యెల్లైట్ నుంచి సరికొత్త ప్రొడక్ట్ లాంచ్!

Posted By: Madhavi Lagishetty

షియోమీ సబ్ బ్రాండ్ కంపెనీ యెల్లైట్ నుంచి సరికొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి రానుంది. స్మార్ట్ హోం ప్రొడక్ట్ తయారీ దారు అయిన యెల్లైట్ వాయిస్ అసిస్టెంట్ ఆధారిత స్మార్ట్ స్పీకర్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. యెల్లైట్ కంపెనీ , వాయిస్ అసిస్టెంట్ స్పీకర్ ను మొట్టమొదటిసారిగా డబ్ చేయబడింది.

యెల్లైట్ నుంచి సరికొత్త ప్రొడక్ట్ లాంచ్!

యెల్లైట్ అసిస్టెంట్ ను పరిశీలించినట్లయితే...అమెజాన్ యొక్క ఎకో డాట్ స్పీకర్తో పోల్చినట్లయితే...డిజైన్ అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చు. స్మార్ట్ స్పీకర్ పైభాగంలో నాలుగు బటన్స్ ఇచ్చారు. యాక్షన్ బటన్, మైక్రో బటన్ ఆఫ్ఆన్, వాల్యూమ్ అప్ బటన్. వాల్యూమ్ డౌన్ బటన్, ఎకో డాట్ మాదిరిగా ఉంటుంది. స్పీకర్ను మ్యూట్ చేయడానికి యెల్లైట్ స్పీకర్ మధ్యలో మరోక బటన్ ఉంది.

ఇలాంటి ఫీచర్ ఎకో డాట్ లో ఉండకపోయినా...అమెజాన్ ఎకో యొక్క పెద్ద వెర్షన్లో లభిస్తుంది. స్మార్ట్ స్పీకర్ మైక్రోసాఫ్ట్ యొక్క కార్టానా వాయిస్ అసిస్టెంట్ ఆధారితమైనదిగా చెప్పవచ్చు. దీనికి అదనంగా ఆరు మైక్రోఫోన్లు మరియు సింగిల్ 2-వాట్ స్పీకర్ ఉంటుంది.

ఈ డివైస్ అడ్వాన్స్డ్ వాయిస్-వేక్ ఆల్గోరిథంలో సెట్ చేశారు. ఇది 5మీటర్ల పరిధిలో ఉన్న డివైస్ను టర్న్ చేయగలదు. అకోస్టిక్ ఎకో రద్ద మరియు ప్రతిధ్వని తగ్గింపు కోసం బీమఫార్మింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.

కొనుగోలుదారులకు ఆఫ్‌లైన్‌‌లో షాకిస్తున్న రెడ్‌మి 5ఏ..

స్మార్ట్ స్పీకర్ 64బిట్ కార్టెక్స్ A53క్వాడ్ కోర్ ప్రొసెసర్ ద్వారా రన్ అవుతోంది. 1.2గిగా వద్ద క్లాక్, 256ఎంబి ర్యామ్, 256ఎంబి ఫ్లాష్ స్టోరేజితో వస్తుంది. కనెక్టివిటీ పరంగా చూసినట్లయితే ఈ డివైస్ 2.4గిగా మరియు 5గిగా డ్యూయల్ బాండ్ , వై-ఫై, బ్లూటూత్ తో వస్తుంది.

యెల్లైట్ వాయిస్ అసిస్టెంట్ డ్యుయల్ AI సిస్టమ్ తో వస్తుంది. స్మార్ట్ బల్బల్స్, టేబుల్ లాంప్స్, బెడ్ లైట్స్, సీలింగ్ లైట్స్ వంటి ఇతర ప్రొడక్ట్స్ ను నియంత్రించే సామర్థ్యాన్ని షియోమీ కలిగి ఉంది.

199యువాన్ (1,950)లకు స్మార్ట్ స్పీకర్ ధర నిర్ణయించారు. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రొడక్ట్స్ ధరలు మరియు లభ్యత గురించి ఎలాంటి సమాచారం లేదు.

English summary
In terms of design, Yeelight Voice Assistant looks pretty similar to Amazon's Echo Dot speaker.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot