షియోమి మరో సంచలనం, రూ.10 వేలకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ

|

దేశీయ మొబైల్ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న షియోమి సరికొత్తగా టీవీ మార్కెట్లోకి ఎంటరయిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చి రావడంతోనే అత్యంత తక్కువ ధరలకే టీవీలను అందించి మిగతా టీవీ దిగ్గజాలను భయపెట్టింది. ఇప్పుడు అదే ఊపులో మళ్లీ అత్యంత తక్కువ ధరకే టీవీలను ప్రవేశపెడుతోంది. Mi TV 4C, Mi TV 4S, Mi TV 4X పేర్లతో ఈ మూడు స్మార్ట్‌టీవీలను షియోమి చైనాలో లాంచ్ చేసింది. కాగా ఈ టీవీలు కంపెనీ 8వ వార్షికోత్సవం రోజున మార్కెట్లోకి వెళ్లనున్నాయి. ఈ నెల 31న షియోమి కంపెనీ 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

 

షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?

Xiaomi Mi TV 4C

Xiaomi Mi TV 4C

32 ఇంచ్ షియోమి Mi TV 4C ధరను కంపెనీ CNY 999గా నిర్ణయించింది. మన ఇండియన్స్ కరెన్సీలో ఇది రూ. సుమారు 10, 600. ఈ టీవీ HD panelతో 1366x768 resolutionను కలిగి ఉంది. 128 డిగ్రీ వ్యూ యాంగిల్ తో తిలకించవచ్చు. దీని రెస్పాన్స్ సమయం 6.5ms, refresh rate 60Hz. కాగా ఈ టీవీ ARM Advanced multi-core processor clocked 1.5GHzతో వచ్చింది. 1జిబి ర్యామ్ తో పాటు 4జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. రెండు HDMI ports, AV port, USB port, ఒక Ethernet port, PatchWall interfaceతో పాటు ప్రీ లోడెడ్ యాప్ప్ ఇతర ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi Mi TV 4S

Xiaomi Mi TV 4S

ఈ స్మార్ట్‌టీవీ రెండు వేరియంట్లలో ( 43-inch and 55-inch variants) వచ్చింది. 43-inch మోడల్ ధర రూ. CNY 1,799 (సుమారు రూ. 19,100)గానూ, 55-inch మోడల్ ధర CNY 3,299 (సుమారు రూ.. 35,100)గానూ ఉంది. 43-inchలో 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, 55-inchలో 2 జిబి ర్యామ్ 8జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. Wi-Fi, Bluetoothని సపోర్ట్ చేస్తాయి. Xiaomi Mi TV 4C ఫీచర్లే ఇందులో ఉన్నాయి.

Xiaomi Mi TV 4X
 

Xiaomi Mi TV 4X

55 ఇంచ్ వేరియంట్లో మాత్రమే వచ్చిన దీని ధర రూ. CNY 2,799 సుమారు రూ. 29,800గా కంపెనీ నిర్ణయించింది. 4K HDR capabilities (3840x2160 panel),AI-based voice recognition system, ultra-thin bezels, Dolby audio, a 64-bit quad-core SoC, 2GB RAM, and 8GB of inbuilt storage లాంటి ఫీచర్లు ఉన్నాయి. HDMI ports, two USB ports, an AV Input, and an S/PDIF లాంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మే 31 నుంచి చైనా మార్కెట్లోకి

మే 31 నుంచి చైనా మార్కెట్లోకి

ఈ మూడు టీవీలు మే 31 నుంచి చైనా మార్కెట్లోకి వెళ్లనున్నాయి. కంపెనీ వార్షికోత్సవం ఆరోజున నిర్వహిస్తుండటంతో పాటు కంపెనీ కొత్తగా షియోమి 8పేరుతో కొత్త ఫోన్ ని కూడా ఆ రోజు లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే దీనిపై టీజర్ ని కూడా వదిలింది. అయితే ఇవి వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఇండియాలో లాంచ్ పై ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ అప్‌కమింగ్‌ లాంచ్‌పై ధృవీకరణ చేసిన షియోమి, ఎంఐ 6 సక్సెసర్‌గా ఎంఐ 7ను లాంచ్‌ చేయనుందనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాని బదులు 8వ వార్షికోత్సవ సందర్భంగా ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌నే తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఆపిల్‌ ఫేస్‌ ఐడీకి ధీటుగా

ఆపిల్‌ ఫేస్‌ ఐడీకి ధీటుగా

ఫేస్‌ ఐడీకి ధీటుగా ఇందులో ఆపిల్‌ ఫేస్‌ ఐడీకి ధీటుగా 3డీ ఫేసియల్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేయబోతున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వైబోలో టీజర్‌ ఇమేజ్‌ను పోస్టు చేసిన కంపెనీ ఎంఐ 8 లాంచింగ్‌ను ధృవీకరించింది.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

షియోమీ విడుదల చేయనున్న ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లే కిందే ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వివో తన నూతన స్మార్ట్‌ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇలా డిస్‌ప్లే కిందే ఏర్పాటు చేయగా, ఆ కోవలోకి ఇప్పుడు షియోమీ కూడా వచ్చి చేరనుంది.

షియోమి ఎంఐ 8 రూమర్‌ స్పెషిఫికేషన్లు

షియోమి ఎంఐ 8 రూమర్‌ స్పెషిఫికేషన్లు

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ, ఓలెడ్ డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్‌,256/512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఎంఐయూఐ 10 ఓఎస్, డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కాగా ఈ ఫోన్ ప్రారంభ దర రూ.34వేలుగా ఉండనున్నట్లు సమాచారం.

 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ , ధర రూ. 31 వేలు

55 ఇంచ్ స్మార్ట్‌టీవీ , ధర రూ. 31 వేలు

55 ఇంచ్ స్మార్ట్‌టీవీ , ధర రూ. 31 వేలు55 ఇంచ్ స్మార్ట్‌టీవీ , ధర రూ. 31 వేలు

మరిన్ని కథనాలు

మరిన్ని కథనాలు

రూ.22వేలకే 50 ఇంచుల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీరూ.22వేలకే 50 ఇంచుల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ

రూ.13,499కే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీరూ.13,499కే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ

షియోమి ఆ రెండింటి ధరలను పెంచేసింది !షియోమి ఆ రెండింటి ధరలను పెంచేసింది !

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV 4C, Mi TV 4S, and Mi TV 4X launched in China starting from CNY 999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X