త‌క్కువ ధ‌ర‌లో, బెస్ట్ ఫీచ‌ర్ల‌తో Xiaomi నుంచి స్మార్ట్‌టీవీలు విడుద‌ల‌!

|

Xiaomi కంపెనీ భార‌త మార్కెట్లో క్ర‌మంగా త‌మ ఉత్ప‌త్తుల్ని విస్త‌రిస్తోంది. తాజాగా, ఆ కంపెనీ నుంచి కొత్త మోడ‌ల్ స్మార్ట్‌టీవీ భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Xiaomi Smart TV X సిరీస్ పేరుతో వ‌చ్చిన ఈ మోడ‌ల్‌ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఈ టీవీ ప‌లు అధునాత‌న ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొంది.

Xiaomi Smart TV X Series

ఈ కొత్త Smart TV X డాల్బీ విజన్, డాల్బీ ఆడియో మరియు మెరుగైన ప్యాచ్‌వాల్ UI వంటి సాంకేతికతలను కలిగి ఉన్నట్లు వెల్ల‌డించింది. Xiaomi Smart TV X సిరీస్‌ 43-అంగుళాల, 50-అంగుళాల మరియు 55-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. ఈ మూడు మోడల్‌లు సెప్టెంబర్ 14 నుండి Mi.com, Mi Homes మరియు Flipkartలో అందుబాటులో ఉంటాయ‌ని కంపెనీ పేర్కొంది.

Xiaomi Smart TV X ధ‌ర‌, ల‌భ్య‌త‌:
Xiaomi Smart TV X- 43 అంగుళాల‌ వేరియంట్‌ ధర రూ. 28,999 గా ఉంది. Xiaomi Smart TV X, 50 అంగుళాల వేరియంట్‌ ధర రూ.34,999 గా నిర్ణ‌యించారు. చివరగా, Xiaomi Smart T X, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999 గా నిర్ణ‌యించారు. ఈ మూడు మోడల్‌లు సెప్టెంబర్ 14 నుండి Mi.com, Mi Homes మరియు Flipkartలో అందుబాటులో ఉంటాయ‌ని కంపెనీ పేర్కొంది.

Xiaomi Smart TV X Series

Xiaomi Smart TV X55 స్పెసిఫికేష‌న్లు:
Xiaomi Smart TV X55 వేరియంట్ డాల్బీ విజన్, HDR10 మరియు HLG వంటి సాంకేతికతలకు స‌పోర్టు క‌లిగిన టాప్-టైర్ వేరియంట్. వివిడ్ పిక్చర్ ఇంజిన్ (VPE)ని 94 శాతం DCI-P3 కలర్ గామట్ సపోర్ట్‌తో అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అదనంగా, స్మార్ట్ టీవీ MEMC ఇంజిన్‌కు కూడా మద్దతు ఇస్తుంది. రియాలిటీ ఫ్లో, ఇది వేగవంతమైన కంటెంట్ అనుభూతి కోసం అద్భుత‌మైన ఫ్రేమ్‌లను అందిస్తుంది.

Xiaomi Smart TV X సిరీస్ యొక్క మూడు మోడల్‌లు Smart TV X43, Smart TV X50 మరియు Smart TV X55 మెటల్ ఫ్రేమ్‌తో త‌యారు చేశారు. ఇవి 96.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఆడియో కోసం, ఈ స్మార్ట్ టీవీలు వర్చువల్ X టెక్నాలజీకి స‌పోర్ట్‌తో DTS-HD మరియు DTS ఫీచ‌ర్ క‌లిగి ఉన్నాయి. అంతేకాకుండా, 30-వాట్ స్పీకర్ సెటప్‌తో అమర్చబడి ఉంటాయి. హార్డ్‌వేర్ విషయానికొస్తే, Xiaomi స్మార్ట్ TV X సిరీస్ 2GB RAM మరియు 8GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో 64-బిట్ A55 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్ టీవీలు హోమ్ స్క్రీన్ నుండి నేరుగా YouTube మ్యూజిక్ ప్లేజాబితాలను కనుగొనడానికి కొత్త ఫీచర్‌లతో కస్టమ్ ప్యాచ్‌వాల్ UI ను క‌లిగి ఉంటాయి. Android TV 10 OSలో రన్ అవుతాయి.

Xiaomi Smart TV X Series

Xiaomi Smart TV X సిరీస్‌లోని మూడు వేరియంట్‌లు బ్లూటూత్ 5.0తో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi కి మద్దతు ఇస్తాయి. స్మార్ట్ టీవీలలో మూడు HDMI పోర్ట్‌లు (ఒకటి eARC), రెండు USB-A పోర్ట్‌లు, AV పోర్ట్ మరియు ఇయర్‌ఫోన్ (3.5mm) ఆడియో జాక్ కూడా ఉన్నాయి. క్విక్ మ్యూట్, క్విక్ వేక్ మరియు క్విక్ సెట్టింగ్స్ బటన్‌ల వంటి ఫీచర్‌లతో కూడిన స్మార్ట్ రిమోట్‌తో కంపెనీ ఈ స్మార్ట్ టీవీలను షిప్పింగ్ చేస్తోంది. ఈ మూడు మోడల్‌లు సెప్టెంబర్ 14 నుండి Mi.com, Mi Homes మరియు Flipkartలో అందుబాటులో ఉంటాయ‌ని కంపెనీ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Xiaomi Smart TV X Series India Launch: 4K Resolution, Dolby Atmos And More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X