జిబ్రానిక్స్ నుంచి 6 ఇన్ 1 వన్ పవర్ చార్జర్ 'esteem'

|

భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న జిబ్రానిక్స్, 'ఇస్టీమ్’ (esteem) పేరుతో సరికొత్త 6 ఇన్ 1 పవర్ చార్జర్‌‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. వైర్‌లెస్ ఆడియో సపోర్ట్, స్పీకర్, ఎల్ఈడి టార్చ్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోఎస్డీ సపోర్ట్ ప్లేయర్, పవర్ బ్యాంక్ ఇలా ఆరు విధాలుగా ఈ ప్రొడక్ట్‌ను ఉపయోగించుకునే వీలుంటుంది. ధర రూ.1300. అన్ని ప్రముఖ స్టోర్‌లలో ఈ డివైస్ లభ్యమవుతుంది. ఈ మల్టీ-పర్పస్ గాడ్జెట్ మీ చేతిలో ఉన్నట్లయితే ట్రావెలింగ్ సమయంలో అన్ని రకాల అసవరాలను ఒకే చోట తీర్చుకునే వీలుంటుంది.

 
జిబ్రానిక్స్ నుంచి 6 ఇన్ 1 వన్ పవర్ చార్జర్ 'esteem'

6 ఇన్ 1 ప్రొడక్ట్..

బైస్కిల్ మౌంట్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ మల్టీ-పర్పస్ ప్రొడక్ట్‌ను రైడర్స్ తమ సైకిల్స్‌కు ఫిట్ చేసుకుని 'ఆన్‌ ద‌ గో’ అవసరాలను తీర్చుకోవచ్చు. పవర్ చార్జర్, బ్లుటూత్ స్పీకర్, ఎల్ఈడి టార్చ్, ఎఫ్ఎమ్, మైక్రోఎస్డీ ప్లేయర్, పవర్ బ్యాంక్ ఇలా ఆరు అవసరాలను తీర్చుకోవచ్చు.
జిబ్రానిక్స్ నుంచి 6 ఇన్ 1 వన్ పవర్ చార్జర్ 'esteem'

2000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్..
ఈ '6 ఇన్ 1’ పవర్ చార్జర్ 2000ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ పవర్ బ్యాంక్‌ను పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే ప్రయాణాల్లో చార్జింగ్ అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ పవర్ చార్జర్ మీ దగ్గర ఉంటే ఫోన్ స్విచాఫ్ అవుతుందన్న చింతే ఉండదు. బ్లుటూత్ కనెక్టువిటీతో మ్యూజిక్‌ను కూడా ఆస్వాదించవచ్చు.
జిబ్రానిక్స్ నుంచి 6 ఇన్ 1 వన్ పవర్ చార్జర్ 'esteem'

డిజైనింగ్..
డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఈ 6 ఇన్ 1 వన్ పవర్ చార్జర్ మూడు ప్రత్యేకమైన బటన్లను కలిగి ఉంటుంది. వీటి ద్వారా బ్లటూత్, ఎల్ఈడి టార్చ్, వాయిస్ ఇంకా కాల్ కంట్రోలింగ్ ఫీచర్లను హ్యాండిల్ చేసుకునే వీలుంటుంది.
జిబ్రానిక్స్ నుంచి 6 ఇన్ 1 వన్ పవర్ చార్జర్ 'esteem'

తక్కువ బరువు, ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు..
ఇస్టీమ్ 6 ఇన్ 1 పవర్ చార్జర్ తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి సులువుగా క్యారీ చేసుకోవచ్చు. ఆన్ ద గో మల్టీ టాస్కింగ్‌కు ఈ డవైస్ పర్‌ఫెక్ట్ ఛాయిస్.
Best Mobiles in India

English summary
Zebronics has launched a six in one external power charger dubbed Esteem. The company has designed a multi-functional device that comes with inbuilt wireless audio support, speaker, an LED torch, FM radio, micro SD and a power bank.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X