ఫేస్‌బుక్‌లో మీకు తెలియనివి ఎన్నో..!

|

ఫేస్‌బుక్ మనందరి జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. ఈ సామాజిక సంబంధాల మాద్యమం ద్వారానే మనకు కావల్సిన వారితో కనెక్ట్ కాగలుగుతున్నాం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న వివిధ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను పొందగలుగుతున్నాం.

 
 ఫేస్‌బుక్‌లో మీకు తెలియనివి ఎన్నో..!

తక్కువ డేటాలోనూ ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే..?

కొత్త ఫేస్‌బుక్‌లో జాయిన్ అయిన చాలా మంది మిత్రులు ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటంలో తడబడుతున్నారు. కొన్ని సింపుల్ ట్రిక్స్‌ను ఫాలో అవటం ద్వారా మీమీ ఫేస్‌బుక్ అకౌంట్‌లను మరింత సునాయశంగా హ్యాండిల్ చేయవచ్చు. మీ ఫేస్‌బుక్ వినియోగాన్ని మరింత ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దే 10 అత్యుత్తమ టిప్స్ అండ్ ట్రిక్స్‌ను ఇప్పుడు చూద్దాం...

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

ఫేస్‌బుక్‌లో మీరు వాడుతున్న యాప్‌లను వేరొకరు చూడకుండా ఉండాలంటే..?

ఫేస్‌బుక్‌లో మీరు వాడుతున్న యాప్‌లకు సంబంధించిన యాక్టివిటీలను వేరొకరు చూడకుండా ఉండాలంటే ఇలా చేయండి.

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి
స్ర్కీన్ ఎడమ వైపు కనిపించే యాప్ సెక్షన్ క్రింద కనిపించే Moreను సెలక్ట్ చేసుకోండి.
సెట్టింగ్స్ పై క్లిక్ చేసినట్లయితే మీరు ఫేస్‌బుక్ ద్వారా వినియోగిస్తోన్న యాప్స్ కు సంబంధించిన జాబితాను చూడొచ్చు.
ఏదైనా యాప్ ను హైడ్ చేయాలనుకుంటే పర్మిషన్ ను Only Meకి ఎడిట్ చేసుకోండి.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

చికాకు పుట్టించే గేమింగ్ నోటిఫికేషన్స్‌ను టర్నాఫ్ చేయాలంటే

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో గేమింగ్ నోటిఫికేషన్స్ చికాకు పుట్టిస్తున్నాయా..? వాటిని నిరోధించేందుకు ఇలా చేయండి.

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్ రిక్వెస్ట్‌లను టర్నాఫ్ చేయండి. సింపుల్

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్
 

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

ఫేస్‌బుక్ యాప్స్‌ను డిస్‌కనెక్ట్ చేయాలంటే..?

మీ ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ కాబడి నిరుపయోగంగా మారిన యాప్స్‌ను డిస్‌కనెక్ట్ చేయలంటే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సంబంధిత యాప్‌ను ఎంపిక చేసుకుని X బటన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

ఫేస్‌బుక్ నుంచి ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలంటే

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను లింకప్ చేసి.. ఈ రెండు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఒకేసారి డేటాను షేర్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా ట్విట్టర్ అకౌంట్‍‌లోకి లాగిన్ అవ్వండి. ప్రొఫైల్ ఇమేజ్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఫేస్‌బుక్‌ను కనెక్ట్ చేసుకోండి.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని మొత్తం డేటాను ఓ కాపీ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ టాబ్ క్రింద కనిపించే Download a copy పై క్లిక్ చేసినట్లయితే మీ ఫేస్‌బుక్ డేటా మొత్తం ఓ కాపీ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

మీరు షేర్ చేసే పోస్ట్‌లను కొద్ది మంది మాత్రమే చూడాలంటే..?

విజబిలిటీ సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా మీరు షేర్ చేసే పోస్ట్‌లను మీకు నచ్చిన వారి మాత్రమే పంపుకోవచ్చు.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

లాగిన్ అప్రూవల్స్

ఫేస్‌బుక్ లాగిన్ అప్రూవల్స్ ద్వారా అదనపు సెక్యూరిటీని పొందటం ఏలా..?

ఫేస్‌బుక్ లాగిన్ అప్రూవల్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగా మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీని సెలక్ట్ చేసుకుని అందులోని లాగిన్ అప్రూవల్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే ఇతర వెబ్ బ్రౌజర్‌ల నుంచి లాగిన్ అయిన ప్రతిసారీ మీకు లాగిన్ అప్రూవల్‌ను పంపుతుంది.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

మిమ్మల్ని ట్యాగ్ చేసిన ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఆ ఫోటో పై క్లిక్ చేసి క్రింద భాగంలో కనిపించే ఆప్షన్స్ బటన్‌ను సెలక్ట్ చేసుకుని డౌన్‌లోడ్‌ను ఎంపిక చేసుకుంటే చాలు. ఫోటో డౌన్‌లోడ్ అయిపోతుంది.

 

మోస్ట్ వాంటెడ్  ఫేస్‌బుక్‌ టిప్స్

మోస్ట్ వాంటెడ్ ఫేస్‌బుక్‌ టిప్స్

మీకు షేర్ కాబడిన వ్యక్తిగత పోస్ట్ లేదా గ్రూజ్ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయాలనుకుంటే సంబంధిత పోస్ట్ పై కనిపించే బాణం సింబల్ పై క్లిక్ చేసి Tap Off Notifications for this Post ఆప్షన్‌ను క్లిక్ చేస్తే సరి.

Best Mobiles in India

English summary
10 Amazing Things You Didn't Know You Can Do on Facebook. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X