Home
Gadgets

ప్రొజెక్టర్‌ పై భారీ డిస్కౌంట్‌.. 150 అంగుళాల ప్రొజెక్షన్ సపోర్టు, 3400 లుమెన్స్‌ బ్రైట్‌నెస్‌ సహా..!

Zebronics Pixaplay 22 Projector : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్‌ డే సేల్‌ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ సేల్‌కు సంబంధించిన అనేక డీల్స్‌ క్రమంగా వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ జీబ్రానిక్స్ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్‌ ను అందిస్తుంది.

ధర వివరాలు :
జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌ ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.8999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్‌ 3400 లూమెన్స్ బ్రైట్‌నెస్‌, ఎలక్ట్రానిక్స్‌ ఫోకస్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

Zebronics Pixaplay 22 Projector

ప్రొజెక్షన్‌ వివరాలు :
జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 ప్రాజెక్టర్‌ 63.5 సెంటీమీటర్ల నుంచి 406 సెంటీమీటర్ల వరకు ప్రొజెక్షన్‌కు సపోర్టు చేస్తుంది. అయితే గరిష్ఠంగా 150 అంగుళాల వరకు ప్రాజెక్షన్‌ ను అందిస్తుంది. 1280 x 720 పిక్సల్ నుంచి 1920 x 1080 పిక్సల్‌ వరకు గరిష్ఠంగా రిజల్యూషన్‌ ను అందిస్తుంది. 720p, 1080p, FHD వీడియోలను సపోర్టు చేస్తుంది.

30,000 గంటల :
ఈ ప్రాజెక్టర్‌ LED డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంది. 3400 లూమెన్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మిరాకాస్ట్‌, iOS స్క్రీన్‌ మిర్రరింగ్‌ ను సపోర్టు చేస్తుంది. 30,000 గంటల LED ల్యాంప్‌ సపోర్టు ఉంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్‌ ఫోకస్‌, రిమోటో కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఓటీటీ సపోర్టు కూడా :
జిబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ తో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ సపోర్టును కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 9.0 OS పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌, iOS డివైజ్‌లను సపోర్టు చేస్తుంది. ఓటీటీ యాప్స్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

గేమింగ్‌ కోసం కూడా :
జీబ్రానిక్స్‌ పిక్సాప్లే 22 స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ హోం థియేటర్‌ ప్రొజెక్టర్‌ మోడల్‌ అయినా.. సినిమాలు, టీవీ షోలతోపాటు గేమింగ్‌ కోసం కూడా అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం ఇన్‌బిల్ట్‌ స్పీకర్లను కలిగి ఉంది. ఈ ప్రొజెక్టర్‌ గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.

కనెక్టివిటీ సపోర్టు :
ఈ జీబ్రానిక్స్‌ స్మార్ట్‌ ప్రాజెక్టర్‌ డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, USB, AUX, HDMI వంటి మల్టీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టర్ కేవలం 790 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేందుకు వీలుంటుంది.

ఈ ప్రాజెక్టర్‌ కొనుగోలుతో రిమోట్‌, పవర్‌ అడాప్టర్‌, ప్రొటెక్టివ్‌ స్లీవ్‌, క్వారీ లూప్‌, HDMI కేబుల్‌ వంటి పొందవచ్చు. ప్రస్తుతం ఈ ప్రొజెక్టర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే రిపబ్లిక్‌ డే సేల్‌ లో మరింత తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Zebronics Pixaplay 22 Projector with 3400 Lumens brightness gets price drop on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X