రూ. 14 వేల స్మార్ట్‌టీవీలో దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఆ 2 రోజులే కొనుగోలు

|

టెలివిజన్ మార్కెట్లో చైనా దిగ్గజం షియోమి ప్రకంపనలు రేపుతోంది. తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో స్మార్ట్‌టీవీని లాంచ్ చేసి దిగ్గజాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే 55-inchతో Mi TV 4ని లాంచ్ చేసి టీవీ మార్కెట్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ విషయాన్ని మరువక ముందే ఇంకా అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌టీవీని లాంచ్ చేసి మరో సవాల్ విసిరింది. Mi TV 4A సీరిస్‌లో 43 అంగుళాల టీవీ, 32 అంగుళాల టీవీలను లాంచ్ చేసింది. AI-powered PatchWall UIతో వచ్చిన ఈ స్మార్ట్‌టీవీ స్మార్ట్ ఫోన్లో మరొక సంచలనాన్ని సృష్టిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వీటిని ఇండియాలో కంపెనీ Mi LED Smart TV 4Aగా పిలుస్తోంది. మరి ఈ టీవి వచ్చి రావడంతోనే ఆఫర్ల వెల్లువను అందిస్తోంది. పూర్తి సమాచారంపై ఓ లుక్కేయండి.

 

సెకన్లలో అమ్ముడుపోయిన Mi TV 4, మార్చి 13 తదుపరి సేల్సెకన్లలో అమ్ముడుపోయిన Mi TV 4, మార్చి 13 తదుపరి సేల్

Xiaomi Mi TV 4A 43-Inch, Mi TV 4A 32-Inch ధరలు

Xiaomi Mi TV 4A 43-Inch, Mi TV 4A 32-Inch ధరలు

43 అంగుళాల Mi TV 4A ధరను కంపెనీ రూ.22999గా నిర్ణయించింది. అలాగే 32 అంగుళాల Mi TV 4A ధరను రూ. 13,999గా నిర్ణయించింది. కాగా ఈ రెండు వేరియంట్లు మార్చి 13న Mi.com, Flipkart, and Mi Home stores ద్వారా అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ వారానికి రెండు రోజుల సేల్ నిర్వహిస్తామని ప్రామిస్ చేస్తోంది. మంగళవారం, శుక్రవారాల్లో మాత్రమే ఈ టీవీ అమ్మకానికి రానుంది.

లాంచింగ్ ఆఫర్ కింద..

లాంచింగ్ ఆఫర్ కింద..

కాగా ఈ రెండు వేరియంట్లు లాంచింగ్ ఆఫర్ కింద జియోఫై కనెక్షన్ తీసుకుంటే కంపెనీ రూ. 2200 క్యాష్ బ్యాక్ రూపంలో అందించనుంది. అలాగే 500,000 hours ఉచితంగా అందించనుంది. ఇందులో 80 శాతం ఉచిత కంటెంట్ ఉండనుంది. మొత్తం 15 భాషల్లో ఈ కంటెంట్ లభ్యమవుతోంది.

కంటెంట్ పార్టనర్లుగా..
 

కంటెంట్ పార్టనర్లుగా..

కాగా కంటెంట్ పార్టనర్లుగా Hotstar, Voot, Voot Kids, Sony Liv, Hungama Play, Zee5, Sun NXT, ALT Balaji, Viu, TVF, and Flickstree. Hungama లాంటి కంపెనీలు ఉండనున్నాయి. వీటినుంచి మీరు మీకు కావాల్సిన వాటిని ఉచితంగా పొందే అవకాశం ఉంది.

Xiaomi 43-Inch Mi TV 4A specifications

Xiaomi 43-Inch Mi TV 4A specifications

కాగా దీన్ని షియోమి గతేడాది మార్చిలో చైనాలో లాంచ్ చేసింది. దీన్నే కొద్ది మార్పులతో ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేసింది. 43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Xiaomi 32-Inch Mi TV 4A specifications

Xiaomi 32-Inch Mi TV 4A specifications

దీన్ని చైనాలో షియోమి గతేడాది జూలైలో లాంచ్ చేసింది. అతికొద్ది మార్పులతో ఇండియాకి తీసుకొచ్చింది. sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. 

 అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Launches Mi TV 4A Series in India With 32-Inch and 43-Inch Models: Price, Specifications More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X