65 గంటల బ్యాటరీ లైఫ్‌తో షియోమీ వాచ్ 2.. అసాధారణ పరిస్థితుల్లోనూ కచ్చితమైన లోకేషన్ గుర్తింపు దీని ప్రత్యేకత..
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ( MWC 2024) షియోమీ వాచ్ 2 మరియు వాచ్ S3 లను విడుదల చేసింది. ఈ షియోమీ వాచ్ 2 Wear OS సహా క్వాల్‌కాం చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ వాచ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన వృత్తాకార డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు (Xiaomi Watch 2) ఈ వాచ్ కీలక ఫీచర్లను కలిగి ఉంది.
అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనూ.. : యూజర్లు తమ కచ్చితమైన లోకేషన్‌ను గుర్తించే విధంగా ఈ వాచ్ డ్యూయల్ బాండ్ L1+L5 GNSS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మంచు ఉన్న ప్రాంతాల వంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో లోకేషన్‌ను గుర్తిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ వాచ్ అప్‌గ్రేడ్ చేయబడిన 12 ఛానల్ హార్ట్ రేట్ మానిటరింగ్ మాడ్యూల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

2GB ర్యామ్, 32GB అంతర్గత స్టోరేజీ : షియోమీ వాచ్ 2.. 1.43 అంగుళాల వృత్తాకర అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 466*466 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే టచ్‌స్క్రీన్‌గా వస్తుంది. మరియు 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ 2GB ర్యామ్ మరియు 32GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది.
షియోమీ వాచ్ 2 స్మార్ట్ వాచ్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ W5+ జెన్ 1 చిప్‌సెట్ మరియు గూగుల్ ఆధారిత WearOS పైన పనిచేస్తుంది. ఈ వాచ్ ఆప్టికల్ హార్చ్‌రేట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు నిద్ర నాణ్యత, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి సహా ఇతర ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకర్లను కలిగి ఉంటుంది.
65 గంటలపాటు బ్యాటరీ లైఫ్.. : షియోమీ వాచ్ 2 స్మార్ట్ వాచ్ 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌వాచ్ వాటర్ రిసిస్టెంట్‌గా వస్తుంది. ఈ షియోమీ వాచ్ 495mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 65 గంటలపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది.
భారత కరెన్సీ ప్రకారం రూ.17,870 ధర? : షియోమీ వాచ్ 2 ధర ప్రస్తుతం 199 euros (భారత కరెన్సీ ప్రకారం రూ.17,870 ) గా ఉంది. ఈ వాచ్‌ను బ్లాక్ మరియు సిల్వర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పిక్సల్ వాచ్ 2 కి పోటీనిచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇతర బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌లకు పోటీగా భావించవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications