ఓపెన్ సేల్‌పై షియోమి Mi TV 4A, రూ.13,999కే సొంతం చేసుకోండి
స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న షియోమి టీవీ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న షియోమి టీవీ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసిన షియోమి 32,43 ఇంచుల MI TV 4A ఫ్లిప్ కార్ట్ మరియు mi.com ఓపెన్ సేల్ లో అందుబాటులో ఉంటుంది.గతంలో ఈ టీవీ ను కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ కోసం వేచి చూడాల్సి వచ్చేది.ఇక పై సేల్ కోసం వేచి చూసే పని లేకుండా Flipkart మరియు mi.com లో కొనుగోలు చేయవచ్చు.ఈ టీవీ కొనుగోలు చేసిన వారికి ఫ్రీ installation,ఉచిత EMI ఆఫర్లతో పాటు బుక్ చేసిన ఒక్క రోజులోనే ఫ్లిప్ కార్ట్ డెలివరీ అందిస్తోంది.

32 అంగుళాల టీవీ ధర....
32 అంగుళాలు టీవీ ధర రూ.13,999

43 అంగుళాల టీవీ ధర
43 అంగుళాలు టీవీ ధర రూ.22,999

Flipkartతో పాటు Mi.com లో....
ఈ షియోమి MI TV 4A స్మార్ట్ టీవీని Flipkartతో పాటు షియోమీ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ అయిన Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి.

Mi TV 4A స్సెసిఫికేషన్స్..
స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4A , 64-bit quad-core Amlogic T962 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో మూడు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి.వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 10వాట్స్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

త్వరలో చైనా మార్కెట్లో విడుదల కాబోతున్న షియోమి MI TV 4A యూత్ ఎడిషన్....
ఇది ఇలా ఉంటె షియోమి త్వరలో మిడ్ రేంజ్ టీవీలను లాంచ్ చేయనుంది. MI TV 4A యూత్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. అయితే ఈ MI TV 4A యూత్ ఎడిషన్ ప్రస్తుతం చైనా మార్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇండియా మార్కెట్ లో ఎప్పుడు విడుదల కాబోయేదాని పై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ MI TV 4A యూత్ ఎడిషన్ ధర
రూ. 17,800గా కంపెనీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








