Home
Gadgets

Mi బ్యాండ్ 5 యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!!

షియోమి సంస్థ విడుదల చేసిన వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన డివైస్ లలో Mi బ్యాండ్ 4 గత సంవత్సరం విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇప్పటికి సంస్థ దేశవ్యాప్తంగా లక్షలాది యూనిట్లను విక్రయిస్తున్నది. దీనికి కారణం అది ఆర్ట్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది.

Mi బ్యాండ్ 5

Mi బ్యాండ్ 5

ఇప్పుడు షియోమి దీనికి అప్డేట్ వెర్షన్ అయిన తన Mi బ్యాండ్ 5 ని తయారుచేసింది. దీనిని ఈ సంవత్సరం అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. Mi బ్యాండ్ 5 యొక్క కొన్ని ఫీచర్స్ మరియు ఫోటోలు కొన్ని ఆన్ లైన్ లో లీక్ అయినాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం ఇది 1.2 అంగుళాల డిస్ప్లేతో పాటు గ్లోబల్ వేరియంట్ కోసం NFC మద్దతుతో వస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

 

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఇందులో పెద్ద డిస్ప్లేను చేర్చడంతో ఇది మరింత ఎక్కువ మంది జనాదరణను పొందుతుంది అని భావిస్తున్నారు. షియోమి ఇందులో NFC మద్దతును చేర్చడానికి తీసుకున్న నిర్ణయం కారణంగా ఇది ఇప్పుడు గూగుల్ పే వంటి మరిన్ని పేమెంట్ యాప్ ల ఎంపికలకు కూడా మద్దతు ఇస్తుంది. అంటే మీ ఎక్కడైనా ఏదైనా పెమెంట్స్ చేయడానికి Mi బ్యాండ్ 5 ను ఉపయోగించవచ్చు.

 

 

 Mi బ్యాండ్

ప్రస్తుతానికి Mi బ్యాండ్ 4 లో షియోమి యొక్క Mi పే యొక్క ఏకైక పేమెంట్ యాప్ కు మాత్రమే మద్దతు ఇస్తుంది. అయితే కొత్త టెక్నాలజీతో Mi బ్యాండ్ 5 లాంచ్ అయినప్పుడు ఈ పద్ధతి యొక్క విధానం మారుతుంది. వినియోగదారుల కోసం ముందు Mi బ్యాండ్ 4 మరియు Mi బ్యాండ్ 3 కూడా NFC మద్దతుతో వచ్చాయి. అయినప్పటికీ దీని యొక్క మద్దతు లక్షణాలు కేవలం చైనాలో మాత్రమే ఇవ్వబడ్డాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. చైనాలో Mi పే 4 కి అధికారికంగా Mi బ్యాండ్ 4 మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మరిన్ని పేమెంట్ యాప్ లకు మద్దతును ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా Mi బ్యాండ్ ను మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది.

 

 

ధరల వివరాలు

ధరల వివరాలు

Mi బ్యాండ్ 5 యొక్క ధర చైనాలో 179 యువాన్లను కలిగి ఉంటుంది అని భావిస్తున్నారు. దీనిని జూన్ 2020 లో ప్రారంభించనున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇండియాలో దీని యొక్క ధర Mi బ్యాండ్ 4 యొక్క ధరల వ్యూహానికి దగ్గరగా ఉంటుంది అని భావిస్తున్నారు.

2020లో మరిన్ని షియోమి ఉత్పత్తులు

2020లో మరిన్ని షియోమి ఉత్పత్తులు

2020 లో షియోమి సంస్థ Mi 10 మరియు Mi 10 ప్రోతో సహా పలు ఆసక్తికరమైన స్మార్ట్ ఫోన్‌లను కూడా లాంచ్ చేయనున్నది. ఈ రెండింటిలో Mi 10 మీద అందరికి ఎక్కువ ఆసక్తి ఉన్నది. ఫోన్ వెనుక ప్యానెల్ యొక్క కొన్ని ఫోటోలు ఇప్పటికే ఆన్ లైన్ లో విడుదల చేసారు.

Best Mobiles in India

English summary
Xiaomi’s Mi Band 5 Features,Price Leaked: Check Full Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X