మార్కెట్లోకి Mi Pocket స్పీకర్, ధర రూ.1,499

చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమి (Xiaomi), తన ఆడియో ప్రోడక్ట్ లైనప్ నుంచి సరికొత్త పోర్టబుల్ స్పీకర్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

|

చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమి (Xiaomi), తన ఆడియో ప్రోడక్ట్ లైనప్ నుంచి సరికొత్త పోర్టబుల్ స్పీకర్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 'ఎంఐ పాకెట్ స్పీకర్ 2' (Mi Pocket Speaker 2) పేరుతో ఈ ఆడియో ప్రొడక్ట్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.1499. జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని షావోమి ఈ స్పీకర్‌ను ఆవిష్కరించింది. కొద్దిపాటి డిజైన్‌ను కలిగి ఉన్న ఈ పాకెట్ ఫ్రెండ్లీ స్పీకర్‌లో బ్లుటూత్ 4.1 కనెక్టువిటీతో పాటు 5 వాట్ స్పీకర్‌ను షియోమి నిక్షిప్తం చేసింది. ఫుల్ ఛార్జ్ పై 7 గంటల పాటు కంటిన్యూస్ మ్యూజక్‌ను ఈ స్పీకర్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ స్పీకర్‌ను Mi.com ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్స్‌లో ఈ స్పీకర్ అందుబాటులో ఉంటుంది.

 
Xiaomi Mi Pocket Speaker 2

10 మీటర్ల రేంజ్ వరకు..
బ్లుటూత్ 4.1 కనెక్టువిటీ స్టాండర్డ్స్‌తో వస్తోన్న ఈ స్పీకర్ 10 మీటర్ల రేంజ్ వరకు కవర్ చేయగలుగుతుంది. స్పీకర్‌లో పొందుపరిచిన 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 3.7 వాట్ కెపాసిటీని కలిగి ఉంటుంది . 10 డిగ్రీల సెల్సీయస్ నుంచి 40 డిగ్రీల సెల్సీయస్ వరకు వివిధ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఈ బ్యాటరీ వర్క్ అవుతుంది. ఈ స్పీకర్ సైజ్ విషయానికి వచ్చేసరికి 60x60x93.3 మిల్లీ మీటర్లుగా ఉంటుంది.

 

బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు..
స్పీకర్ మెయిన్ బాడీని పాలీకార్బోనేట్ అలానే ఏబీఎస్ మెటీరియల్‌తో, అప్పర్ బాడీని అల్యూమినియం మిశ్రమంతో బిల్ట్ చేసారు. స్పీకర్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ స్పీకర్ వర్కింగ్ కండీషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. స్పీకర్‌లో నిక్షిప్తం చేసిన బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవటంతో పాటు రిసీవ్ చేసుకోవచ్చు. కాల్ వచ్చిన సమయంలో మ్యూజిక్ ఆటోమెటిక్‌గా పాస్ కాబడుతుంది. కాల్ ఎండ్ అయిన వెంటనే మ్యూజిక్ ప్లే అవటం మొదలవుతుంది.

సెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోందిసెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోంది

1000వ సర్వీస్ సెంటర్‌ను హైదరాబాద్‌లో...
ఇండియన్ మార్కెట్లో షియోమీ తన Mi స్పీకర్లతో పాటు హెడ్‌ఫోన్‌లను కూడా విక్రయిస్తోంది. వీటిలో ఎంఐ హెడ్‌ఫోన్స్ కంఫర్ట్, ఎంఐ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ప్రో హెచ్‌డి, ఎంఐ ఇయర్ ఫోన్స్ బ్లాక్, ఎంఐ ఇయర్ ఫోన్స్ సిల్వర్, ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ వంటి మోడల్స్ ప్రజాదరణను సొంతం చేసుకున్నాయి. ఇండియన్ మార్కెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్న షియోమీ తన 1000వ సర్వీస్ సెంటర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసింది. జూలై, 2014లో ప్రారంభమైన షియోమీ ఇండియన్ ప్రస్థానం ఇప్పటి వరకు 600 పట్టణాలకు విస్తరించింది.

Best Mobiles in India

English summary
Xiaomi on Thursday announced the launch of its latest audio product in the Indian market - the Mi Pocket Speaker 2.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X