ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌కు పోటీగా ఎంఐ ఎయిర్‌డాట్స్

ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌ (AirPods)కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ ఉందో మనందరికి తెలుసు. ఆపిల్ తన మొట్టమొదటి ఎయిర్‌పోడ్స్‌ను 2016లో లాంచ్ చేసింది.

|

ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌ (AirPods)కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ ఉందో మనందరికి తెలుసు. ఆపిల్ తన మొట్టమొదటి ఎయిర్‌పోడ్స్‌ను 2016లో లాంచ్ చేసింది. ఇవి ఇప్పటికీ బాగానే సేల్ అవుతున్నప్పటికి చాలా మంది ఐఫోన్ యూజర్లు మాత్రం కొత్త వెర్షన్ ఎయిర్‌పోడ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్‌కమ్మింగ్ ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అనధికారికంగా అందుతోన్న సమచారం ప్రకారం ఆపిల్, ఓ కొత్త వెర్షన్ ఎయిర్‌పోడ్స్ పై వర్క్ చేస్తోంది. వీటిని ఎయిర్‌పోడ్స్‌ 2 (AirPods 2) పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆలీబాబా సింగిల్స్ డే సేల్ వచ్చేస్తోంది, ఇండియా నుంచి పాల్గొనటం ఎలా..?ఆలీబాబా సింగిల్స్ డే సేల్ వచ్చేస్తోంది, ఇండియా నుంచి పాల్గొనటం ఎలా..?

షావోమి నుంచి సరికొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్..

షావోమి నుంచి సరికొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్..

ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌కు పోటీగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ ఎయిర్‌డాట్స్ (Mi AirDots) పేరిట సరికొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ‘ట్రూ' వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను ఎంఐ ఎయిర్‌డాట్స్ యూత్ ఎడిషన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతానికి ఇవి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ధర 199 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.2100)

 

 

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే లభ్యం..

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే లభ్యం..

ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌కు పోటీగా షావోమి, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను తయరు చేస్తోందన్న వార్త గతకొంత కాలంగా ఇంటర్నెట్‌లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. తాజాగా ఈ వార్తను నిజం చేస్తూ షావోమి ఎంఐ ఎయిర్‌డాట్స్ పేరుతో వీటిని అఫీషియల్‌గా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే లభ్యమవుతోన్న వీటిని భారత్‌తో పాటు ఇతర మార్కెట్లలో లాంచ్ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత అయితే లేదు.

 

 

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..
 

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..

ఎంఐ ఎయిర్‌డాట్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఇవి లేటెస్ట్ బ్లుటూత్ వీ5.0 కనెక్టువిటీతో లోడ్ అయి ఉన్నాయి. ఒక్కో ఇయర్ బడ్‌లోనూ డెడికేటెడ్ టచ్ జోన్‌ను షావోమి ఏర్పాటు చేసింది. ఫింగర్ టచ్‌తో ఈ జోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవటం, పాటలను పాస్ లేదా ప్లే చేయటం, కాల్స్‌ను ఆన్సర్ చేయటం లేదా రిజక్ట్ చేయటం వంటి పనులను ఈ టచ్ జోన్‌ ద్వారా నిర్వహించుకోవచ్చు.

 

 

ట్రూ వైర్‌లెస్ స్టిరియో టెక్నాలజీ..

ట్రూ వైర్‌లెస్ స్టిరియో టెక్నాలజీ..

ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌ తరహాలోనే ఎంఐ ఎయిర్‌డాట్స్‌లోనూ ట్రూ వైర్‌లెస్ స్టిరియో టెక్నాలజీని షావోమి నిక్షిప్తం చేసింది. ఈ టెక్నాలజీ ఆడియోను రెండు ఇయర్‌బడ్స్‌కు సమానంగా స్ప్లిట్ చేసి ట్రూ వైర్‌లెస్ ఎక్స్ పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్‌డాట్స్‌లో లోడ్ చేసిన 72.ఎమ్ఎమ్ ఆడియో డ్రైవర్స్ డీప్ బాస్‌తో పాటు హై-క్వాలిటీ స్టీరియో ఆడియోను ప్రొవైడ్ చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ ఇయర్ ఫోన్స్‌లో మ్యూజిక్‌ను కంట్రోల్ చేసుకునేందుకు ఎటువంటి ఫిజికల్ బటన్స్ ఉండవు. టచ్ జోన్ ద్వారానే వీటిని కంట్రోల్ చేసుకోవల్సి ఉంటుంది.

బ్లుటూత్ వీ5.0 కనెక్టువిటీ

బ్లుటూత్ వీ5.0 కనెక్టువిటీ

ఎంఐ ఎయిర్‌డాట్స్, బ్లుటూత్ వీ5.0 కనెక్టువిటీ పై స్పందిస్తాయి. లేటెస్ట్ టెక్నాలజీతో వస్తోన్న ఈ వైర్‌లెస్ కనెక్టువిటీ తక్కువ పవర్ ను ఖర్చేయటంతో పాటు ఆపరేటింగ్ రేంజ్ కూడా పెరుగుతుంది. ఎంఐ ఎయిర్‌డాట్స్ వీ4.2 కనెక్టువిటీని కూడా సపోర్ట్ చేస్తాయి. సింగిల్ ఛార్జ్ పై 5 గంటల పాటు ఈ ఇయర్ ఫోన్‌లను ఉపయోగించుకోవచ్చని షావోమి చెబుతోంది.

Best Mobiles in India

English summary
Xiaomi launches its first Mi AirDots true wireless earphones to take on Apple AirPods.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X