12 గంటల ప్లేబ్యాక్ టైం, వాటర్ ప్రూఫ్ డిజైన్‌తో షియోమీ సౌండ్ స్పీకర్లు.. పూర్తి వివరాలు.!
షియోమీ సంస్థ తాజాగా రెండు బ్లూటూత్ స్పీకర్లను (Xiaomi Bluetooth Speakers) లాంచ్ చేసింది. షియోమీ సౌండ్ పోకెట్ మరియు షియోమీ సౌండ్ అవుట్‌డోర్ పేరుతో వీటిని విడుదల చేసింది. గ్లోబెట్ మార్కెట్‌లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ షియోమీ బ్లూటూత్ స్పీకర్లు మెరుగైన డిజైన్ సహా వాటప్ ఫ్రూప్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
షియోమీ అవుట్‌డోర్ స్పీకర్ స్పెసిఫికేషన్లు : షియోమీ అవుట్‌డోర్ స్పీకర్లను మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. మరియు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా రూపొందించారు. అయితే చిన్న సైజ్‌లోనే తయారుచేసినా మెరుగైన సౌండ్‌ను అందిస్తాయని సంస్థ చెబుతోంది. బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్, రేడియేటర్, ట్విటర్‌తో 30W అవుట్‌పుట్‌ను అందించనుంది.

ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొనేలా రూపొందించారు. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయింది. దీంతోపాటు 5.4 బ్లూటూత్ సహా 2600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 50 శాతం వాల్యూమ్‌తో 12 గంటలపాటు ప్లేబ్యాక్ టైం ఇస్తుందని సంస్థ చెబుతోంది. స్టీరియో సౌండ్ కోసం ఈ స్పీకర్లను మరో స్పీకర్‌తోనూ కనెక్ట్ చేయవచ్చు. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో లభిస్తుంది.
షియోమీ సౌండ్ పోకెట్ స్పెసిఫికేషన్లు : ఈ స్పీకర్ చిన్న సైజ్‌లోనే అంటుంది. మరియు బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. 5W అవుట్‌పుట్‌ను అందిస్తుంది. IP67 వాటర్ రెసిస్టెంట్‌గా వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌లో 40 శాతం వాల్యూమ్‌తో 10 గంటలపాటు ప్లేబ్యాక్ టైంను కలిగి ఉంటుంది. ఈ రెండు షియోమీ స్పీకర్ల ధర, సేల్ తేదీని సంస్థ వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

గత నెలలో షియోమి సంస్థ నుంచి భారత్ మార్కెట్‌లోకి తొలిసారిగా షియోమీ ప్రీమియం హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది. షియోమీ 14 సిరీస్‌లో భాగంగా విడుదలైన అల్ట్రా మోడల్ ఏప్రిల్ 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి వివరాలు.
షియోమీ 14 అల్ట్రా స్పెసిఫికేషన్లు : షియోమీ 14 అల్ట్రా 6.73 అంగుళాల LTPO అమోలెడ్ మైక్రో కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3200*1440 పిక్సల్ సహా 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది.
అల్ట్రా మోడల్ అక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు గరిష్ఠంగా 1TB UFS 4.0 ఇన్ బిల్ట్ స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆథారిత HyperOS పైన పనిచేస్తుంది.
ఈ షియోమీ 14 అల్ట్రా మోడల్ వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్‌తో వచ్చింది. వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT900 ప్రైమరీ కెమెరా, 3.2x ఆప్టికల్ జూమ్ మరియు 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 కెమెరాలను కలిగి ఉంది. మరియు 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.


Click it and Unblock the Notifications








