సరికొత్తగా Prism వైర్‌లెస్ స్పీకర్, లైటింగ్ అదనపు ఆకర్షణ

దేశీయ తయారీ దిగ్గజం జీబ్రానిక్స్ ఇండియా మార్కెట్లో సరికొత్త గాడ్జెట్ ని పరిచయం చేసింది.

|

దేశీయ తయారీ దిగ్గజం జీబ్రానిక్స్ ఇండియా మార్కెట్లో సరికొత్త గాడ్జెట్ ని పరిచయం చేసింది. ప్రిజం పేరుతో వైర్లెస్ స్పీకర్స్ ను విడుదల చేసింది. అతి చిన్నగా, క్రిస్ప్ అండ్ క్లియర్ డిజైన్ మరియు టచ్ కంట్రోల్ తో ఒక లైట్ ఆకారంలో స్మూత్ ఫినిష్ తో అందంగా ఈ స్పీకర్స్ ని తీర్చి దిద్దారు. ఇది ఆర్ జి బి ఎల్ఈడి లైట్ డ్యూయల్ మోడ్స్ లో పనిచేస్తుంది. దీనికి ఉన్న సాఫ్ట్ ఆర్ జి బి లైట్స్ వెలుతురులో హై ఫిడిలిటీ సౌండ్ తో ల్యాంప్ ను పోలిన ఈ స్పెకర్ ను చాలా సులభంగా హ్యాండిల్ చెయ్య వచ్చు. దీని ధరను కంపెనీ రూ.2499గా నిర్ణయించింది. ఐటి పరికరాలు, సౌండ్ సిస్టమ్స్, మొబైల్ / లైఫ్ స్టైల్ అక్సెసరీస్ సర్వైవలేన్స్ వంటి ఉత్పత్తులను ఈ కంపెనీ తయారు చేస్తోంది.

సెల్ఫీలే దిగడమే కాదు, ఈ సీక్రెట్ కోడ్‌లు కూడా ప్రయత్నించండిసెల్ఫీలే దిగడమే కాదు, ఈ సీక్రెట్ కోడ్‌లు కూడా ప్రయత్నించండి

 లైటింగ్ ని కంట్రోల్ చేసుకునే అవకాశం

లైటింగ్ ని కంట్రోల్ చేసుకునే అవకాశం

ఈ స్పీకర్ లైటింగ్ ని కంట్రోల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రిజం వైర్లెస్ స్పీకర్ లో ఉన్న సాఫ్ట్ ఎల్ఈడి లైట్ల కాంతి మిమ్మల్ని చాలా కూల్ గా ఉంచుతుంది.వీటిని మ్యాన్యువల్ గా ఆపరేట్ చేయవచ్చు. ఆటోమేటిక్ మోడ్ లో సెట్ చేసి ఆ కాంతిని చూస్తూ పాటలను ఎంజాయ్ చేయవచ్చు.

అంతర్గతంగా ఎఫ్ఏం రేడియో

అంతర్గతంగా ఎఫ్ఏం రేడియో

ఇంకో ఫీచర్ ఏంటంటే ఇందులో లైట్లను కంట్రోల్ చెయ్యాలన్నా, పాటలు వింటూ దాని వాల్యూ పెంచడం లేదా తగ్గించడం చెయ్యాలన్నా కేవలం మీ చేతి వేళ్ల ద్వారానే చేయవచ్చు. రేడియో సంగీతం వినాలనుకునే వారికి అంతర్గతంగా ఎఫ్ఏం రేడియో ఉంది.

మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్
 

మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్

మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అలాగే వైర్లెస్ ఆప్షన్ తో రావడం వల్ల టలను ఫోన్ ద్వారా కూడా వినే అవకాశం ఉంది. మైక్రో ఎస్ డి కార్డ్ లేదా ప్లగ్ ఇన్ ఏయుఎక్స్ కేబుల్ ను ఉపయోగించి మీకు ఇష్టమైన ప్లే లిస్టు వినవచ్చు. ఈ స్పీకర్ ఇండియాలో అన్ని ప్రముఖ షాపుల్లో లభిస్తుంది.

 ఓ హ్యాండిల్ ఉండటం వల్ల..

ఓ హ్యాండిల్ ఉండటం వల్ల..

స్పీకర్ల లాంచింగ్ సంధర్భంగా జీబ్రానిక్స్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ దోషి మాట్లాడుతూ పోర్టబుల్ స్పీకర్స్ ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొంది ఉన్నాయని, అయినా కష్టమర్స్ కు మరింత వినూత్న అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో క్యాప్టివ్ టచ్, ఆర్ జి బి లైట్స్ వంటి కొత్త ఫీచర్స్ తో కూడిన ఈ ప్రిజం స్పీకర్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పైగా దీనికి ఓ హ్యాండిల్ ఉండటం వల్ల ఎక్కడికైనా పట్టుకు వెళ్ళి మీరు సంగీతాన్నివినవచ్చని తెలిపారు.

Best Mobiles in India

English summary
Zebronics launches wireless speaker ‘Prism’ with RGB factor and capacitive touch control More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X