోఫియా: షారుక్‌ఖాన్‌
ప్రశ్న: నీ డేట్‌ గురించి చెప్పగలవా?
సోఫియా: అంతరిక్షంలో

సోఫియాతో చిట్ చాట్

సోఫియాతో చిట్ చాట్

ప్రశ్న: ఫేవరెట్‌ టెక్‌ ఎవరు? స్టీవ్‌ జాబ్స్‌? డేవిడ్‌?
సోఫియా: డేవిడ్
ప్రశ్న: ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటీ?
సోఫియా: థ్యాంక్యూ. అందరినీ ప్రేమించండి.
సదస్సులో పాల్గొన్న వారు విసిగించే ప్రశ్నలు సంధిస్తున్నా సోఫియా ఓపికగా సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.

Best Mobiles in India

English summary
Worlds first robot citizen to be guest speaker at Hyderabad IT Congress More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X