4K QLED డిస్‌ప్లే, గేమ్ బూస్టర్, డాల్బీ విజన్ సపోర్ట్ తో షియోమీ X ప్రో టీవీలు.. ఇండియాలో విడుదల..!
Xiaomi QLED TV X Pro Series: టెక్ ప్రియులకు, కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. షియోమీ (Xiaomi) ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ టీవీ లైనప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. 'QLED టీవీ X ప్రో సిరీస్' (QLED TV X Pro Series) పేరుతో వస్తున్న ఈ టీవీలను ఏప్రిల్ 10న, మధ్యాహ్నం 12 గంటలకు (IST) భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
దీనికి 'సినీమ్యాజిక్ QLED' (CineMagi QLED) అని ముద్దుపేరు కూడా పెట్టారు. అంటే, ఇంట్లోనే థియేటర్‌లో సినిమా చూసిన అనుభూతిని పొందవచ్చని కంపెనీ చెబుతోంది. దర్శకుడు ఎలాగైతే ఊహించుకొని తీశాడో, అచ్చం అలాగే "ప్రతి ఫ్రేమ్‌ను, ప్రతి శబ్దాన్ని" ఆస్వాదించవచ్చని షియోమీ హామీ ఇస్తోంది. ఈ ప్రకటనతో ఇప్పటికే వినియోగదారులలో అంచనాలు క్రియేట్ అయిపోయాయి.

* కళ్లు చెదిరే విజువల్స్, అదిరిపోయే సౌండ్ క్వాలిటీ..
ఈ షియోమీ QLED టీవీ X ప్రో సిరీస్‌లో 4K QLED డిస్‌ప్లేలు ఉంటాయి. దీనివల్ల పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా, రంగులు అత్యంత ప్రకాశవంతంగా, కాంట్రాస్ట్ అద్భుతంగా ఉంటుందని కంపెనీ అంటోంది. ప్రతి ఫ్రేమ్ కళ్లకు కట్టినట్లు, ఎంతో సహజంగా కనిపించేలా వీటిని డిజైన్ చేశారట.
డాల్బీ విజన్ (Dolby Vision), వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 (Vivid Picture Engine 2) సపోర్ట్ ఉండటంతో, లోతైన నలుపు రంగులు (Deeper blacks), ప్రకాశవంతమైన హైలైట్స్ (Brighter highlights) తో మీ వీక్షణ అనుభవం నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంది. అంతేకాదు, ఇందులో శక్తివంతమైన ఆడియో సిస్టమ్ కూడా ఉంది.
డీప్ బాస్ (Deep bass), అడాప్టివ్ సౌండ్ (adaptive sound) ఫీచర్‌తో వస్తోంది. అంటే, మీరు చూసే కంటెంట్‌కు (ఉదాహరణకు, యాక్షన్ సీన్ అయినా, నెమ్మదిగా సాగే డైలాగ్ అయినా) తగ్గట్టుగా ఆడియో ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతుందన్నమాట. దాంతో సినిమా చూసే అనుభూతి మరింత బాగుంటుంది.
* గేమర్స్ కోసం స్పెషల్ 'గేమ్ బూస్టర్ మోడ్'.. లాగ్ లేని స్మూత్ గేమ్‌ప్లే..
ఈ టీవీలలో ప్రత్యేకంగా 'గేమ్ బూస్టర్ మోడ్' (Game Booster Mode) ఫీచర్ ఉంది. ఈ మోడ్ ఆన్ చేస్తే, రీఫ్రెష్ రేట్లు, రెస్పాన్సివ్‌నెస్ మెరుగుపడతాయని, ఎలాంటి లాగ్ (lag) లేకుండా గేమ్‌ప్లే స్మూత్‌గా సాగిపోతుందని షియోమీ ధీమా వ్యక్తం చేస్తోంది. మంచి విజువల్స్, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోరుకునే గేమర్లకు ఈ టీవీలు నచ్చుతాయి.
* స్మార్ట్ ఫీచర్లు బోలెడు.. స్ట్రీమింగ్ సులభం..
ఈ కొత్త X ప్రో సిరీస్ టీవీలు గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు, షియోమీకి మాత్రమే ప్రత్యేకమైన ప్యాచ్‌వాల్ (PatchWall) ఇంటర్‌ఫేస్‌తో వస్తాయని అంచనా. దీనివల్ల మీకు నచ్చిన కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దాంతో సమయం, శ్రమ ఆదా అవుతాయి.
మీ అభిరుచికి తగిన కంటెంట్ సిఫార్సులు (Personalized recommendations), గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్, 'ఓకే గూగుల్' (OK Google) వాయిస్ కమాండ్స్ ద్వారా మీ ఇంట్లోని ఇతర స్మార్ట్ పరికరాలను కంట్రోల్ చేసే సౌలభ్యం కూడా ఉంటుంది. అంటే, మీ వాయిస్‌తోనే టీవీని, ఇతర డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చు, కంటెంట్ వెతకొచ్చు, సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
ఇంకా, ఈ టీవీలలో అపరిమితమైన (Limitless) ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది, ఇది బహుశా 64GB కంటే ఎక్కువే ఉండవచ్చు. దీనివల్ల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, బఫరింగ్ (Buffering) లేదా స్టోరేజ్ సమస్యలు లేకుండా కంటెంట్‌ను ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది.
* ఎక్కడ కొనాలి, ధర ఎంత ఉండొచ్చు..
షియోమీ ఇప్పటికే ఈ QLED టీవీ X ప్రో సిరీస్ టీవీలు mi.com, ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వెబ్సైట్లతో పాటు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ధరల వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, గతంలో విడుదలైన మోడళ్ల ధరలను చూస్తే, 43-అంగుళాల వేరియంట్ సుమారు రూ.34,999 ఉన్నాయి.
55-అంగుళాల వేరియంట్ రూ.49,999, 65-అంగుళాల వేరియంట్ రూ.69,999గా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే X ప్రో సిరీస్ ధరలు కూడా దాదాపు వీటిలాగే ఉండవచ్చని, అయితే పెర్ఫార్మెన్స్, స్టోరేజ్ వంటి వాటిలో మరిన్ని మెరుగుదలలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








