Home
Gadgets

ఈ పండగ సీజన్ కోసం లాంతర్ వైర్ లెస్ స్పీకర్ “ఆటమ్” లాంఛ్ చేసిన జీబ్రానిక్స్

ఫ్లేమ్ లైట్ స్పీకర్ తో పండగ వేడుకలను మరింత శోభాయమానం చేసుకోండి. పండగ అంటే అందరూ కలుసుకోవం, విందులు, వినోదాలు, అనుబంధాలు, సరదా సంభాషణలు.

ఫ్లేమ్ లైట్ స్పీకర్ తో పండగ వేడుకలను మరింత శోభాయమానం చేసుకోండి.

పండగ అంటే అందరూ కలుసుకోవం, విందులు, వినోదాలు, అనుబంధాలు, సరదా సంభాషణలు. మీ కుటుంబ కలయికకు కొంచెం సంగీతం, మరికొన్ని వెలుగులు నింపి అద్భుతమైన వేదికను రూపొందించుకోండి.

atom

ఐటీ ఫెరిఫెరల్స్, సౌండ్ సిస్టమ్, మొబైల్/లైఫ్ స్టైల్ యాక్సెసరీలు, సర్వైలెన్స్ ప్రొడక్ట్స్ లో భారత్ లో ప్రముఖ బ్రాండైన జీబ్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 60 LED లైట్లతో కూడిన పోర్టబుల్ స్పీకర్ లాంఛ్ చేసింది. ఇది జ్యోతి మాదిరి వెలుగుతూ మీ వేడుకలను మరింత ఆహ్లాదంగా మార్చుతుంది.

వేడుకల్లో సంగీతం మరింత సరదా తెస్తుంది, దానికి కొంత కాంతి అద్దితే అ సమ్మేళనం ఆ సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది. పండగ వేడుకల్లో వైర్ లెస్ స్పీకర్ మధ్యలో పెట్టుకొని సరదాగా విందు భోజనం ఆరిగించండి లేదా ఇంట్లో జరిగే వేడుకల్లో మీ నచ్చిన పాటలు ప్లే చేస్తూ వెలుగులు నింపండి, పండగ వేడుకలకు తగినది "అటమ్". క్యాండిల్ వెలుగులు విరజిమ్ముతూ ప్రశాంత వాతావరణ అనుభూతిని కలిగించేలా డిజైన్ చేసిన అటమ్ స్పీకర్ అందరికి ప్రశాంతత చేకూర్చుతుంది. మీకు నచ్చిన పాటలు ప్లే చేస్తూ మీ ఇంటి రూపును, అనుభూతిని మార్చేయండి.

సాధారణంగా కనిపించినా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఆటమ్ డిజైన్ మొత్తంగా చూస్తే వంపు తిరిగిన ఆకారంతో దీపంలా కనిపిస్తుంది. దీనిలో ఉన్న 60 LED లు ఫ్లోరెసెంట్ ఆరెంజ్ కాంతిని విరజిమ్ముతూ క్యాండిల్ వెలుగును తలపింపజేస్తాయి. సౌండ్ విషయానికొస్తే అద్భుతమైన నాణ్యతతో కూడిన ఔట్ పుట్ ఇస్తుంది. వినోదం విషయంలో మీరు ప్రశాంతంగా ఉండవచ్చు.

atom

వైర్ లెస్ స్పీకర్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూజిక్ స్ట్రీమ్ చేసుకునేందుకు మీరు BT ఉపయోగించుకోవచ్చు లేదా మీకు నచ్చిన ట్రాక్స్ ప్లే చేసుకునేందుకు మైక్రో SD కార్డు ఆప్షన్ ఎంచుకోవచ్చు. మధ్యలో ఉన్న బటన్స్ తో మీరు ట్రాక్ మార్చుకోవచ్చు, వ్యాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇన్ బిల్ట్ రీఛార్జబుల్ బ్యాటరీస్ కలిగిన ల్యాంప్ వెలిగించేందుకు ప్రత్యేంగా బటన్ ఉంది.

కొత్త ఉత్పత్తి ప్రవేశపెట్టిన సందర్భంగా జీబ్రానిక్స్ డైరెక్టర్ ప్రదీప్ జోషి మాట్లాడుతూ, " అద్భుతమైన 2 ఇన్ వన్ స్పీకర్ అండ్ ల్యాంప్ అటమ్ ను ప్రవేశపెట్టి మేము పండగ సీజన్ కు సిద్ధమయ్యాయి. పండగలు, వేడుకలు ఇది కొత్త శోభ తెస్తుంది. క్యాండిల్ వెలుగు వంటి ఎఫెక్ట్ తో పాటు వైర్ లైస్ స్పీకర్ కలిగిన బహుమతిగా ఇచ్చేందుకు చక్కని కానుక కూడా" అన్నారు.

బ్లాక్ కలర్ లో ఉన్న ఈ వైర్ లైస్ పోర్టబుల్ స్పీకర్ భారతదేశంలోని అన్ని ప్రముఖ రిటెయిల్ దుకాణాల్లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Zebronics 'Atom' speaker.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X