Home
Gadgets

36 గంటల ప్లేటైంతో బడ్స్, 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పవర్‌ బ్యాంక్‌లు.. రెడ్‌మి ఉత్పత్తుల పూర్తి వివరాలు..!

షియోమీ నుంచి ఇవాళ అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్‌ సహా రెడ్‌మి బడ్స్‌ 5C (Redmi Buds 5C), పవర్ బ్యాంక్‌లు ఉన్నాయి. దీంతోపాటు షియోమీ రోబోట్‌ వాక్యూమ్ క్లీనర్‌ X10 (Xiaomi Robot Vacuum Cleaner X10) వంటి ఉన్నాయి. షియోమీ సంస్థ భారత్‌లోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రారంభ ధర రూ.12999 కే రెడ్‌మి 13 5G హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది.

రెడ్‌మి బడ్స్‌ 5C :
రెడ్‌మి ఇవాళ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఈ రెడ్‌మి బడ్స్‌ 5C ఇయర్‌బడ్స్‌ 40dB యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ANC) ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా మెరుగైన అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది. దీంతోపాటు 12.4mm డైనమిక్ టైటానియం డ్రైవర్స్‌ను కలిగి ఉంది. మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) క్వాడ్ మైక్‌తో అందుబాటులో ఉంది.

redmi-buds-5c

కాలింగ్‌ సమయంలో పరిసరాల్లోని అనవసర సౌండ్‌ను నియంత్రిస్తుందని షియోమీ చెబుతోంది. ఈ బడ్స్ బ్లూటూత్‌ 5.3 పైన పనిచేస్తుంది. షియోమీ ఇయర్‌బడ్స్ యాప్‌ ద్వారా ANC, EQ సెట్టింగ్స్‌లో మార్పులు చేయవచ్చు. ఇయర్‌బడ్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 36 గంటలపాటు ప్లేటైం ను పొందవచ్చని తెలిపింది. ఈ రెడ్‌మి బడ్స్‌ 5C ధర రూ.1999 గా ఉంది. జులై 20 మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది.

షియోమి ఇవాళ పాకెట్‌ పవర్‌ బ్యాంక్‌ మరియు షియోమీ పవర్ బ్యాంక్‌ 4i.. రెండు పవర్‌ బ్యాంక్‌లను విడుదల చేసింది. షియోమీ పాకెట్‌ పవర్‌ బ్యాంక్‌.. 10,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. USB-C ఛార్జింగ్‌ కేబుల్‌తో వస్తుంది. 2 వే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ధర రూ.1699 గా ఉంది.

redmi-buds-5c

షియోమి పవర్‌ బ్యాంక్‌ 4i.. ద్వారా మూడు పరికరాలను ఒకేసారి ఛార్జింగ్‌ చేసేందుకు వీలుంటుంది. 10000mAh లిథియం అయాన్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2 వే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ రెండు పవర్‌ బ్యాంక్‌లు 12 లేయర్‌ రక్షణను కలిగి ఉంటాయి. మరియు 22.5W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తాయి. దీని ధర రూ.1299 గా ఉంది.

రోబోట్‌ వాక్యూమ్ క్లీనర్‌ X10 : దీంతోపాటు ఇదే ఈవెంట్‌లో షియోమీ రోబోట్‌ వాక్యూమ్ క్లీనర్‌ X10 ను ప్రదర్శించింది. డ్యూయల్‌ ఆటో ఎంప్టీయింగ్‌ వెంట్స్‌, 2.5 లీటర్ల సామర్థ్యంతో కూడిన డిస్పోజబుల్‌ బ్యాగ్‌ ను వాక్యూమ్ క్లీనర్‌ కలిగి ఉంటుంది.

redmi-buds-5c

4000pa సక్షన్‌ పవర్‌ను కలిగి ఉన్న ఈ వాక్యూమ్‌ క్లీనర్ దుమ్మును సులభంగా తొలగిస్తుందని సంస్థ చెబుతోంది. 5200mAh బ్యాటరీతో 240 నిమిషాల పాటు పనిచేస్తుంది. ధర రూ.29999 గా ఉంది. జులై 15 మధ్యాహ్నం 12 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా షియోమీ వెబ్‌సైట్లలో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
xiaomi launched redmi buds 5c, power banks and robot vacuum cleaner X10 launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X