Home
Gadgets

షియోమి నుంచి రూ.1299కే ఎంఐ బాండ్ 3ఐ

By Gizbot Bureau

మొబైల్ మార్కెట్లో ఇప్పటికే నంబర్ వన్ గా ఉన్న షియోమీ స్మార్ట్ బాండ్ల విషయంలో కూడా మరో అడుగు ముందుకు వేసింది. ఎంఐ బ్యాండ్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఎంఐ బ్యాండ్ 3ఐ పేరిట విడుదలైన ఈ బ్యాండ్‌లో 0.78 ఇంచుల ఓలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, స్లీప్ ట్రాకర్, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 110 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.1299 ధరకు ఈ బ్యాండ్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎంఐ బ్యాండ్ 3కి ఆధారిత హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ కి తర్వాత వెర్షన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ మధ్యే రూ.2,299 ధరలో షియోమీ ఎంఐ బ్యాండ్ 4ను మార్కెట్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రధాన తేడా హార్ట్ రేట్ ట్రాకరే

ఇందులో ఉన్న ఫీచర్లన్నీ దాదాపుగా ఎంఐ బ్యాండ్ 3లో ఉన్నవే. ఈ రెండిటికీ మధ్య ఉన్న ప్రధాన తేడా హార్ట్ రేట్ ట్రాకరే. ఎంఐ బ్యాండ్ లో ఈ ఫీచర్ ను అందించగా ఇందులో అందించలేదు. ఈ బ్యాండ్ మీరు వేసే అడుగులను, తినే క్యాలరీలను లెక్కిస్తుంది. ఈ వివరాలను నోటిఫికేషన్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ కు పంపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఎంత సేపు నిద్రపోతున్నరనేది చూడవచ్చు

అడుగులు, క్యాలరీలతో పాటు మీరు ఎంత సేపు నిద్ర పోతున్నారనే అంశాన్ని కూడా ఈ స్మార్ట్ బ్యాండ్ లెక్కిస్తుంది. అయితే దానికి మీరు నిద్రపోయేటప్పుడు కూడా ఈ బ్యాండ్ ను ధరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం మొత్తం గ్రాఫ్ లు, టేబుళ్ల రూపంలో మీ ఫోన్ లో ఉన్న ఎంఐ ఫిట్ యాప్ లో ప్రత్యక్షమవుతుంది.

ఫోన్ కాల్స్ ను రిజెక్ట్ చేసే ఆప్షన్

ఇందులో ఉన్న స్మార్ట్ ఫంక్షన్ల ద్వారా ఎంఐ బ్యాండ్ 3i మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ అయి డిస్ ప్లేపై నోటిఫికేషన్లను చూపిస్తుంది. మెసేజింగ్ యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు కూడా ఇందులో కనిపించడం విశేషం. ఇటువంటి ఫీచర్లే ఎంఐ బ్యాండ్ 3లో కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో మాదిరిగానే ఇందులో కూడా వినియోగదారులు ఫోన్ కాల్స్ ను రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

అదనపు ఫీచర్లు

ఇందులో 1.9 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఓఎల్ఈడీ(OLED) డిస్ ప్లేను అందించారు. ఇందులో ఉన్న 110 ఎంఏహెచ్ బ్యాటరీ ద్వారా దీని చార్జింగ్ 20 రోజుల వరకు వస్తుందని షియోమీ తెలిపింది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా దీన్ని ధరించి ఉండవచ్చు.

Best Mobiles in India

English summary
Xiaomi launches Mi Band 3i at Rs 1,299
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X