షియోమి నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్
చైనీస్ ఎలక్రానిక్ తయారీ దిగ్గజం షియోమి స్మార్ట్‌ఫోన్ రంగంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో కూడా దూసుకుపోతోంది.
చైనీస్ ఎలక్రానిక్ తయారీ దిగ్గజం షియోమి స్మార్ట్‌ఫోన్ రంగంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో కూడా దూసుకుపోతోంది. ఇందులో భాగంగా షియోమి తన లేటెస్ట్ ఉత్పత్తులను ఇండియాలో రిలీజ్ చేస్తోంది. ఇండియాలో తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవడం ద్వారా భారీగా లాభాలను కొల్లగొడుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ Mi AirPOP PM2.5 Anti-Pollution maskని ఇండియాలో విడుదల చేసింది. ఈ ప్రొడక్ట్ మి.కామ్ లో ప్రత్యేకంగా అమ్మకానికి వచ్చింది. ఇతర లైప్ స్టయిల్ ఉత్పత్తుల లాగానే Mi AirPOP PM2.5 Anti-Pollution Mask కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. దీని ధరను కంపెనీ రూ.249గా నిర్ణయించింది.అయితే ఈ మాస్క్ వాష్ చేయడానికి సాధ్యం కాదని కంపెనీ తెలిపింది.

Mi AirPOP PM2.5 anti-pollution mask
ఈ మాస్క్ మొత్తం నాలుగు లేయర్లతో వచ్చింది. కాబట్టి దాదాపు 99 శాతం వరకు యూజర్లకు రక్షణ ఇవ్వనుంది. పొల్యూషన్ నుండి రక్షించుకునేందుకు దాదాపు 4 అత్యాధునిక లేయర్లను ఇందులో పొందుపరిచారు.

వీటి నుంచి విముక్తి పొందవచ్చు
ఈ ఫిల్టర్ లేయర్లు seasonal haze, dust storms, cold and flu pathogens, allergic pollen, grease, smoke and contaminants వంటి వాటి నుండి మనల్ని రక్షిస్తాయి.

చర్మానికి అనుగుణంగా..
ఈ ఫిల్టర్ లేయర్ చర్మానికి అనుగుణంగా తయారు చేసి ఇండియాకు కంపెనీ తీసుకువచ్చింది. ఇందులో ప్రధానంగా 3డీ టెక్నాలజీని వాడారు. ఈ లేయర్ మాస్క్ ఏ వాతావరణంను అయినా తట్టుకునే విధంగా ముఖ్యంగా పొల్యూషన్ ని దరిచేరనీయకుండా తీసుకువచ్చారు.

అధికారిక టెస్టింగ్
షియోమి కంపెనీ ఈ మాస్క్ మీద ఇప్పటికే మూడు రకాల టెస్ట్ లను నిర్వహించింది. వీటిల్లో పాస్ కూడా అయింది. China's new Level B filtering standardలో స్కీన్ టెస్ట్ మీద పాజిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది.

స్మార్ట్ టీవీలు ప్రైస్ తగ్గుదల
కాగా షియోమి కంపెనీ ఈ మధ్య స్మార్ట్ టీవీల ధరలను తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్ టీ రేటుని తగ్గించడంతో కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. కాగా కేంద్రం జిఎస్ టీ ని 28 నుంచి 18 శాతానికి తగ్గించినసంగతి అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications








