Home
Gadgets

షియోమీ నుంచి స్మార్ట్‌వాచ్‌, స్మార్ట్ బ్యాండ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్‌, హెల్త్‌ ట్రాకర్‌లు సహా కీలక ఫీచర్‌లు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ షియోమీ తాజాగా షియోమీ 15 సిరీస్‌తోపాటు స్మార్ట్‌వాచ్‌, స్మార్ట్‌ బ్యాండ్‌ ను విడుదల చేసింది. షియోమీ వాచ్‌ S4 మరియు స్మార్ట్ బ్యాండ్‌ 9 ప్రో పేరుతో లాంచ్‌ అయ్యాయి. ఈ షియోమీ స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు వృత్తాకర డిజైన్‌తో విడుదల అయింది. ఈ వాచ్ S4 eSIM వేరియంట్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌, స్మార్ట్‌బ్యాండ్‌ హార్ట్‌ రేట్‌, స్లీప్‌ మానిటర్‌, SpO2 వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.

షియోమీ వాచ్‌ S4 స్పెసిఫికేషన్‌లు :
ఈ వాచ్‌ (Xiaomi watch S4) 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 1.43 అంగుళాల వృత్తాకార అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 466*466 పిక్సల్స్ రిజల్యూషన్‌, 1500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ Snip గెశ్చర్‌ను సపోర్టు చేస్తుంది.

Xiaomi watch S4 and smart band 9 pro launched

షియోమీ స్మార్ట్‌వాచ్‌ HyperOS 2 (Out of the box) తో పనిచేస్తుంది. ఈ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. హార్ట్‌ రేట్‌, బ్లడ్‌ ఆక్సిజన్ లెవల్‌, ఒత్తిడి స్థాయి, నిద్ర నాణ్యత, రుతుక్రమాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇంటర్‌ చేంజబుల్‌ బెజిల్‌ మరియు క్లిక్‌ ఆప్షన్‌తో కూడిన రొటేటింగ్‌ క్రోన్‌ ను కలిగి ఉంది. వాచ్ S4.. 5 ATM వాటర్‌ రెసిస్టెన్స్‌తో విడుదల అయింది.

ఈ వాచ్‌ 4,86mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో బ్లూటూత్‌ వేరియంట్‌ 15 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అదే eSIM వేరియంట్ 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌ 5.2, వైఫై, GPS, NFC, QZSS, Galileo, Glanass, Beidou వంటి ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

షియోమీ స్మార్ట్‌ బ్యాండ్‌ 9 ప్రో స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ (Xiaomi Smart Band 9 Pro) 1.74 అంగుళాల 2.5D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 336*480 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 2000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ బ్యాండ్ బరువు 24.5 గ్రాములుగా ఉంది.

ఈ స్మార్ట్ బ్యాండ్‌ 350mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 21 రోజులపాటు వినియోగించుకోవచ్చు. అయితే Always On Display ఫీచర్‌ ON చేసి ఉపయోగిస్తే, సింగిల్‌ ఛార్జింగ్తో 10 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ బ్యాండ్ S4 స్మార్ట్‌వాచ్ తరహా హెల్త్‌ ట్రాక్‌లను కలిగి ఉంది.

మరియు HyperOS 2 (Out of the box) తో పనిచేస్తుంది. మరియు 5 ATM రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ వాచ్ బ్లూటూత్‌ 5.4, GNSS, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ మరియు S4 వాచ్‌ కేవలం చైనాలో మాత్రమే లాంచ్‌ అయ్యాయి. భారత్‌ మార్కెట్‌లో ఈ గ్యాడ్జెట్‌ల విడుదలపై స్పష్టత లేదు.

షియోమీ వాచ్‌ S4 ప్రారంభ ధర CNY 999 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.11,800) గా ఉంది. బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లోని ప్లోరిన్‌ రబ్బర్‌ స్ట్రాప్‌ వాచ్‌లను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే eSIM, లెదర్‌ స్ట్రాప్‌తో కూడిన బ్లాక్ రెయిన్‌బో స్ట్రాప్‌ వేరియంట్‌ను CNY 1199 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.14,100) గా ఉంది.

షియోమీ బ్యాండ్‌ 9 ప్రో ప్రారంభ ధర CNY 399 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.4700) గా ఉంది. TPU బ్యాండ్‌ వేరియంట్‌ను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే లెదర్‌ స్ట్రాప్‌ వేరియంట్‌ను CNY 449 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.5,300) గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi watch S4 and smart band 9 pro launched in china here are the specs features and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X