రూ.40,000 బడ్జెట్‌లో బెస్ట్ టీవీ ఇదే, మార్కెట్‌ను ఊపేస్తున్న Mi TV 4

|

చైనా బ్రాండ్ షావోమి (Xiaomi) నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఎంఐ టీవీ 4 (Mi TV 4) ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఈ టీవీలకు సంబంధించి జరిగిన రెండవ ఫ్లాష్ సేల్ కూడా నిమిషాల వ్యవధిలోనే ముగియటంతో చాలా మంది యూజర్లు ఈ టీవీని సొంతం చేసుకోలేక పోయారు. ఎంఐ టీవీ 4కు సంబంధించిన తదుపరి సేల్ మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ సంచలన స్మార్ట్ టీవీని Flipkartతో పాటు షావోమి అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ అయిన Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. ధర రూ.39,999. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఈ టీవీని కొనుగోలు చేసే సమయంలో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవటం ద్వారా 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందే వీలుంటుంది.

 

గూగుల్‌తో జట్టు కట్టిన Airtel,అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !గూగుల్‌తో జట్టు కట్టిన Airtel,అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !

55 అంగుళాల సామ్‌సంగ్ హెచ్‌డిఆర్ స్ర్కీన్‌

55 అంగుళాల సామ్‌సంగ్ హెచ్‌డిఆర్ స్ర్కీన్‌

ఎంఐ టీవీ 4, 55 అంగుళాల హెచ్‌డిఆర్ స్ర్కీన్‌తో వస్తోంది. ఈ ప్యానల్‌ను సామ్‌సంగ్ అభివృద్ధి చేసింది. ఇందులో 3840x2160 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన కస్టమ్ బిల్ట్ సామ్‌సంగ్ 4కే సుపీరియర్ వెర్టికల్ అలైన్‌మెంట్ డిస్‌ప్లే పొందుపరచబడి ఉంటుంది. 4కే రిసల్యూషన్ సపోర్ట్‌ను ఈ టీవీ ఆఫర్ చేయగలుగుతుంది. 4.9 మిల్లీమీటర్ల పలుచటి స్ర్కీన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్ టెలివిజన్ సెట్‌ను ప్రపంచంలోనే అతి నాజూకైన టీవీగా షావోమి అభివర్ణిస్తోంది.

55 అంగుళాల వేరియంట్ మాత్రమే భారత్‌లో లభ్యమవుతోంది..

55 అంగుళాల వేరియంట్ మాత్రమే భారత్‌లో లభ్యమవుతోంది..

చైనా మార్కెట్లో ఎంఐ టీవీ 4ను మూడు వేరియంట్‌లలో షావోమి లాంచ్ చేసింది. అందులో మొదటి రెండు వేరియంట్లు 49, 55 అంగుళాలివి కాగా మూడవ వేరియంట్ మాత్రం 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌తో లభ్యమవుతోంది. వీటిలో 55 అంగుళాల వేరియంట్ మాత్రమే భారత్‌లో లభ్యమవుతోంది. ఎంఐ టీవీ 4, భారత్‌లోని అన్ని ప్రముఖ సెటప్ బాక్సులను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. హాట్‌స్టార్, హంగామా, సోనీ లైవ్ వంటి ఆన్-డిమాండ్ వీడియో కంటెంట్‌ను ఈ టీవీలో పొందే వీలుంటుంది.

 Mi TV 4 స్సెసిఫికేషన్స్..
 

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి.

డాల్బీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్...

డాల్బీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్...

వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

 

 

Best Mobiles in India

English summary
The Mi TV 4 is out of stock again. It went on sale at Flipkart and the Mi online store and was out of stock within seconds. For now Xiaomi hasn't revealed how many TVs it sold in today's sale but given the very attractive price of the Mi TV4, which sells for Rs 39,999.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X