Just In
- 38 min ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 17 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 19 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 22 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Movies
Waltair Veerayya 3 Weeks Collections: వీరయ్య అరాచకం.. 3 వారాల్లో అన్ని కోట్లా.. చిరంజీవి పెను సంచలనం
- News
అమెరికాలో చైనా బెలూన్ కలకలం-అణు కేంద్రాలపై చక్కర్లు- అయినా కూల్చలేని పరిస్ధితి...
- Sports
IND vs AUS: భారత స్పిన్‌ను చితక్కొట్టేందుకు ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్!
- Finance
తగ్గిన బంగారం ధరలు.. అయినా బంగారం ప్రియులలో టెన్షన్.. త్వరలో 60వేలకు పసిడి!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Xiaomi నుంచి Mi Smart Band 7 Pro విడుదల.. త్వరలో భారత్‌లోనూ!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మరో షావోమీ మరో స్మార్ట్ వాచ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. Mi Band 7 Pro పేరుతో జీపీఎస్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ వాచ్‌ను సోమవారం చైనా మార్కెట్లో విడుదల చేసింది. 1.64 అంగుళాల రెక్టాంగ్యులర్ ఆకారంలో AMOLED (280x456 pixels) డిస్‌ప్లే కలిగిన ఈ వాచ్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు ఇదువరకే కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా హార్ట్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది.

Mi Smart Band 7 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ Mi Smart Band 7 1.64 అంగుళాల రెక్టాంగ్యులర్ ఆకారంలో AMOLED (280x456 pixels) డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ మంచి ఫిట్‌నెస్ ట్రాకర్‌గా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఎల్లప్పుడూ టైమ్ఇ, డేట్ తెలుసుకునేలా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మోడ్ కలిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ సాటిలైట్ పోజిషనింగ్ తో పాటుగా, జీపీఎస్ సపోర్ట్ కలిగి ఉంది. ఇది క్విక్ రిలీజ్ రిస్ట్ బ్యాండ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ 14 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు, 117 ఎక్సర్‌సైజ్ మోడ్స్‌ను కలిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగాహెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఇది 235mAh సామర్థ్యం గల బ్యాటరీ సెటప్ తో వస్తోంది. ఈ బ్యాండ్ కు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా 12 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలిపింది.

Mi Smart Band 7 Pro ధర:
ఈ బ్యాండ్‌లో కాల్స్, మెసేజెస్ నోటిఫికేషన్ సౌకర్యం ఉంటుంది. ఇది బ్లూటూత్ v5.2 వర్శన్ ను కలిగి ఉంది. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ వాటర్ రెసిస్టెంట్ గా పని చేస్తుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ 5ATM వాటర్ రెసిస్టెంట్ డిజైన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ Mi Smart Band 7 Pro చైనాలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. చైనాలో దీని ధర CNY 399 గా నిర్ణయించారు. భారత్‌లో దాదాపు రూ.4700 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. జులై 7 వరకు ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద CNY 379 (రూ.4500) కు అందిస్తున్నారు. ఇది ఆరెంజ్, బ్లూ, గ్రీన్, వైట్ కలర్లలో అందుబాటులో ఉండనుంది. భారత్‌లోనూ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని సమాచారం.
Mi స్మార్ట్ బ్యాండ్ 7 ప్రో లాంచ్‌తో పాటు, చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi 12S ultra , Xiaomi 12S pro మరియు Xiaomi 12S కంపెనీ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను సోమవారం ఆవిష్కరించింది. Xiaomi 12S సిరీస్‌లోని మూడు వేరియంట్‌లు Qualcomm యొక్క Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్‌తో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు లైకా ఆప్టిక్స్‌ను కూడా కలిగి ఉన్నాయి. చైనా కంపెనీ షావోమీ Mi 12 Pro Dimensity ఎడిషన్‌ను కూడా తన కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ-పవర్డ్ స్మార్ట్‌ఫోన్‌గా జూలై 4న విడుదల చేసింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న Mi Smart Band 6 వివరాలు:
షావోమీ సంస్థకు చెందిన Mi Smart Band 6 భారత్‌లో గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. ఇది 1.56 అంగుళాల టచ్ డిస్‌ప్లే (152 x 486 pixels)కలిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఇది 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 326ppi పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్, స్లీప్ బ్రీత్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఇది కూడా ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 14 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది 5ATM వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను కలిగి ఉంది. ఇన్‌బుల్ట్ సెన్సార్‌లను వినియోగించుకొని ఇండోర్ ట్రైనింగ్, ప్రొఫెషల్ స్పోర్ట్స్ సహా మొత్తంగా 30 వర్కౌవుట్ టైప్స్‌ను ఈ బ్యాండ్ ట్రాక్ చేయగలదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470