‘Mi Air Purifier 2’ పై రూ.1000 తగ్గింపు

|

దట్టమైన పొగమంచు కారణంగా స్వచ్చమైన గాలిని ఆస్వాదించలేకపోతోన్న ఢిల్లీ వాసులకు కొంతలో కొంత ఊరటనిచ్చే వార్త ఇది. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం అతలాకుతలం చేస్తోన్న నేపథ్యంలో షావోమి తన Mi Air Purifier 2 పై రూ.1000 తగ్గింపును ప్రకటించింది.

Xiaomi Mi Air Purifier 2 receives Rs. 1,000 price cut; now available at Rs. 8,999

లాంచ్ సమయంలో ఎంఐ ఎయిర్ ప్యూరిఫయిర్ 2 ధర రూ.9,999గా ఉంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.8,999కే ఈ ప్రొడక్ట్‌ను విక్రయిస్తున్నారు.

ఈ ప్యూరిఫైర్‌ను ఎంఐ హోమ్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ ద్వారా ఎయిర్ క్వాలిటీని రియల్ టైమ్‌లో మానిటర్ చేసుకునే వీలుంటుంది. ఈ డివైస్‌లోని ఇన్-బిల్ట్ వై-ఫై వ్యవస్థ మీ ఇంట్లోని వై-ఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవ్వగలదు. ఎంఐ ప్యూరిఫైర్‌లో ఆటో, నైట్, మాన్యువల్ ఇలా మూడు రకాల సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్‌లను యాప్ ద్వారా మేనేజ్ చేసుకునే వీలుంటుంది.

ఐఫోన్ల కోసం క్యూలు నిజం కాదా, వెలుగులోకి వచ్చిన వాస్తవాలు !ఐఫోన్ల కోసం క్యూలు నిజం కాదా, వెలుగులోకి వచ్చిన వాస్తవాలు !

ఈ ప్యూరిఫయర్‌లోని ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌ను ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుకోవల్సి ఉంటుంది. 360 డిగ్రీ ఫిల్టరింగ్ కోసం ఈ ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌ను సిలిండ్రికల్ షేపులో ఫిట్ చేయటం జరుగుతుంది. ఈ ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌లో పీఈటీ ప్రీ-ఫిల్టర్, ఈపీఏ ఫిల్టర్ ఇంకా యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు ఉంటాయి.

ఎంఐ ప్యూరిఫైర్ 2 అందించే క్లీయర్ ఎయిర్ డెలివరీ రేట్ గంటకు 330 క్యూబిక్ మీటర్లుగా ఉంటుందని
షియోమీ చెబుతోంది. గాలిలోని కాలుష్యాన్ని 99.7 శాతం వరకు ఈ ప్యూరిపైర్ తగ్గించగలదట. డిజైనింగ్ పరంగానూ ఈ ప్యూరిఫైర్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi Air Purifier 2 has received a price cut of Rs. 1,000 that takes its price down to Rs. 8,999.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X