సెకన్లలో అమ్ముడుపోయిన Mi TV 4, మార్చి 13 తదుపరి సేల్

|

Xiaomi నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన Mi TV 4 హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఈ టీవీలకు సంబంధించి మంగళవారం (మార్చి 13న) జరిగిన మూడవ ఫ్లాష్ సేల్ సెకన్ల వ్యవధిలోనే ముగియటంతో చాలా మంది యూజర్లు ఈ టీవీని సొంతం చేసుకోలేక పోయారు. లిమిటెడ్ స్టాక్‌లో మాత్రమే ఈ టీవీలు లభ్యమవుతుండటంతో డిమాండ్ ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. Mi TV 4 టీవీలకు సంబంధించి తరువాతి సేల్ మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ సంచలన స్మార్ట్ టీవీని Flipkartతో పాటు షావోమి ఇండియా అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ అయిన Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. ఈ టీవీ ధర రూ.39,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఈ టీవీని కొనుగోలు చేసే సమయంలో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవటం ద్వారా 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందే వీలుంటుంది.

 

కూపన్స్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ డిస్కౌంట్లను పొందటం ఎలా..?కూపన్స్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ డిస్కౌంట్లను పొందటం ఎలా..?

4కే సుపీరియర్ వెర్టికల్ అలైన్‌మెంట్ డిస్‌ప్లే‌తో...

4కే సుపీరియర్ వెర్టికల్ అలైన్‌మెంట్ డిస్‌ప్లే‌తో...

ఎంఐ టీవీ 4, 55 అంగుళాల హెచ్‌డిఆర్ స్ర్కీన్‌తో వస్తోంది. ఈ ప్యానల్‌ను సామ్‌సంగ్ అభివృద్ధి చేసింది. ఇందులో 3840x2160 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన కస్టమ్ బిల్ట్ సామ్‌సంగ్ 4కే సుపీరియర్ వెర్టికల్ అలైన్‌మెంట్ డిస్‌ప్లే పొందుపరచబడి ఉంటుంది. 4కే రిసల్యూషన్ సపోర్ట్‌ను ఈ టీవీ ఆఫర్ చేయగలుగుతుంది. 4.9 మిల్లీమీటర్ల పలుచటి స్ర్కీన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్ టెలివిజన్ సెట్‌ను ప్రపంచంలోనే అతి నాజూకైన టీవీగా షావోమి అభివర్ణిస్తోంది.

మూడు వేరియంట్‌లలో..

మూడు వేరియంట్‌లలో..

చైనా మార్కెట్లో ఎంఐ టీవీ 4ను మూడు వేరియంట్‌లలో షావోమి లాంచ్ చేసింది. అందులో మొదటి రెండు వేరియంట్లు 49, 55 అంగుళాలివి కాగా మూడవ వేరియంట్ మాత్రం 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌తో లభ్యమవుతోంది. వీటిలో 55 అంగుళాల వేరియంట్ మాత్రమే భారత్‌లో లభ్యమవుతోంది. ఎంఐ టీవీ 4, భారత్‌లోని అన్ని ప్రముఖ సెటప్ బాక్సులను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. హాట్‌స్టార్, హంగామా, సోనీ లైవ్ వంటి ఆన్-డిమాండ్ వీడియో కంటెంట్‌ను ఈ టీవీలో పొందే వీలుంటుంది.

Mi TV 4 స్సెసిఫికేషన్స్..
 

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

 

 

 Mi TV సిరీస్ నుంచి సరికొత్త టీవీలు..

Mi TV సిరీస్ నుంచి సరికొత్త టీవీలు..

ఇండియన్ యూజర్లను టార్గెట్ చేస్తూ Mi TV సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీలను షావోమి లాంచ్ చేయబోతోంది. మార్చి 7వ తేదీన అనౌన్స్ కాబోతన్న ఈ టీవీలు Mi TV 4 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. షావోమి లాంచ్ చేయబోతోన్న కొత్త టీవీ Mi TV 4C పేరుతో అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ టీవీలు రెండు డిస్ ప్లే వేరియంట్ లలో లభ్యమవుతాయని తెలుస్తోంది. అందులో ఒకటి 43 ఇంచ్ వేరియంట్ కాగా, రెండవది 55 ఇంచ్ వేరియంట్. చైనా మార్కెట్లో Mi TV 4C ధర CNY 1,849 (రూ. 19,000)గా ఉంది. ఇండియన్ మార్కెట్లో 43 ఇంచ్ Mi TV 4C ధర రూ.20,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Mi TV 4C స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)..

Mi TV 4C స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)..

ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్ విత్ 32 ఇంచ్, 42 ఇంచ్ డిస్‌ప్లే వేరియంట్స్, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ Amlogic T962 చిప్ సెట్, ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (4జీబి, 8జీబి), డాల్బీ వర్చువల్ సరౌండ్ సౌండ్, డీటీఏ ఆడియో.

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV 4 sold out within seconds again in flash sale, next sale on March 13 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X