ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

Written By:

ఆండ్రాయిడ్ ఫోన్ చేతులో ఉంటే, అదో రకమైన భరోసా. లెక్కకు మిక్కిలి స్మార్ట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్‌లో మరింత విప్లవాత్మకం కానున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఓ శక్తివంతమైన సాధనంలా అవతరించిన నేపథ్యంలో ఈ డివైస్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పది ముఖ్యమైన టిప్స్...

Read More : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటోలను ఉచితంగా బ్యాకప్ చేసుకునే అవకాశం

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఫోటోలను గూగుల్ + అకౌంట్‌లోకి ఉచితంగా బ్యాకప్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయవల్సిందాల్లా ఒక్కటే.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోబ్యాకప్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని తదుపరి సూచనలను అనుసరించండి. మీ ఫోటోలు ఆటోమెటిక్‌గా గూగుల్+ అకౌంట్‌లోకి బ్యాకప్ కాబడతాయి.

 

మీ ఫోన్ మరింత వేగంగా రన్ అవ్వాలా..?

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

మీ ఫోన్ మరింత వేగంగా రన్ అవ్వాలా..? అయితే ఫోన్‌లోని animations అలానే transitionsను డిసేబుల్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి About Deviceను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్ బిల్డ్ నెంబర్ మీకు కనిపిస్తుంది. బిల్డ్ నెంబర్ 7 సార్లు ప్రెస్ చేసినట్లయితే మీకు డెవలపర్స్ యాక్సిస్ లభిస్తుంది. డెవలపర్ ఆప్షన్స్‌లో animation scale, Transition animation scale, and Animator duration scaleను మీరు అడ్జస్ట్ చేసుకోవ

ఫోన్‌లో ఎక్కడినుంచైనా గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటున్నారా...?

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

మీ ఫోన్‌లో ఏ స్ర్కీన్ నుంచైనా గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటున్నారా..?, అయితే ‘Ok Google' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. Google App > Google Now > Settings > Voice > Ok Google Detection.

 

గూగుల్ ప్లే స్టోర్‌కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా..?

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో మీకు నచ్చిన యాప్స్ దొరకటం లేదా...? ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే, మీ కోసం అమెజాన్ యాప్ స్టోర్ సిద్థంగా ఉంది. అమెజాన్ యాప్ స్టోర్‌లో దొరికే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌తో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తాయి. ఈ యాప్ స్టోర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘యాప్ ఆఫ్ ద డే' సెక్షన్ కూల్ ఆఫర్స్‌తో మోత మోగిస్తోంది.

 

డీఫాల్ట్ యాప్స్‌ను మార్చటం ఏలా..?

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

ఫోన్‌‍తో డీఫాల్ట్‌‍గా వచ్చిన యాప్ సెట్టింగ్స్‌ను మార్చాలనుకుంటున్నారా..? అయితే సెట్టింగ్స్‌లోని యాప్స్ విభాగంలోకి వెళ్లండి. మీరు మార్చాలనుకుటున్న యాప్‌ను సెలక్ట్ చేసుకుని సంబంధిత టాబ్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇప్పుడు యాప్‌కు సంబంధించి ఇన్ఫర్మేషన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో Clear Defaults పై క్లిక్ చేయండి.

 

జీపీఎస్ మోడ్‌లోనూ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

మీ ఫోన్ జీపీఎస్ సర్వీసులు ఆన్ అయిఉన్నప్పటికి బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. అది ఏలా సాధ్యం అనుకుంటున్నారా..? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ముందస్తుగా బిల్ట్ చేయబడిన ఓ సెట్టింగ్ జీపీఎస్ సర్వీసులను మూడు పద్ధతుల్లో యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాటిలో వివరాలు high accuracy, battery saving, device only. వీటిలో రెండవ మోడ్‌ను మీరు సెలక్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్ బ్యాటరీని మరింత ఆదా చేసుకోవ్చు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Location > Modeను ఎంపిక చేసుకోవటం ద్వారా బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు.

 

హోమ్ బటన్ షార్ట్‌కట్

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

ఫోన్ హోమ్ బటన్‌ను పైకి స్వైప్ చేయటం లేదా హోమ్ బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వటం ద్వారా గూగుల్ సెర్చ్ లాంచ్ చేయాలనుకుంటున్నారా.? అయితే మీకోసం గూగుల్ ప్లే స్టోర్‌లో హోమ్ లాంచర్ యాప్ సిద్ధంగా ఉంది. ఈ యాప్‌కు మీ ఫోన్‌లోని అన్ని యాప్స్‌ను యాడ్ చేయటం ద్వారా కోరిన విధంగా షార్ట్‌కట్‌లను ఏర్పరుచుకోవచ్చు.

 

షట్ ఆఫ్ ఆటో‌కరెక్ట్

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

మెసేజ్ టైప్ చేస్తున్న సమయంలో అవసరంలేని పదాలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతూ ఇబ్బందికి గురిచేస్తున్నాయా..? అయితే, ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Language & inputలోకి వెళ్లి Auto-correctionను టర్నాఫ్ చేయండి.

 

వివిధ లాంచర్స్‌ను ట్రై చేసి చూడండి

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

అదే పాత మొబైల్ ఇంటర్‌ఫేస్‌తో బోరింగ్‌గా ఫీలవుతున్నారా..? అయితే వివిధ లాంచర్స్‌ను ట్రై చేసి చూడండి. అనేక కూల్ లాంచర్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్దంగా ఉన్నాయి. Nova, Yahoo Aviate, ADW , Buzz వంటి లాంచర్ యాప్స్ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

 

పోయిన ఫోన్‌‌లో డేటాను చేరిపేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

మీరు పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ డివైస్, గూగుల్ అకౌంట్ అలానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లయితే లోపలి డేటాను రిమోట్ విధానంలో డిలీట్ చేయవచ్చు.

రిమోట్ విధానం ద్వారా మీ ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయదలచినట్లయితే ముందుగానే మీ ఫోన్‌లో Android Device Manager feature ఎనేబుల్ చేసి ఉంచుకోండి. మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Manager. Now look for 'allow remote lock and erase and switch it on. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్ లేదా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ విధానంలో లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూడొచ్చు. (గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు). ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది. లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు. Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్డీ కార్డ్‌లోని డేటా మాత్రం అలానే ఉంటుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Cool Tips And Tricks Every Android Smartphone User Should Know. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting