ఈ ఛార్జర్ ద్వారా షియోమి ఫోన్లు కేవలం 17 నిమిషాల్లనే పుల్ అవుతాయి

By Gizbot Bureau
|

చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త సూపర్ ఛార్జర్ ను ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో షియోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 100W సూపర్ ఛార్జ్ టర్బో టెక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. చైనాలో జరిగిన షియోమీ డెవలపర్ కాన్ఫిరెన్స్ లో ఈ టెక్నాలజీని కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఛార్జర్ ద్వారా 4,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్ కేవలం 17నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్ సూపర్ ఛార్జర్ ఎలా పనిచేస్తుందో కూడా వీడియో రూపంలో కంపెనీ ప్రదర్శించింది.

13 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ 
 

ఈ ఏడాది ప్రారంభంలో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో సైతం 120W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన ఛార్జర్ ప్రవేశపెట్టింది. ఈ ఛార్జర్.. 4000mAh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే ఫోన్లలో 13 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

రియల్ మి X2 ప్రో ఫోన్ తో 50W ఛార్జింగ్ టెక్నాలజీ

షియోమీ, వివో మాత్రమే కాదు.. ఇతర కంపెనీలైన ఒప్పో, రియల్ మి కంపెనీలు కూడా 65W, 50W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఛార్జర్లను ప్రవేశపెట్టాయి. ఇండియాలో ఈరోజే రియల్ మి X2 ప్రో ఫోన్ తో 50W ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చేసింది. ఇది కూడా అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది.

రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 7, రెడ్ మి కె20 సిరీస్ ఫోన్లకు

షియోమీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలతో రిలీజ్ చేసిన ఈ సూపర్ ఛార్జ్ టర్బోతో రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 7, రెడ్ మి కె20 సిరీస్ ఫోన్లకు 20 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. 100W సూపర్ ఛార్జ్ టర్బో హైవోల్టేజ్ ఛార్జ్ పంప్ తో కూడిన 9ఫోల్డ్ ఛార్జ్ ప్రొటక్షన్ ఉంది.

100W సూపర్ ఛార్జ్ టర్బో టెక్ టెక్నాలజీ
 

ఇందులో 7 ఫోల్డ్ మథర్ బోర్డులో ఉంటే.. 2 ఫోల్డ్ ప్రొటక్షన్ బ్యాటరీలో ఉంటాయి. వచ్చే ఏడాదిలో షియోమీ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో 100W సూపర్ ఛార్జ్ టర్బో టెక్ టెక్నాలజీతో లాంచ్ చేసే అవకాశం ఉంది. కానీ, దీనిపై షియోమీ అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఈ ఛార్జర్ ఇండియాకు అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
xiaomi 100w supercharge turbo tech can charge redmi note 8 fully in just 17 minutes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X