ఇండియాలో లాంచ్ అయిన షియోమి కొత్త ప్రొడక్ట్స్ ఇవే

ఇటు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇటు యాక్సెసరీస్ విభాగంలోనూ షియోమి ఇండియా తన ప్రొడక్ట్ పోర్టిఫోలియోను  విస్తరించు కుంటుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి Mi Car ఛార్జర్‌తో పాటు Mi 2- in-1 యూఎస్బీ కేబుల్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ప్రొడక్ట్స్‌ను Mi.com డిస్కౌంట్ ధరల్లో విక్రయిస్తోంది. 20శాతం డిస్కౌంట్ పోనూ Mi Car ఛార్జర్‌ను రూ.799కి, 2-in-1 యూఎస్బీ కేబుల్‌ను రూ.399కి సొంతం చేసుకునే వీలుంటుంది.

ఇండియాలో లాంచ్ అయిన షియోమి కొత్త ప్రొడక్ట్స్ ఇవే

Read More : లెనోవో K8 Plus లాంచ్ అయ్యింది, ధర రూ.10,999, స్పెషల్ ఫీచర్స్ ఇవే

మెటాలిక్ డిజైన్‌కు తోడు 18-స్టెప్ ప్రాసెస్ పై రూపొందించబడిన Mi Car ఛార్జర్ 12వోల్ట్స్ అలానే 24 వోల్ట్స్ పవర్ పోర్ట్‌లను సపోర్ట్ చేస్తుంది. డివైస్ కు కనెక్ట్ అయిన సమయంలో ఈ ఛార్జర్ అవుట్ పుట్ లెవల్‌ను ఆటోమెటిక్‌గా అడ్జస్ట్ చేసుకుని పనిచేస్తుంది. అన్నిరకాల స్మార్ట్‌ఫోన్స్ అలానే టాబ్లెట్‌లను ఈ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇక 2-in-1 యూఎస్బీ కేబుల్ విషయానికి వచ్చేసరికి ఈ కేబుల్ 2.4A వరకు ఛార్జ్ చేయగలదు. మైక్రోయూఎస్బీ అలానే యూఎస్బీ టైప్-సీ పోర్ట్ డివైసెస్ మధ్య ఛార్జింగ్ అలానే డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఈ కేబుల్ ఉపకరిస్తుంది.  

English summary
Xiaomi Mi Car Charger, Mi 2-in-1 USB Cable Launched in India: Price, Specifications. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot