షియోమీ నుంచి సరికొత్త గేమింగ్ మౌస్ ప్యాడ్స్

|

భారతదేశపు నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిన 'షియోమీ' (Xiaomi) తన గేమింగ్ యాక్సిసరీస్ విభాగం నుంచి సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ లైనప్ నుంచి ఓ వీఆర్ హెడ్‌సెట్‌తో పాటు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఆ సంస్థ, తాజాగా రెండు సరికొత్త గేమింగ్ మౌస్ ప్యాడ్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఎంఐ మౌస్ ప్యాడ్ (Mi Mouse Pad), ఎంఐ స్మార్ట్ మౌస్ ప్యాడ్ (Mi Smart Mouse Pad) పేర్లతో ఈ ప్రొడక్ట్స్ లభ్యమవుతున్నాయి. వీటిలో ఎంఐ మౌస్ ప్యాడ్ మోడల్‌ను ప్రత్యేకించి గేమర్స్ కోసం షియోమీ డిజైన్ చేసింది. మరొక మోడల్ అయిన ఎంఐ స్మార్ట్ మౌస్ ప్యాడ్‌లో గేమింగ్ ఫీచర్లతో పాటు ఇతర ఫీచర్లను కూడా షియోమీ నిక్షిప్తం చేసింది.

 

రూ.87 వేల కోట్ల ప్రాజెక్ట్ రూ.13 వేలకే, అమెరికాకు దిమ్మతిరిగిందిరూ.87 వేల కోట్ల ప్రాజెక్ట్ రూ.13 వేలకే, అమెరికాకు దిమ్మతిరిగింది

షియోమీ నుంచి సరికొత్త గేమింగ్ మౌస్ ప్యాడ్స్

వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌...
ఎంఐ స్మార్ట్ మౌస్ ప్యాడ్‌కు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఆర్‌జీబీ లైటింగ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ రెండు మౌస్ ప్యాడ్స్ ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రారంభ వేరియంట్ ధర రూ.500 (ఇండియన్ కరెన్సీ ప్రకారం). ఇండియన్ మార్కెట్లో వీటి అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్అలడి కావల్సి ఉంది.

2018కి గాను జర్మన్ డాట్ డిజైన్ అవార్డ్...
తాము నూతనంగా ఆవిష్కరించిన ఎంఐ స్మార్ట్ మౌస్ ప్యాడ్, 2018కి గాను జర్మన్ డాట్ డిజైన్ అవార్డును గెలుపొందినట్లు షియోమీ తెలిపింది. ఈ మౌస్‌తో వచ్చే క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ మాడ్యుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఛార్జ్ చేసుకునే వీలుంటుంది. ఈ మౌస్ ప్యాడ్‌లో పొందుపరిచిన టెంపరేచర్ కూల్ టెక్నాలజీ మౌస్ పూర్తిగా ఛార్జ్ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా ఆఫ్ చేసేస్తుంది. ఈ మౌస్ ప్యాడ్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌బిల్ట్ చిప్ డివైస్ రీఛార్జబుల్ స్టేజ్‌లో ఉందా లేదా అన్నది సూచిస్తుంది.

2015 నుంచే లభ్యమవుతున్నాయి..
ఇండియన్ మార్కెట్లో షియోమీ గేమింగ్ ఉత్పత్తులు 2015 నుంచే లభ్యమవుతున్నాయి. 2015లో ఆ సంస్థ ఎంఐ మౌస్ ప్యాడ్ (Mi Mouse Pad), ఎంఐ మెటల్ మౌస్ ప్యాడ్ (Mi Metal Mouse Pad) పేర్లతో రెండు విప్లవాత్మక గేమింగ్ మౌస్‌లను విడుదల చేయటం జరిగింది. అప్పట్లో ఇవి సంచలనంగా నిలిచాయి.

Best Mobiles in India

English summary
Xiaomi has launched several gaming products in its lineup, including a VR headset and a gaming smartphone, apart from the Mi Gaming Mouse.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X