సంక్రాంతి కానుకగా రెండు కొత్త టీవీలను లాంచ్ చేసిన షియోమి
చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. Mi TV 4X Pro,Mi TV 4A Pro పేరిట రెండు సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను ఇండియా మార్కెట్‌లో విడుదల చేసింది.
చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. Mi TV 4X Pro,Mi TV 4A Pro పేరిట రెండు సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను ఇండియా మార్కెట్‌లో విడుదల చేసిందికాగా ఈ రెండు టీవీలు జనవరి 15న Mi.com, Flipkart, మరియు Mi Home stores ద్వారా అమ్మకానికి రానున్నాయి.షియోమి కంపెనీ ఈ టీవీలతో పాటు సౌండ్ బార్ ను కూడా ఇండియా మార్కెట్లో విడుదల్ చేసింది.ఈ సౌండ్ బార్ జనవరి 16 నుంచి Mi Home stores,Mi.com లో అందుబాటులో ఉండనుంది.

Mi TV 4X Pro ధర...
55 అంగుళాల Mi TV 4X Pro ధరను కంపెనీ రూ. 39,999గా నిర్ణయించింది.

Mi TV 4X Pro స్పెసిఫికేషన్స్...
55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్, 4కే రెజల్యూషన్ (2160x3840 పిక్సెల్స్) హెచ్‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ 2.4 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ.కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం 20వాట్ స్పీకర్లను ఈ టీవీలో షియోమి నిక్షిప్తం చేసింది.

Mi TV 4A Pro ధర
43 అంగుళాల Mi TV 4A Pro ధరను రూ.22,999 గా నిర్ణయించింది.

Mi TV 4A Pro స్పెసిఫికేషన్స్...
43 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్, 4కే రెజల్యూషన్ (1920x1080 పిక్సెల్స్) హెచ్‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ 2.4 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ.కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం 20వాట్ స్పీకర్లను ఈ టీవీలో షియోమి నిక్షిప్తం చేసింది.

సౌండ్ బార్ ధర...
సౌండ్ బార్ ధరను కంపెనీ రూ. 4,999గా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








