మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

Posted By:

ఆధునిక జీవనశైలిలో భాగంగా స్మార్ట్‌ఫోన్ ఓ నిత్యావసర సాధనంలా మారిపోయింది. ముఖ్యమైన కమ్యూనికేషన్ డేటాను ఎప్పటికప్పుడు భద్రపరుస్తూ మన వ్యక్తి కార్యదర్శిలా వ్యవహరిస్తున్న స్మార్ట్‌ఫోన్ తన లైఫ్ సైకిల్‌లో అనేక సెక్యూరిటీ దాడులకు గురువుతోంది. సెక్యూరిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలోకి హ్యాకర్లు సునాయాశంగా మాల్వేర్లను జొప్పించి డేటాను నాశనం చేయగలుగుతున్నారు. కొన్ని కొన్నిసందర్భాల్లో అవనగాహన లేమితో మనం చేసే చిన్నితప్పిదమే మన ఫోన్‌ను ఇరకాటంలో పడేస్తుంది. స్మార్ట్ ఫోన్ లను సెక్యూరిటీ చిక్కుల్లోని నెట్టేసే 10 సాధారణ తప్పిదాలను ఇప్పుడు చూద్దాం..

మీ ఫోన్‌లో రేడియేషన్ స్థాయి ఎంత..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్‌లు చాలానే ఉంటాయి. ఇలాంటి చోటే మీ ఫోన్‌ను మాల్వేర్లు చుట్టిముట్టే ప్రమాదముంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ముందు ఆచితూచి స్పందించండి.

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

చాలామంది తమ స్మార్‌ఫోన్‌లలో యాంటీ వైరస్‌ను ఇన్స్‌స్టాల్ చేయరు. వాళ్ల ఫోన్ రిస్క్‌లో ఉందనటానికి ఇదే తొలి సంకేతం. యాంటీవైరస్ సపోర్ట్‌లేని ఫోన్‌లను ఏ నిమిషంలోనైనా మాల్వేర్లు చుట్టుముట్టే ప్రమాదముంది.

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

అప్‌డేట్‌లను పట్టించుకోక పోవటం

ఫోన్ పనితీరును మెరుగుపరించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో పాటు అప్లికేషన్ డెవలపర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు. వీటిని ఎప్పటికప్పుడు ఫాలో అవటం వల్ల ఫోన్ సెక్యూరిటీ రిస్క్‌ను దాదాపుగా తగ్గించుకోవచ్చు. కొంత మంది ఈ అప్‌డేట్‌లను ఏ మాత్రం లెక్క్ చేయరు.

 

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

ఒక యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకునే ముందు ఆ యాప్ ఎలాంటిదో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఇలా చేయరు. ఏ యాప్ పడిదే ఆ యాప్‌ను తమ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసేసుకుంటారు. ఈ చర్య సరైనది కాదంటున్నారు నిపుణులు.

 

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీ లింక్ పై క్లిక్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యే కొన్ని లింక్స్ ప్రమాదకర మాల్వేర్లను కలిగి ఉంటాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా మాల్వేర్ మీ ఫోన్ లోని డేటాను నాశనం చేసేస్తుంది.

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ మాల్వేర్లకు మరింతగా అట్రాక్ట్ అయ్యే అవకాశముంది 

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయకపోవటం కూడా సెక్యూరిటీ తప్పిదమేనంటున్నారు సెక్యూరిటీ నిపుణులు. మీ ఫోన్‌కు లాక్ ఏర్పాటు చేయని పక్షంలో ఎవరు పడితే వాళ్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వైర్‌లెస్ కనెక్షన్‌లను ఎప్పుడు ఆన్‌ చేసి ఉంచటం వల్ల కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

జీమెయిల్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ అకౌంట్‌లను లాగ్ అవుట్ చేయకుండా మర్చిపోవటం కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. 

మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు

అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత డేటాను మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేయటం ఏ మాత్రం మంచిది కాదని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. కొంత మంది ఇవేమి పట్టించుకోకుండా తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో పాటు పిన్ కోడ్‌లను ఫోన్‌లలోనే ఫీడ్ చేస్తుంటారు. పొరపాటున ఇలాంటి వారి ఫోన్ హ్యాక్‌కు గురైతే బోలెండత నష్టం వాటిల్లుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 common smartphone mistakes that expose security risks. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot