షియోమి నుంచి మేడ్ ఇన్ ఇండియా పవర్ బ్యాంక్‌లు
చైనా మొబైల్ దిగ్గజం షియోమి మేడ్ ఇన్ ఇండియా పేరిట ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐను రెండు నూతన పవర్‌బ్యాంక్‌లను విడుదల చేసింది.
చైనా మొబైల్ దిగ్గజం షియోమి మేడ్ ఇన్ ఇండియా పేరిట ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐను రెండు నూతన పవర్‌బ్యాంక్‌లను విడుదల చేసింది. ఇవి 10000 ఎంఏహెచ్, 20000 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి పూర్తిగా మేడిన్ ఇండియా పవర్‌బ్యాంక్‌లు కావడం విశేషం.

రూ.799, రూ.1499 ధరలకు ఈ పవర్ బ్యాంక్‌లు యూజర్లకు లభిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి వీటిని యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌లు 4 గంటల 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతాయి. అనంతరం వీటితో ఫోన్లు, టాబ్లెట్ పీసీలు, స్మార్ట్‌బ్యాండ్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఆయా డివైస్‌లు వేగంగా చార్జింగ్ అవుతాయి. అందుకు గాను ఈ పవర్ బ్యాంకుల్లో గరిష్టంగా 15 వాట్ల పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తున్నారు. ఇక ఈ పవర్‌బ్యాంక్‌లపై 4 ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి వాటిలో ఉన్న బ్యాటరీ చార్జింగ్‌ను సూచిస్తాయి.


Click it and Unblock the Notifications








