Just In
- 1 hr ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 3 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 4 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
- 4 hrs ago
ఈ రోజు అమెజాన్ క్విజ్ లో బహుమతులు గెలుచుకోండి...సమాధానాలు ఇవే!
Don't Miss
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Automobiles
కస్టమర్ల ఇంటి వద్దకే డీజిల్ డెలివరీ; ఐడియా బాగుంది కదూ..!
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Xiaomi Mi TV 4A స్మార్ట్‌టీవీల ధరలు పెరిగాయి!!! ఎంత పెరిగాయో తెలుసా??
చైనా యొక్క ఎలక్ట్రానిక్ సంస్థ షియోమి ఇండియాలో స్మార్ట్ఫోన్లతో పాటుగా స్మార్ట్‌టీవీలను మరియు ఇతర గాడ్జెట్లను కూడా అందుబాటు ధరలో విడుదల చేస్తున్నాయి. షియోమి యొక్క Mi టివి 4A మరియు Mi టివి 4A ప్రో యొక్క ధరలను ఇప్పుడు ఇండియాలో శాశ్వతంగా పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీల మీద రూ.1000 వరకు ధరను పెంచినట్లు సంస్థ తెలిపింది. ఈ టీవీలు రెండు కూడా వివిధ పరిమాణాలలో అనేక వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ధర పెరిగిన ఈ స్మార్ట్ టీవీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Mi టీవీ 4A పెరిగిన కొత్త ధరల వివరాలు
Mi టీవీ 4A యొక్క 32-ఇంచ్ మోడల్ ఇదివరకు రూ.13,499 ప్రారంభ ధర వద్ద లభించేది. అయితే ఇప్పుడు దీని మీద రూ.500 ధర పెంచిన తరువాత ఇప్పుడు రూ.13,999 ధర వద్ద లభిస్తున్నది. అలాగే దీని యొక్క 40-ఇంచ్ మోడల్ ఇంతకు ముందు రూ.18,999 ధర వద్ద లభించేది. అయితే ఇప్పుడు దీని మీద రూ.1000 ధర పెరిగి ప్రస్తుతం రూ.19,999 ధర వద్ద లభిస్తున్నది. చివరిగా Miటీవీ 4A హారిజోన్ ఎడిషన్ ఇంతకుముందు రూ.13,999 ధర వద్ద లభించేది. అయితే ఇప్పుడు రూ.500 ధరల పెరుగుదల తరువాత ఇప్పుడు రూ.14,499 కొత్త ధర వద్ద లభిస్తున్నది.
Also Read: Tata Sky Binge+ ఉచిత OTT యాక్సిస్ లో అందరి కంటే మెరుగ్గా ఉంది!!! ఎందుకో తెలుసా??

Mi టీవీ 4A ప్రో పెరిగిన కొత్త ధరల వివరాలు
Mi టీవీ 4A ప్రో యొక్క 32-అంగుళాల స్మార్ట్‌టీవీ ఇంతకు మునుపు ఇండియాలో 13,499 రూపాయల ధర వద్ద వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దీని మీద 500 రూపాయలు ధర పెరుగుదల పొందిన తరువాత 13,999 రూపాయల కొత్త ధర వద్ద ప్రస్తుతం లభిస్తున్నది. ఇండియాలో షియోమి సంస్థ రెడ్మి బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లతో కూడా పని చేస్తున్నందున ఈ స్మార్ట్ టీవీల ధరలను పెంచింది. అయితే ఇటీవల ధరల పెరుగుదల తరువాత కూడా ఈ షియోమి స్మార్ట్ టీవీలు మార్కెట్లో అత్యంత సరసమైన స్మార్ట్‌టీవీలలో మొదటి స్థానంలో ఉన్నాయి.

Mi TV 4A, 4A ప్రో, 4A హారిజోన్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్ టీవీలన్ని Wi-Fi, బ్లూటూత్, Chromecast మరియు మరిన్ని వంటి కనెక్టివిటీ టెక్నాలజీలకు మద్దతు ఇవ్వగలవు. వీటన్నిటిలో 4A హారిజోన్ ఎడిషన్ వినియోగదారునికి 178-డిగ్రీల వీక్షణ కోణాన్ని మరియు వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ ఫీచర్స్
షియోమి కొత్త సిరీస్ Mi టీవీలు భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యాచ్‌వాల్ వెర్షన్‌తో శక్తిని పొందుతాయి. ఈ ప్యాచ్‌వాల్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ మొదలైన OTT యాప్ లను ముందే ఇంస్టాల్ చేయబడి వస్తుంది. వీటితో పాటుగా మరిన్ని ఆన్ లైన్ కంటెంట్ స్ట్రీమ్ లను అందించే యాప్ లను అనుమతిస్తుంది. మీరు ఇప్పుడు ఒకే క్లిక్‌తో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో షోలు / సినిమాలను కనుగొనడానికి యూనివర్సల్ సెర్చ్ ను ఉపయోగించవచ్చు. కిడ్స్ మోడ్ ద్వారా ఇప్పుడు పిల్లలకు అనుచితమైన కంటెంట్‌ను పరిమితం చేయడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ క్యూరేటెడ్ కంటెంట్
Mi టీవీ కొత్త సిరీస్ యొక్క క్యూరేటెడ్ జాబితాలతో యూజర్లు సెలెబ్రిటీ వాచ్‌లిస్ట్, ఇండియా టాప్ 10 టుడే, కలెక్షన్స్, ప్రాంతీయ భాషలు వంటి మరెన్నో జాబితాలతో సులభంగా కంటెంట్‌ను కనుగొనగలరు. వన్ క్లిక్ ప్లేతో మీరు హాట్‌స్టార్ ఆధారిత స్పోర్ట్స్ పేజీలో క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి గేమ్ లను సులభంగా చూడవచ్చు. ప్యాచ్‌వాల్ నుండి నేరుగా విలీనం చేయబడిన 7+ లైవ్ న్యూస్ ఛానెల్‌ల నుండి కూడా మీరు వార్తలను చూడవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190