రూ.1199కే షియోమి వై-ఫై రౌటర్, 65 డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి ఓ వైపు స్మార్ట్‌ఫోన్‌ల పైన దృష్టిసారిస్తూనే మరోవైపు యాక్సెసరీస్ పైన కూడా దృష్టిసారిస్తోంది. తాజాగా రెడ్మీ 4 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఓ శక్తివంతమైన వై-ఫై రౌటర్‌ను కూడా షియోమి లాంచ్ చేసింది.

Read More : Redmi 4 వచ్చేసింది, రూ.6,999కే కేక పుట్టించే ఫీచర్లతో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mi Router 3C

Mi Router 3C పేరుతో విడుదలైన ఈ రౌటర్ ధర రూ.1199. మే 20 నుంచి Mi Home storeలో, మే 23 నుంచి Mi.comలో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో జూన్ 8 నుంచి ఈ రౌటర్ అందుబాటులో ఉంటుంది.

"high-performance" యాంటెనా వ్యవస్థ

ఈ రౌటర్‌లో ప్రత్యేకమైన పీసీబీ సర్క్యూట్ బోర్డుతో పాటు నాలుగు "high-performance" యాంటెనాలు ఉంటాయి. వై-ఫై రేంజ్ ఇంకా సిగ్నల్ స్టెబిలిటీని పెంచటంలో ఈ యాంటెనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

కేసారి 64 డివైస్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది..

64 ఎంబి ర్యామ్ సామర్థ్యంతో వస్తోన్న ఈ రౌటర్ గరిష్టంగా 300Mbps వేగంతో డేటాను అందించగలదు.. ఈ రౌటర్‌ను ఒకేసారి 64 డివైస్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. 2.4గిగాహెడ్జ్ క్లాక్ వేగంతో 802.11n వై-ఫై ప్రోటోకాల్‌ను ఈ రౌటర్ సపోర్ట్ చేస్తుంది.

రెండు LAN పోర్ట్స్, ఒక WAN పోర్ట్

ఈ రౌటర్‌లో రెండు LAN పోర్ట్స్, ఒక WAN పోర్ట్ ఇంకా త్రీ-కలర్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. రౌటర్ బరువు 241 గ్రాములు, చుట్టుకొలత 195x107x25.3 మిల్లీ మీటర్లు.

రౌటర్ పనితీరును రియల్ టైమ్‌లో మానిటర్ చేసుకోవచ్చు

ఈ రౌటర్ కోసం ప్రత్యేకకంగా Mi Wi-Fi యాప్‌ను షియోమి అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రౌటర్‌ను సులువుగా సెటప్ చేసుకుని రౌటర్ పనితీరును రియల్ టైమ్‌లో మానిటర్ చేసుకునే వీలుటుంది. వై-ఫై పాస్‌వర్డ్, పేరెంటల్ కంట్రోల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా ఈ యాప్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Router 3C that delivers 300Mbps wireless speed launched at Rs.1,199. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting