Yamaha నుంచి కొత్త‌ వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్.. ఆక‌ర్షిస్తున్న ఆ రెండు మోడ‌ల్స్‌!

|

ప్ర‌ముఖ మ్యూజిక‌ల్ ఇన్‌స్ట్రుమెంట్స్ త‌యారీ సంస్థ Yamaha కార్పొరేష‌న్ తాజాగా మ‌రో రెండు కొత్త ఉత్ప‌త్తుల‌ను భార‌త మార్కెట్లోకి విడుద‌ల చేసింది. స‌రికొత్త వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ (TWS)రెండు మోడ‌ళ్ల‌ను భార‌త మార్కెట్లో బుధ‌వారం విడుద‌ల చేసింది. ట్రూ సౌండ్ అనే సిద్ధాంతం ఆధారంగా ఈ కొత్త ఇయ‌ర్ బ‌డ్స్‌ను త‌యారు చేసినట్లు య‌మ‌హా కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. చెవి అలసటను తగ్గించడానికి, కొత్తగా విడుద‌ల చేసిన ఇయర్‌బడ్‌లు వాల్యూమ్‌కు అనుగుణంగా సౌండ్ బ్యాలెన్స్‌ను సరిచేస్తాయని కంపెనీ తెలిపింది.

Yamaha TWS ఇయ‌ర్‌బ‌డ్స్ ధ‌ర‌..

Yamaha TWS ఇయ‌ర్‌బ‌డ్స్ ధ‌ర‌..

య‌మ‌హా సంస్థ విడుద‌ల చేసి TW-E3B TWS ఇయ‌ర్ బ‌డ్స్ ప్రారంభ ధ‌ర‌ను రూ.8,490గా నిర్ణ‌యించింది. అదేవిధంగా య‌మ‌హా TW-E5B మోడ‌ల్ ధ‌ర‌ను రూ.14,200 గా నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతానికి అయితే ఇండియాలో ఈ ఇయ‌ర్‌బ‌డ్స్‌ ల‌భ్య‌త గురించి ఎలాంటి స‌మాచారం లేదు.

Yamaha TW-E5B TWS ఇయ‌ర్‌బ‌డ్స్ స్పెసిఫికేష‌న్స్ మ‌రియు ఫీచ‌ర్స్‌..

Yamaha TW-E5B TWS ఇయ‌ర్‌బ‌డ్స్ స్పెసిఫికేష‌న్స్ మ‌రియు ఫీచ‌ర్స్‌..

Yamaha TW-E5B TWS ఇయ‌ర్‌బ‌డ్స్ 20Hz to 20kHz ఫ్రీక్వెన్సీతో 7ఎంఎం డైనామిక్ డ్రైవ‌ర్స్ కలిగి ఉన్నాయి. డ‌స్ట్, వాట‌ర్ రెసిస్టెన్స్ అందించ‌డానికి దీనికి IPX5 టెక్నాల‌జీ కోటింగ్‌ అందించారు. బ్లూటూత్ వ‌ర్శ‌న్ 5.2 ని ఇది క‌లిగి ఉంది. ఈ రెండు ఇయ‌ర్‌బ‌డ్స్‌లో క్వాల్‌కామ్ CVC (Clear Voice Capture), and Qualcomm aptX టెక్నాల‌జీ యూజ్ చేశారు. అంతేకాకుండా యూజ‌ర్లు త‌మ చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతుందో తెలుసుకునేలా స్మార్ట్ యాంబియంట్ సౌండ్ మోడ్ క‌లిగిఉంది. గేమింగ్ ఆస‌క్తి ఉన్న యూజ‌ర్ల‌కు మంచి అఉభూతిని ఇచ్చే గేమింగ్ మోడ్ సౌక‌ర్యం ఉంది. సౌండ్‌కి వీడియోకి మ‌ధ్య ఉన్న అంత‌రాయాల‌ను ఇది త‌గ్గిస్తుంది.

Yamaha TW-E5B TWS ఇయ‌ర్‌బ‌డ్స్ బ్యాట‌రీ

Yamaha TW-E5B TWS ఇయ‌ర్‌బ‌డ్స్ బ్యాట‌రీ

ఇక బ్యాట‌రీ విష‌యానికి వ‌స్తే TW-E5B మోడ‌ల్ ఇయ‌ర్ బ‌డ్స్ మొత్తం సెట‌ప్‌కు(case 2.5hours + buds 1.5 hours) ఛార్జింగ్ పెడితే.. మ‌నం 30 గంట‌ల కంటిన్యూగా ప్లేబ్యాక్ అనుభూతి పొంద‌వ‌చ్చు. ఇంకా అద‌నంగా ఫోన్‌కాల్స్ మాట్ల‌డ‌టానికి, మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు, సిరిజ‌గూగుల్ అసిస్టంట్ యాక్టివేష‌న్‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఇయ‌ర్ బ‌డ్స్ బ్లూ మ‌రియు బ్లాక్ వేరియంట్ల‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక TW-E3B మోడ‌ల్ ఇయ‌ర్ బ‌డ్స్ బ్యాట‌రీ విష‌యానికి వ‌స్తే రెండు గంట‌ల్లో ఫుల్ ఛార్జ్ చేసి 24 గంట‌ల కంటిన్యూగా ప్లేబ్యాక్ అనుభూతి పొంద‌వ‌చ్చు. ఈ ఇయ‌ర్ బ‌డ్స్, పింక్‌, ప‌ర్పుల్‌ బ్లూ మ‌రియు బ్లాక్ వేరియంట్ల‌లో అందుబాటులో ఉన్నాయి.

య‌మ‌హా TW-E3B TWS మోడ‌ల్ ఇయ‌ర్ బ‌డ్స్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచ‌ర్లు..

య‌మ‌హా TW-E3B TWS మోడ‌ల్ ఇయ‌ర్ బ‌డ్స్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచ‌ర్లు..

య‌మ‌హా TW-E5B TWS ఇయ‌ర్‌బ‌డ్స్ 20Hz to 20kHz ఫ్రీక్వెన్సీతో 6ఎంఎం డైనామిక్ డ్రైవ‌ర్స్ కలిగి ఉన్నాయి. డ‌స్ట్, వాట‌ర్ రెసిస్టెన్స్ అందించ‌డానికి దీనికి IPX5 టెక్నాల‌జీ కోటింగ్‌ అందించారు. బ్లూటూత్ ర్శ‌న్ 5.2 ని ఇది క‌లిగి ఉంది. ఈ రెండు ఇయ‌ర్‌బ‌డ్స్‌లో క్వాల్‌కామ్ CVC (Clear Voice Capture), and Qualcomm aptX టెక్నాల‌జీ యూజ్ చేశారు. అంతేకాకుండా యూజ‌ర్లు త‌మ చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతుందో తెలుసుకునేలా స్మార్ట్ యాంబియంట్ సౌండ్ మోడ్ క‌లిగిఉంది.

వినికిడి స‌మ‌స్య‌ల‌పై య‌మ‌హా సూచ‌న‌లు ..

వినికిడి స‌మ‌స్య‌ల‌పై య‌మ‌హా సూచ‌న‌లు ..

ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని అధిక మోతాదు సౌండ్స్ విన‌డం ద్వారా చెవుల వినికిడి శ‌క్తి దెబ్బ‌తినే అవ‌కాశం ఉండొచ్చు. కాబ‌ట్టి దీనిపై య‌మ‌హా కొన్ని సూచ‌న‌లు చేసింది. య‌మ‌హా ఇండియా మార్కెటింగ్ మేనేజ‌ర్ కీగ‌న్ పేస్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మ్యూజిక్ బ్రాండ్‌లో మేము ప్ర‌పంచంలోనే లీడ్ స్థానంలో ఉన్నాం. చాలా మంది క‌ళాకారుల‌తో య‌మ‌హా జ‌రిపిన సంప్ర‌దిపుల ప్ర‌కారం వినికిడి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుసుకున్నాం. అధిక మోతాదు శ‌బ్దాల వ‌ల్ల ప్ర‌పంచ‌లంలో దాదాపు 1.1 బిలియ‌న్ జ‌నాలు, దాదాపు ప్ర‌పంచంలోని స‌గం యువ‌త 12-35 మ‌ధ్య వ‌య‌స్కులు వినికిడి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ని 2019లో డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో సంగీత సంస్కృతి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యమహా ఈ సమస్యకు పరిష్కారంతో ముందుకు రావడం చాలా ముఖ్యమైనది. అన్ని Yamaha హెడ్‌ఫోన్‌లలో, ప్రజలు ఎక్కువ వాల్యూమ్‌ను పెంచకుండా నిరోధించడానికి మరియు మీ వినికిడిపై శ్రద్ధ వహించడానికి మేము లిజనింగ్ కేర్ టెక్నాల‌జీని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా మీరు రాబోయే చాలా సంవత్సరాల వరకు ఆందోళన లేకుండా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. అని ఆయ‌న వెల్ల‌డించారు.

Best Mobiles in India

English summary
Yamaha launches two new ear buds in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X