Xiaomi Mi Bunny Watch 4 యొక్క ఫీచర్స్ మీద ఓ లుక్ వేసుకోండి!!!!

|

షియోమి యొక్క Mi బన్నీ వాచ్ 4 ను ఈ రోజు చైనాలో లాంచ్ చేసారు. ఇది డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండి కేవలం ఒక ఛార్జ్ మీద ఎనిమిది రోజుల వరకు లైఫ్ ను అందించే పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4G సపోర్ట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉన్న స్పెసిఫికేషన్ల యొక్క అద్భుతమైన జాబితాను కలిగి ఉంది.

షియోమి Mi బన్నీ వాచ్ 4

షియోమి Mi బన్నీ వాచ్ 4 ఇతర స్మార్ట్ వాచ్‌లతో పోలిస్తే కొద్దిగా పెద్దదిగా ఉంది. ఇది AI సేఫ్ పొజిషనింగ్ వంటి లక్షణాలను కలిగి ఉండి తల్లిదండ్రులు తమ పిల్లల స్థానాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది.

షియోమి Mi బన్నీ వాచ్ 4 ధరల వివరాలు

షియోమి Mi బన్నీ వాచ్ 4 ధరల వివరాలు

షియోమి Mi బన్నీ వాచ్ 4 యొక్క ధర విషయానికి వస్తే ఇది CNY 899 ధర వద్ద లభిస్తుంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.9,600. ఇది బ్లూ మరియు పింక్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ప్రస్తుతం చైనాలో ప్రీ-సేల్ కోసం సిద్ధంగా ఉంది. వినియోగదారులు ఏప్రిల్ 3 మరియు ఏప్రిల్ 8 మధ్య CNY50 (సుమారు రూ. 530) డిపాజిట్ చేసి దీనిని బుక్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 9 మరియు ఏప్రిల్ 12 మధ్య చెల్లించవచ్చు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

షియోమి యొక్క Mi బన్నీ వాచ్ 4 స్మార్ట్ వాచ్‌ 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను 326ppi సాంద్రతతో వస్తుంది. ఈ డిస్ప్లే 2.5D కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 చేత ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో రెండు 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఒకటి వీడియో కాల్స్ కోసం వాచ్ ఫేస్ మీద మరియు మరొకటి దానికి అవతలి వైపు ఉంటుంది ఇది మీ ముందు ఉన్న వారి యొక్క ఫోటోలను మరియు వీడియోలను తీయడానికి ఉపయోగించవచ్చు. ఈ గడియారం NFC, వై-ఫై, 4G, స్పీకర్లు మరియు మైక్రోఫోన్‌తో వస్తుంది. షియోమి Mi బన్నీ వాచ్ 4 20 మీటర్ల వరకు నీటి నిరోధకతను కలిగి ఉంది. ఇది 920mAh బ్యాటరీని కలిగి ఉంది 296 గ్రాముల బరువుతో వస్తుంది.

 

 

 

Disney+ Hotstar వాడుతున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!!!!Disney+ Hotstar వాడుతున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!!!!

షియోమి Mi బన్నీ వాచ్ 4 ఫీచర్స్

షియోమి Mi బన్నీ వాచ్ 4 ఫీచర్స్

షియోమి యొక్క Mi బన్నీ వాచ్ 4 స్మార్ట్ వాచ్‌లో వై-ఫై, 4G సపోర్ట్, మరియు ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. AI గుర్తింపును కలిగి ఉన్న రెండవ 5 మెగాపిక్సెల్ కెమెరా సహాయంతో తల్లిదండ్రులు తమ పిల్లల చుట్టూ ఉన్నదాన్ని చూడవచ్చు. ఈ వాచ్ పిల్లల యొక్క స్థానాన్ని ఖచ్చితంగా సూచించడానికి AI ఫీచర్ ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా 4000 కంటే ఎక్కువ షాపింగ్ మాల్స్, రైల్ స్టేషన్లు మరియు విమానాశ్రయాల డేటాబేస్ను కలిగి ఉంది. అంతర్నిర్మిత వాయిస్ అసిస్టెంట్ పిల్లలకు అలారాలు అమర్చడంలో, సంగీతాన్ని ప్లే చేయడంలో మరియు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సహాయపడుతుంది. వాచ్ ఇంగ్లీష్ భాష కోసం AI మూల్యాంకనానికి మద్దతు ఇస్తుంది. పిల్లలకు సరళమైన ఇంగ్లీష్ మాట్లాడటానికి నాలుగు మాడ్యూళ్ళతో వస్తుంది. షియోమి Mi బన్నీ వాచ్ 4 లో అవసరమైన రకరకాల యాప్స్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Bunny Watch 4 Launched : Price,Specifications,Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X