Just In
- 53 min ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 23 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Finance
Budget 2023: కీలకంగా డిఫెన్స్ బడ్జెట్.. పాక్, చైనాలకు ధీటుగా భారత్ ఉందా..?
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- News
స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అదిరే ఆఫర్లతో షియోమి స్మార్ట్‌టీవీ అమ్మకాలు, ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలు మీకోసం..
మొబైల్ రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న షియోమి స్మార్‌టీవీల రంగంలోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియాలో షియోమి తొలిసారిగా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4ను కొద్ది రోజుల కిందట లాంచ్ చేసింది. ఆ 55 అంగుళాల స్మార్ట్‌టీవీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ.కాం ద్వారా కూడా ఈ టీవి విక్రయానికి రానుంది. కాగా చైనా వెలుపల భారత్‌లోనే తొలిసారిగా ఈ టీవీలను విక్రయిస్తోంది. శాంసంగ్, సోనీ, ఎల్‌జీ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థల టీవీలకు గట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాల అంచనా.

ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4 ఫీచర్లు
కాగా దీని ధరను కంపెనీ రూ.39,999 గా నిర్ణయించింది.
4.9 ఎంఎం అల్ట్రా-థిన్ ఫ్రేమ్‌లెస్ డిజైన్
55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్
4కే రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్)
హెచ్‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ 1.8 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ

లాంచింగ్ విషయానికి వస్తే
ఇక లాంచింగ్ విషయానికి వస్తే....ఎంఐ టీవీ కొనుగోలుదారులకు రూ.619 విలువ చేసే సోనీ లివ్, హంగామా ప్లే 3 నెలల చందా ఉచితం. అలాగే ఎంఐ ఐఆర్ కేబుల్ (రూ. 299) ఫ్రీ. దీంతోపాటు రూ.1,099 విలువ చేసే ఆన్సైట్ ఇన్‌ష్టలేషన్ ఉచితం. అంతేకాదు స్మార్ట్ టీవీతో కలిపి 11-బటన్ మిని రిమోట్‌ను అందిస్తోంది. దీంతో అటు టీవీని, ఇటు సెట్-టాప్ బాక్సును నియంత్రించవచ్చు.

కనెక్టివిటీ
ఇక కనెక్టివిటీ పరంగా, మూడు హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్స్, రెండు యూఎస్‌బీ పోర్ట్స్, డ్యూయెల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 4.0, డాల్బే+డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, ప్యాచ్‌వాల్ ఓఎస్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌టీవీ సొంతం.

15 భాషల్లో
ముఖ‍్యంగా 15 భాషల్లో 5,00,000లకుపైగా గంటల (వీటిలో 80 శాతం ఉచితం) అందించేందుకు వీలుగా హంగామా, ఏఎల్‌టీ బాలాజీ, జీ5, సోనీ లిప్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని షియోమి ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రోలను..
కాగా కంపెనీ ఈ టీవితో పాటు రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రోలను కూడా లాంచ్ చేసింది. అవి కూడా పై రెండు స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఎయిర్ ఫ్యూరిఫయర్స్, మొబైల్ యాక్ససరీస్‌లను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.

రెడ్‌మి నోట్ 5 ప్రత్యేకతలు
ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 18:9 డిస్‌ప్లే, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 12 ఎంపీ రియర్ కెమెరా, సెల్ఫీ లైట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఇక రెడ్‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.9,999గా, రూ.11,999గా ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 5 ప్రో ప్రత్యేకతలు
వీటిల్లో 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 18:9 డిస్‌ప్లే, సాఫ్ట్ సెల్ఫీలైట్‌తో కూడిన 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ (క్వాల్‌కామ్ నుంచి వస్తున్న లేటెస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్), 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ, 6 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.13,999గా, రూ.16,999గా ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470