ధర రూ.1199 కే, అద్భుతమైన డిజైన్, ఫీచర్లతో Redmi కొత్త ఇయర్ బడ్స్!
భారత దేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ అయిన షియోమీ నిన్న జరిగిన ఈవెంట్ లో Xiaomi Pad 6 తో పాటుగా సరికొత్త రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ (Redmi Buds 4 Active ) ఇయర్ బడ్స్ ని కూడా ఇండియాలో లాంచ్ చేసింది. వినియోగదారులను ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్‌తో వీటిని లాంచ్ చేసింది. అంతేకాకుండా, ఈ రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ ఆడియోపరికరాలు గా మత్రమే కాకుండా ఫ్యాషన్ కు గుర్తింపుగా మారుతాయని సంస్థ తెలిపింది.
అధికారిక వివరాల ప్రకారం, రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది మరియు ఇది స్టెమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్‌లు గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫంక్షనాలిటీ మరియు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుందని సంస్థ తెలియచేసింది.

రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ ఇయర్ బడ్స్ యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ షియోమీ యొక్క సరికొత్త రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ 12mm బాస్ ప్రో డ్రైవర్‌లను కలిగి ఉంటుంది.ఇంకా, ఈ రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ ఇయర్ బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లతో 30 గంటల వరకు భారీ బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంటుంది. కేవలం, 10 నిమిషాల ఛార్జ్ తో 90 నిమిషాల వరకు వీటిని ఉపయోగించడానికి బ్యాటరీ సరిపోతుంది.
ఇక కనెక్టివిటీ వివరాలు గమనిస్తే, ఈ బడ్స్ ను Google Fast Pair టెక్నాలజీ తో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఇతర పరికరాలతో త్వరగా కనెక్ట్ అయ్యేలా చేయవచ్చు. కస్టమర్‌లు తమ ఇయర్‌బడ్‌లను సులభంగా జత చేయవచ్చు మరియు ఒక-ట్యాప్ సెటప్ చేయవచ్చు. ఇది, బ్లూటూత్ 5.3 మరియు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీ తో, ఎక్కువ రద్దీగా ఉండే పరిసరాలలో కూడా నాణ్యమైన, అద్భుతమైన కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఇంకా, ఈ బడ్స్ యొక్క టచ్ కంట్రోల్‌లతో పాటు, బిజినెస్ గేమర్‌ల కోసం తక్కువ లేటెన్సీ మోడ్‌ను కూడా జోడించింది. దీనితో, వినియోగదారులను కాల్‌లకు సజావుగా కనెక్ట్ చేయడానికి మరియు డిస్‌కనెక్ట్ చేయవచ్చు. అలాగే, కొన్ని లైట్ టచ్ ట్యాప్‌లతో మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని మార్చడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఇంకా అదనపు ఫీచర్లు గమనిస్తే, ఈ ఇయర్‌బడ్‌లు నీరు మరియు చెమట నుంచి రక్షణ కోసం IPX4 గ్రేడ్ రేటింగ్ ను కలిగి ఉంటుంది.
భారతదేశంలో రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ ఇయర్ బడ్స్ యొక్క ధర వివరాలు
కొత్తగా లాంచ్ అయిన ఈ సరికొత్త రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ ఇయర్ బడ్స్, షియోమి ప్యాడ్ 6 టాబ్లెట్ తో పాటుగా సేల్ కు రాబోతున్నాయి. భారతదేశంలో ఇవి బాస్ బ్లాక్ మరియు ఎయిర్ వైట్ రెండు విభిన్న రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది మరియు దీని ధర రూ. 1,199 గా ప్రకటించారు. జూన్ 20 వ తేదీ నుంచి ఇండియాలో లో అమ్మకాలు మొదలు కానున్నాయి.


Click it and Unblock the Notifications