రూ. 399కే షియోమి నుంచి పవర్‌పుల్ ఇయర్ ఫోన్స్

|

ఇండియా మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ ఎంఐ ఇయర్‌ఫోన్స్, ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ పేరిట రెండు కొత్త ఇయర్‌ఫోన్ మోడల్స్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఎంఐ ఇయర్‌ఫోన్స్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రూ.699 ధరకు లభిస్తుండగా, ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ ఇయర్‌ఫోన్లు రూ.399 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో యూజర్లు కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు వీటిపై ఆఫర్లను కూడా షియోమి అందిస్తోంది. రెడ్‌మీ 5, రెడ్‌మీ నోట్ 5 ఫోన్లతో ఈ ఇయర్‌ఫోన్స్‌ను కలిపి కొంటే రూ.100 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఇయర్‌ఫోన్ మోడల్స్ రెండింటిలోనూ యూజర్లకు పవర్‌ఫుల్ బేస్‌తో కూడిన సౌండ్ వస్తుంది.

 
రూ. 399కే షియోమి నుంచి పవర్‌పుల్ ఇయర్ ఫోన్స్

అత్యంత నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్ వీటిలో లభిస్తుంది. డైనమిక్ బేస్ అనే ఫీచర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ రెండు ఇయర్‌ఫోన్లలోనూ బిల్టిన్ మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వాయిస్ కాల్స్ ఆన్సర్, కట్ చేయడానికి, సాంగ్స్ వినేటప్పుడు ప్లే, పాజ్‌కు ప్రత్యేకంగా బటన్లను ఇచ్చారు.

సిగ్గుమాలిన చైనా, వాట్సప్ ద్వారా ఇండియాపై హ్యాకింగ్ దాడి, +86తో జాగ్రత్తసిగ్గుమాలిన చైనా, వాట్సప్ ద్వారా ఇండియాపై హ్యాకింగ్ దాడి, +86తో జాగ్రత్త

ఇదిలా ఉంటే షియోమి తన కొత్త ఫోన్ రెడ్ మి 5ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వివరాలపై కూడా ఓ లుక్కేయండి.

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్

రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది.
2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 7,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండో వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. దీని ధర 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌. బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు.

జియో ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌
 

జియో ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌

రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌తో 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్‌ జియో నుంచి రూ. 2,200 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌ 5 శాతం డిస్కౌంట్‌ ప్రకటించాయి. తొలిసారి కిండ్లీ ఈ-బుక్స్‌ కొనేవారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...

కాగా ఇది రెడ్ మి4 సక్సెస్ అయిన నేపథ్యంలో దీనికి మరిన్ని ఫీచర్లను జోడిస్తూ షియోమి redmi 5ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే 5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/4 జీబీ ర్యామ్ 16/32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Xiaomi Mi Earphones, Mi Earphones Basic Launched In India Starting At Rs. 399 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X