Home
Gadgets

20,000mAh బ్యాటరీ సామర్థ్యంతో షియోమీ Power Bank విడుదల.. ఆకట్టుకొనే ఫీచర్లు సహా..!

Xiaomi 20000mAh Compact Power Bank : ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారు, ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తులు పవర్‌ బ్యాంకులను తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం మార్కె్‌ట్లో అనేక రకాల పవర్‌ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రముఖ ‌స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ షియోమీ తాజాగా కాంపాక్ట్‌ పవర్‌ బ్యాంక్‌ ను విడుదల చేసింది. దీంతో అనేక డివైజ్‌లను ఒకేసారి ఛార్జింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

షియోమీ కాంపాక్ట్ 20,000mAh పవర్‌ బ్యాంకును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటుంది. ఇన్‌బిల్ట్‌ USB-C కేబుల్‌ను కలిగి ఉంది. దీంతో అదనంగా ఛార్జింగ్ కేబుల్స్‌ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ పవర్‌ బ్యాంకు బరువు కేవలం 342 గ్రాములుగా ఉంటుంది.

Xiaomi 20000mAh Compact Power Bank launched in india

20000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ షియోమీ పవర్‌ బ్యాంకు 20000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 22.5W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ పవర్‌ బ్యాంకు USB-A, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మూడు డివైజ్‌లను ఒకేసారి ఛార్జింగ్‌ చేసేందుకు అనువుగా ఉంటుందని షియోమీ చెబుతోంది.

ఆటోమేటిక్‌ పవర్‌ అవుట్‌పుట్ సర్దుబాట్లు :
ఈ పవర్‌ బ్యాంకు రెండు 3.7V సామర్థ్యంతో రెండు 10000mAh లిథియం అయాన్ బ్యాటరీలతో అల్ట్రా లార్జ్‌ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉందని షియోమీ తెలిపింది. ఆటోమేటిక్‌గా పవర్‌ అవుట్‌పుట్‌ను సర్దుబాటు చేస్తుందని తెలిపింది. Low కరెంట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలిపింది.

ఈ పవర్ బ్యాంకుతో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చు. అయితే ల్యాప్‌టాప్‌ వంటి డివైజ్‌లను ఛార్జింగ్‌ చేసేందుకు అవకాశం లేదు. ఈ షియోమీ 20000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన పవర్‌ బ్యాంకు ఐవీ గ్రీన్‌, డార్క్ గ్రే వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Xiaomi 20000mAh Compact Power Bank launched in india

ధర, సేల్‌ వివరాలు :
షియోమీ 20000mAh కాంపాక్ట్‌ పవర్‌ బ్యాంకు ధర రూ.1799 గా ఉంది. జులై 10 వ తేదీ నుంచి భారత్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. Mi.com, ఫ్లిప్‌కార్ట్‌ తోపాటు ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చని షియోమీ తెలిపింది.

12 లేయర్‌ ప్రొటెక్షన్‌ :
ఈ పవర్‌ బ్యాంకు 12 లేయర్‌ అంతర్గత సర్య్యూట్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుందని షియోమీ చెబుతోంది. షార్ట్‌ సర్క్యూట్‌, ఓవర్‌ వోల్టేట్‌, ఓవర్‌ హీట్‌ సహా ఇతర విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపింది. దూర ప్రాంత ప్రయాణాలు సహా ఓవర్‌ నైట్‌ ఛార్జింగ్‌ సమయాల్లోను మెరుగైన రక్షణ కల్పిస్తుంది.

షియోమీ 20000mAh కాంపాక్ట్‌ పవర్‌ బ్యాంకుతో షియోమీ 15 స్మార్ట్‌ఫోన్‌ను 2.5 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని తెలిపింది. అదే విధంగా ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ను 4 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని షియోమీ తెలిపింది. రెడ్‌మి నోట్‌ 14 ప్రో 5G ఫోన్‌ను 2.9 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని తెలిపింది. అదే షియోమీ ప్యాడ్‌ 7 ను 1.9 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని తెలిపింది.

Best Mobiles in India

English summary
Xiaomi 20000mAh Compact Power Bank launched in india at Rs1799 Price here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X