జెబ్రోనిక్స్ నుంచి సరికొత్త మల్టీమీడియా స్పీకర్
ఆడియో ఫైల్స్‌కు నచ్చే విధంగా డిజైన్ చేయబడిన ఈ స్పీకర్లు లివింగ్ రూమ్‌లో థియేటర్ తరహా వాతావరణాన్ని సృష్టిస్తాయని జెబ్రోనిక్స్ డైరెక్టర్ ప్రదీప్ దోషి పేర్కొన్నారు.
ప్రముఖ ఐటీ ఉపకరణాల తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ (ZEBRONICS), సరికొత్త మల్టీమీడియా స్పీకర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ZEB-BT361RUCF మోడల్‌లో విడుదలైన ఈ 2.2 ఛానర్ స్పీకర్ ధర రూ.4,242. బ్లుటూత్ కనెక్టువిటీ,
డ్యుయల్ డ్రైవర్ సబ్ ఊఫర్ వంటి ఆధునిక ఫీచర్లను జెబ్రోనిక్స్ ఈ స్పీకర్లలో నిక్షిప్తం చేసింది. బ్లుటూత్, యూఎస్బీ పోర్ట్, ఎస్‌డీ సపోర్ట్ వంటి కనక్టువిటీ ఫీచర్లతో పాటు ఎఫ్ఎమ్ ట్యూనర్‌ను కూడా ఈ స్పీకర్‌లో చూడొచ్చు.

ఆడియో ఫైల్స్‌కు నచ్చే విధంగా డిజైన్ చేయబడిన ఈ స్పీకర్లు లివింగ్ రూమ్‌లో థియేటర్ తరహా వాతావరణాన్ని సృష్టిస్తాయని జెబ్రోనిక్స్ డైరెక్టర్ ప్రదీప్ దోషి పేర్కొన్నారు. ఈ స్పీకర్‌లో ఎంబెడ్ చేసిన సబ్ ఊఫర్ 24 వాట్ల సౌండ్ అవుట్ పుట్‌ను విడుదల
చేయగలదని కంపెనీ చెబుతోంది. ఇదే సమయంలో స్పీకర్‌లోని బ్రాస్, ట్రెబెల్ వంటి విభాగాలు హైక్వాలిటీ పనితీరును కనబరుస్తాయని కంపెనీ తెలిపింది.

రిమోట్ కంట్రోల్ సిస్టంతో వస్తోన్న ఈ మల్టీ మీడియా స్పీకర్‌లో కంట్రోల్స్‌తో ప్యానల్స్‌తో ఉన్న ఎల్ఈడి డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో వాల్యుమ్, బ్రాస్, ట్రెబెల్ వంటి కంట్రోల్స్‌కు సంబంధించిన బటన్లు సబ్ ఊఫర్‌లో ఉంటాయి. ఈ స్పీకర్‌ను ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు జెబ్రోనిక్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








